Sunday, January 24, 2016

కృష్ణ కందాల శతక మాల


గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాద్,


తేది : 24 జనవరి 2016
1)
తనుమనమున నీనామము
అనుదినమునునేను దలతు నయ్యా సాయీ!
కనికరమును జూపుమెపుడు
ఘననవ్యజ్యోతి కాంతి కందము కృష్ణా!

2) కం
సాయేకద మనకురక్ష
సాయేకద సర్వజనుల సకలంబాయే
సాయే తలచిన బ్రోవును
సాయేమరి భక్తజనుల సర్వము కృష్ణా

3)
రమణుని శిశ్యుం డీతడు
కమనీయ పదములతోడ కవితలు రాసెన్
రమణీయమైన గణితము
కమనీయముగా రచించె కవితలు వీరా

4)
వీరా చెప్పడు తప్పులు
వీరా రాసెను కవితలు వీరా శతకం
ఔరా అనిపించెకదర
వీరా తన గణితశాస్త్ర విజ్ఙత తోడన్

5)
రాయాలని ఉంది కవిత
తీయాలని ఉందినాకు తీయని కావ్యం
చేయాలని ఉంది రచన
గాయాలనుమానిపించ గతమును కృష్ణా

6)
వీరా బ్లాగులో కవితలు 
వీరోచితముగ మనలకు వివరించెకదా
వీరా రాసెను శంభో
వీరేకద గణితమున కవితలను యల్లెన్

7)
తలిచెద నేమణికంఠుని
తలిచెద నేశభరిగిరుని తలిచిన యంతన్
తలిచిన తలపులు తీర్చగ
కలియుగమునతనువెలసెనుకదరా కృష్ణా

8)
అంబటి భానుడి కవితలు
అంబరమును తాకెనుగద అబ్బుర రీతిన్
అందంగా శతకవితలు
అందించెను నేడు మనకు ఆనందించన్

9)
మాలాధారణచేసిన
మాలేకద మాకురక్ష మమురక్షించా
మాలతొ కదరా మనలకు
మాలామృత మహిమ తెలిసె మహిలో కృష్ణా

10)
వేసితి మాలను నేనూ
లేసితి నలుబది దినములు వేకువ జామున్
చేసితి షోడష పూజలు
చూసితి షణ్ముఖునిమాయ చూడగ తరమా!

తేది:  25 జనవరి 2016
11) 
శివశవయని పలికినచో
శివుడే  నిలుచును ఎదురుగ సత్యము యిళలో
శివుడే అభయుడు మనలకు
శివనామమె స్మరయించు శుభమౌ  కృష్ణా

12)
అదిగోవచ్చెనుఎన్నిక
ఇదిగిదిగోజనముచేరె ఇరుకున కొట్లో
అదియేకదమన ఓటరు
ముదమున తనవోటునమ్ము మనజుడు కృష్ణా

13)
ఒక్కరెకద వోటేయును
ఒక్కరెగద గెలిచి నీకు బొక్కలు చూపున్
ఒక్కరెకద సీటెక్కగ
లెక్కలు సక్కగ తెలపక వెలుదురు కృష్ణా

14)
నీతే దప్పిన నీకును
రాతే రాసెను కదలక రాయై బ్రహ్మా
రీతిగ బతుకుము ఇకపై
నీతిగ నలుగురిని మెప్పి నిలువుము కృష్ణా 

15)
అమ్మే గదరా మనకున్
కమ్మని పలుకుతొ మనమున కొలువై నిలిచెన్ 
అమ్మేకద మనకఖిలము
అమ్మే దైవము మనకిక యిళలొ కృష్ణా

16)
శ్రీ గుడిపల్లి వీరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో... 
చిరు కంద కానుక...

