Tuesday, August 29, 2017

నా తెలుగు భాష

నా తెలుగుభాష





శీర్షిక : నా తెలుగుభాష

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

అచ్చమైన భాష
స్వచ్ఛమైన భాష..
యాబదారు అక్షరాల
అందమైన తెలుగుభాష నాది..

అచ్చులతో గుణింతాలు..
హల్లులతో ఒత్తులు
అందమైన ఛందస్సు
సరసమైన సంధులు
భక్తితో కూడిన విభక్తులు
సరిజతచేయు సమాసాలు
అందమైన అలంకారాలతో
ప్రకృతీవికృతులు
ఉపమానాలు.. భాషాభాగాలు
ఇలా ఎన్నో ఒదుగుల పొదుగుల
వ్యాకరణాలతో కూడిన
అందమైన తేటతెనుగు భాష
నా తెలుగుభాష.

నుడికారాలు నా భాషకు సుడికారాలు
అష్టావధానం”, “శతావధానం”
“సహస్రావధానం” “సమస్యాపూరణం
నా తెలుగు భాషకే స్వంతం
స్పష్టత, శ్రావ్యత
మాధుర్యం, గాంభీర్యం
నా తెలుగుకే మణిహారం

కాళోజీ అన్నట్టు..
తెలుగు వాడివై తెలుగు రాదనుచు
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా
అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా –

అందుకే తెలుగువారమైనందుకు
తెలుగులోనూ మాట్లాడుదాం...
తెలుగు భాష గొప్పతనాన్ని
భావితరానికి చాటి చెప్పుదాం..

తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలతో
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007653

తెలుగుబాషలోని తేటతెల్లపదము
వ్యాకరణముతోటి వాసికెక్కి
పద్యసంపదున్న పదునైన బాషిది
జ్యోతి నవ్య కృష్ణ జూఁడుమఖిల

--- గోగులపాటి కృష్ణమోహన్