Friday, September 8, 2017

అమరవీరుల సాక్షిగా



జాగృతి కవితాంజలి
రవీంద్ర భారతి, హైదరాబాదు.
తేది: 09-09-2017

శీర్షిక : అమరుల సాక్షిగా
రచన : గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు.
సూరారంకాలని, హైదరాబాద్,
9700007653

నా బాస తెలంగాణ....
నా యాస తెలంగాణ....
నా నీళ్ళు.... నా నిధులు....
నా యువకుల కొలువులకై...
పోరాటం చేశారు..
అమరులే అయ్యారు...
ఆ అమరుల సాక్షిగా....
సాధించాం తెలంగాణ ....

ఊరు బాగు కొరకు....
నా వాడ బాగుకొరకు....
కూడుకొరకు... గూడు కొరకు....
కట్టుకోను బట్ట కొరకు...
పోరాటం చేశారు...
అమరులే అయ్యారు
ఆ అమరుల సాక్షిగా...
సాధించాం తెలంగాణ....

పదవులనే ఫణంగా...
పెట్టారు కొందరు...
సకలజనులు స్పందించి... 
సమ్మెనే చేశారు...
యువకులు, విద్యార్ధులంత
పోరాటం చేశారు...
అమరులే అయ్యారు...
ఆ అమరుల సాక్షిగా...
సాధించాం తెలంగాణ....

నిరాహార దీక్షచేసి....
నీరసంగా అయ్యిండ్రు....
తల్లిపిల్ల తేడలేక
రోడ్డు పైన ఎక్కిండ్రు...
ఉద్యోగులు.... మహిళలు...
పోరాటం చేశారు...
అమరులే అయ్యారు
ఆ అమరుల సాక్షిగా...
సాధించాం తెలంగాణ....

మా బతుకులు మారనీకి .....
మా ఉనికి చాటనీకి....
మా గడ్డను ఏలనీకి
మా బిడ్డలు బతకనీకి
చిన్నపెద్ద తేడ లేక
పోరాటం చేశారు...
అమరులే అయ్యారు
ఆ అమరుల సాక్షిగా...
సాధించాం తెలంగాణ....

అమరులార.... అమరులార
మా త్యాగధనులారా....
మీ ఆశయసాధనలో...
మీరు అస్తమించినా....
మీ ఆశయసాధనకై....
మెమునడుం బిగిస్తం
చేయి చేయి కలుపుతాం....
అభివృద్దిని సాధిస్తాం....

జోహార్ జోహార్
తెలంగాణా అమరులారా..
జోహార్.... జోహార్
తెలంగాణా యోధులారా

జోహార్ తెలంగాణా అమరవీరులకు
జోహార్ జోహార్

మీ
సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సినియర్ జర్నలిస్టు
9700007653

No comments:

Post a Comment