వీరుడు పుట్టిన రోజిది
వీరా తలచిన తలపులు విజయము గాంచున్
ఆరోగ్యము లందించగ
రారా కాపాడగ నువు రమణుని కృష్ణా

17)
తనయులు పుట్టిన చాలదు
వినయముతోపెరగవలెనువిజయము కొరకై
కన్నందుకుతలిదండ్రి
నినుచూసి పొంగి పొరలగ నిజమిది కృష్ణా 

18)
చదువుకొనిన చాలుకదా
కొదవుండదు తెలివితేట కోరగ నీకున్
చదువుమురాశ్రద్దగనువు
చదువే నినుచక్కబెట్టు చదువుము కృష్ణా

19)
ఏమని తెలుపుదు హితులకు
ఈమది తలపున మెదిలిన వలపులు మీకున్
ఆమని పాడిన పాటలు 
నామధి రంజింపలేదు నమ్ముము కృష్ణా

20)
ఉదయమ్మున చదువుకొనిన 
మదియందున పదిలముగనె మెదులును గదరా
అధికముగా గెలుపొందగ
ఉదయంబున లేచినీవు చదువుము కృష్ణా

తేది : 26-01-2016
21)
గోదావరి తట శిరిడీ
అందే ఉన్నది కలియుగ మందే సాయీ
హృదయ అంతరములలో
బృందావనమే కదా మరందము కృష్ణా

22)
జీవాధారుడు తానే
పావన అనగాయుడుమన పావన సాయీ
బ్రోవగ భక్తుల నెప్పుడు
నీవే సర్వము సఖలము నిక్కము కృష్ణా

23)
శరణాగతవత్సలతను
కరుణను మామీద చూపి కరుణించయ్యా
పరమేశ్వర సుర సాయీ
పరమ దయాళ పరమాత్మ పావన కృష్ణా

24)
అసహాయ సహాయుడతడు
రసమయ కరుణా పరాత్ప రాయుడు సాయీ
అసమాన దయాసాయీ
మసకలు తొలగించి మమ్ము మోయుము కృష్ణా

25)
భక్తావనవందితాయ
భక్తానుగ్రహ మహాయ భందువు సాయీ
భక్తిశక్తిప్రధాయ
భక్తావన ప్రతిజ్ఙాయ భాందవ కృష్ణా

26)
మునిసంఘనివేషితుడవు
అనంతదిత్య సుగుణాయ కరుణా రూపా
కనుమయ్యామణికంఠా
కనికరముతొనీమనమున కావుము కృష్ణా

27)
భుజంగభరణోత్తమాయ
గజాననగ్రజ మహా సుగుణజుడు శాస్త్రా
సుజనుల సులోచనాయా
నిజముగ జగదీశ్వరాయ నీవే కృష్ణా

28)
నిత్యాయనిత్యపూజిత
సత్యాయ సుగుణ ధరాయ సుమనస రూపా
దైత్యమధనాయ భలినే
అత్యాద్భుత ముద్రధారి నీవే కృష్ణా

29)
వీరాయ వీర ధన్వినె
ధీరాయ నిరుగుణరూప ధీరోద్దారీ
తారాసుర సంహారా
మూర్తాయ సకల మహోధ మునిపూజ్యంతా

30)
సతతోత్దితాయ భవాయ
సతతము నిన్నే కొలెచెద సత్యము దేవా
సతులే సిద్దీ బుద్దీ
పతుడవు విఘ్నము తొలపగ పూష్ణే కృష్ణా

27 - 01 - 2016
31)
వసుధారిణ్యైదేవ్యై
వసుధా ఇందిర హరిణ్య విష్ణో పత్న్యై
వసుధా  కృష్ణ ప్రియసతి
రుసరుసలనుమానిమములరక్షణజూపే

32)
సూర్యగ్రహపూజించుము
సూర్యున్నేతలచునీవు సూక్ష్మం గానూ
సూర్యధ్యానమ్ తోడను
సూర్యారిష్టలుతొలగును సత్యము కృష్ణా

33)
మనసున పీడలు కలిగిన
మనమంతాకొలవవలెనుచంద్రుని నిత్యం
మనసే కదమరి ముఖ్యం
మనసున నిత్యం కొలవుము మామను కృష్ణా

34)
రోగము కలిగిన మనలకు
అంగారకుడే కద ఆర్చును కష్టం
రోగారిష్టముతొలచుట
అంగారకునిచెకలగును అంజలి కృష్ణా

35)
బుద్దికి కలగిన పీడను
బుద్దిగ భక్తితొ బుదునికి పూజలు చేయుమ్
బుదుడే కదమరి మనలకు
బుద్దిని కలిగించి తొలచు బాదలు కృష్ణా

36)
పుత్రోత్సాహమె కావలె
పుత్రుల పీడోపశాంతి పోవలెయన్నన్
పుత్రుల ఇష్టుడు గురుడే 
పుత్రుల పీడను తొలచును పూజతొ కృష్ణా

37)
పీడలు ఎన్నో ఉన్నను
జాడకు పత్నీ మనలను జోరగ పీడ్చున్
పీడతొలగపూజించుము
పీడో శాంతికి శుకృడి పూజలు కృష్ణా

38)
శనిపూజలుచేయుమురా
శని కలిగించును మన శమనము పీడన్
తృనమున తొలగును పీడలు
శనికి మనము తిలము తోడ శక్తితొ కృష్ణా

39)
శమనాయునిపూజలతో
కమనీయముగా తొలగును కంటికి పీడన్
శమికింకరుడేరాహువు
నమమే నీకు యసురేష నవమేదాత్రే

40)
అనఘారాహోర్దాయా
వనస్థితో జ్ఙాన పీడితాయా కేతుం
మనముతొ కొలచిన కేతున్
ఘనముగ కలుగును జగతిన జ్ఙానము కృష్ణా

28-01-2016
41)
తెలిపితిరిచందమూలాల్
కలిపితిరి గణ పదములను కయ్యము లేకే
తెలిపె మధు విజయగార్లున్
మలిపిరి మము పధ్యరచన మంచిగ కృష్ణా

42)
గోమాతనుపూజించిన
గోమయ, గోమూత్రములతొ గోక్షీరంబున్
గోమాతే పూజ్యంతూ
గోమాతే సర్వసంధిగోవున్ కృష్ణా

43)
శ్రీగోశృంగేవిష్ణూ
శ్రీగోవుధరేపృధఁవిశ్రోణీపిత్రూ
శ్రీగోఖరాగ్రెపన్నగ
శ్రీగోరంగేషుసర్వ శ్రీకృతి కృష్ణా 

44)
గురురాఘవేంద్రదేవా
నిరవద్య గురవె భవాయ నిర్గుణ రూపా
నిరసత దోషాయ అనగాయ
ఉరసా శిరసా నమామి గురుగణనాధా

45)
శూరాయ మహా భలాయ
ధీరాయ సుగుణ శుచాయ ధీరోద్ధారా
కారాగృహ మోక్షకాయా
మారుతి రూపా మములను మార్చగ  రావా

46)
తెలుగంటే నాకు భయము
తెలుగంటే వ్యాకరణము తెలుగే కష్టమ్
తెలుగంటే ప్రేమేమరి
తెలుగును నే నేర్చుకుందు తప్పక కృష్ణా

నానార్ధాలతో ప్రయోగము
47)
ఆత్మయనిన గమనము              
ఆత్మయె మరి యాధారము ఆకసము కదా
ఆత్మయనిన నిజము మనసు
ఆత్మయె జీవాత్మ బుద్ది ఉన్నతి కృష్ణా 

48)
అమ్మే కద మాతయనిన
అమ్మే కద తల్లి యనిన అమ్మే సర్వం
అమ్మే కద భూమాతా
అమ్మే కద భరతమాత అమ్మే కృష్ణా

49)
తండ్రేకద అయ్య అనిన
తండ్రేకద నాన్నగారు తండ్రే  బాపూ
తండ్రేకద మనకు హితుడు
తండ్రే మరి మార్గదర్శి తండ్రే కృష్ణా

50)
భార్యేకద సతి భామ
భార్యే సహచరి కళత్ర భార్యే పెళ్ళాం 
భార్యే మరి ఆలి సతీ
భార్యామణి ధర్మపత్ని భార్యే కృష్ణా

51)
ప్రేమంటే వాత్సల్యము
ప్రేమే నమ్మిక అనురతి ప్రియతనమేగా
ప్రేమే మక్కువ మచ్చిక
ప్రేమంటేనే మురిపెము ప్రేమము కృష్ణా

52)
ప్రేమేకద అనురాగము
ప్రేమే పాశము నిరతము ప్రణయము నెమ్మీ
ప్రేమే కూరిమి గారము
ప్రేమే అభిమానగోము ప్రేమతొ కృష్ణా

53)
ప్రేమే మరి ఆప్యాయత
ప్రేమే మమకారము మన ప్రేమే ఇంపూ
ప్రేమే కద గారాబము
ప్రేమే మారాము మలిమి ప్రేమతొ కృష్ణా

54)
ప్రేమేలే అభిమానము
ప్రేమే మరి మరులు మమత ప్రేమించంగన్
ప్రేమే లే వ్యామోహము
ప్రేమే లే వలపు మమత ప్రేమే కృష్ణా

55)
అనుబందము ప్రియతత్వము
అనుగునెనరు ఆదటన్న అమరముప్రేమై
అనురక్తి నెయ్యం ప్రేమే
అనురాగము ముచ్చట సుమి అభిమతి కృష్ణా

29-01-2016
56)
ధరణి యనిన భూమేకద
ధరణీ ఖగవతి జగత్తు ధరణము గౌరీ
గిరికర్ణిక ఇల అవనీ
ధరణీ పృధవీ ధరిత్రి ధాత్రీ కృష్ణా

57)

వృక్షో రక్షో రక్షిత
వృక్షములను పెంచము రక్షించవలే
వృక్షో నాస్తీ శూన్యం
వృక్షములిక లేకున్నను విలయమె కృష్ణా

58)
తినడానికి తనకుండదు
తనపశువులకుయికమేత తెచ్చుట కష్టమ్
తనకిష్టములేకున్నను
తనపశువులనమ్మబోయె తక్కువ దరకున్

59)
రైతేరక్షోరక్షిత
రైతేకద మనకురక్ణ రైతే సర్వం
రైతే మనకాధారము
రైతును కాపాడవలెను రంజుగ కృష్ణా

60)
సంపద కలిగిన వాడికి
ఇంపుగ తొలగించుయప్పు బ్యాంకులు రీతిన్
సంపాదన లేనోడిని
సంపైనా బ్యాంకుతెచ్చు సుంకము కృష్ణా

61)
మహిళే కదమన మాతా
మహిళే కద అక్క చెల్లి అన్నీ తానే
మహిళే కద ఆంటియనిన
మహిళే మరి అమ్మ బామ్మ మహిలో కృష్ణా

62)
మహిళో రక్షో రక్షిత
మహిలో మహిళే కదమరి మనకున్ రక్షా
మహిళలు లేకుండమనకు
మహిలో మన్నికనెలేదు మరవకు కృష్ణా

63)
పోలీసులెకద రక్షణ
పోలీసులెదిక్కుమొక్కుదీనులకెపుడున్
పోలీసులెలేకున్నను
పాలిట లేదాయె రక్ష ప్రాణికి కృష్ణా

64)
ఊష్ణాంశుడు ఆదిత్యుడు
ఊష్ణకరుడు అహిమాంశుడుధరతి రవియే
ఊష్ణుడు దినకరుడు ఇనుడు
ఊష్ణరశిమి అరుణకిరణు డుష్ణుం డితడే

30-01-2016
65)
గ్రేటర్ ఎన్నిక లొచ్చే
రాటుగ  తిరుగుతు పలువురు మాటలె జెప్పే
దీటుగ ఓటరు ఓటుతొ
ఘాటుగ రుచి చూపెడదరు గెలుపును కృష్ణా

66)
గ్రేటరు ఎన్నిక లోనా
చాటుగ డబ్బులు వరదల చల్లిన గానీ
లేటుగ లేచిన ఓటరు
నీటుగ గెలిపించు తనకు నచ్చిన నేతన్

67)
పోరేమోస్పీడుపెంచె
కారూ సైకిల్ కమలము కదమున హస్తం
హోరుగ పతంగి ఎగరగ
తీరును గమనించుచుండె ఇతరులు కృష్ణా

68)
నగరమున నేడు మ్రోగెను
నగర భవిత తెలియజేయు నాందికి గంటా
నగరము నడిబొడ్డుకొరకు
నగరములో జరుగుచుండె నెన్నిక కృష్ణా

69)
ఎవ్వరు నిలిచెను భరిలో
ఎవ్వరు గెలిచెదరునేడు ఎన్నిక ఝరిలో
ఎవ్వరు ఎవరో తెలియదు
ఎవ్వరు గెలచిన నగరము మెరుగవు కృష్ణా

70)
ఓటే వేయుము ధీటుగ
ఓటే మనహక్కుదిక్కు ఓటే సర్వం
ఓటును డబ్బుకు అమ్మకు
ఓటే నీ భవిత మార్చు చోటౌ కృష్ణా

30-1-2016 (గాంధీ వర్ధంతి సంధర్భంగా)
71)
చేతిలొ కర్రనె బట్టే
శాంతియె తన ఆయుధంగ శంఖము ఊదెన్
ధోతీ వాలా గాంధీ
రాతనె మార్చంగ భరత జాతిన కృష్ణా

72)
పరదేశీపాలనలో
చెరనుండి విముక్తిచేసి చెంతే దీర్చెన్
కరమున కర్రతొ గాందీ
నరనరమున నింపెమనకు నవ్యానందం

73)
గాంధీతాతను చంపెను
భందీగానిలిచె గాఢ్సే భరతమునందున్
మందీ మార్భల ముండిన
గాంధీజీనొదలలేదు గాఢ్సే కృష్ణా

74)
ఏతీరుగనిను పిలుతుము
ఏతీరుగ నినుదలతుము ఏమని బాపూ
చేతులు జోడించి నిన్నే
నీతిగ నిలుతుము నిరతము నీలా కృష్ణా

75)
గాంధీమనజాతికిపిత
గాంధీజీమార్గదర్శి ఘనముగ మనకూ
గాందీజీ కలలుగనిన
గాంధీయిజభారతాన్ని అందిద్దామూ

31-01-2016 (బాల్యం గుర్తులు)
75)
అదిగో బాల్యపు గుర్తులు
ఇదిగో ఎంతగ మరచిన ఇచటనే ఉండున్
కదిలే కాలము తోడను
మదిలో నిత్యము తొలచును మమతలు కృష్ణా

76)
ఆటలతోటేస్నేహము
ఆటల తోటే కలహము అదియెట్లన్నన్
ఆటలలోగెలుపోటమి
కూటమిలను కలుగజేయు కూరిమి తోడన్

77)
పీరుల పండుగ వచ్చిన
ఊరిలొ పీరులు ఎగురును ఊరేగింపున్
పీరుల పండుగ రోజున
జోరుగ ఆలువ తిరుగుతు చోద్యము చూద్దుర్

78)
పండుగ లొచ్చిన సెలవులు
అండగ ఉందురు మితృలు ఆటలు యాడన్
నిండుగ బందువు లొత్తురు 
వండిన వంటలు తినెదరు వడివడిగానూ

79)
కూనూరులొ పుట్టిపెరిగి
భోన్గీరులొ చదువుకొంటి భోగము తోడా
బాల్నగరుకు బతకొస్తీ
నేనూరిని మరిచి నాను నేర్పుగ కృష్ణా

80)
పోరాటాలనుజేసీ
తీరాలను దాటుకుంటు తీరిక కోసం
వూరూరా తిరిగొస్తిని
సూరారంలోననుంటి సుఖముగ కృష్ణా 

81)
(వీరారెడ్డి గారు "తిట్టుము" అనే ఆంశం పై కవితలు రాయమని అవేరా గారికి చెప్పగా తట్టిన ఆలోచన పద్యరూపంలో)

తిట్టిన తిట్టును తిట్టక
తిట్టన వాడే ఘనుండు ఏదెటులున్నన్
తిట్టుము అని యనగానే
తిట్టెను వీరను అవేర తీపిగ కృష్ణా

82)
(అవేరా ఇచ్చిన "కవ కువ కవి" పదాలతో పద్యరచనా ప్రయత్నము)

కవనము లల్లగ కవులున్
కువనములవలెయగుపించె కవితలు యెల్లన్
కవికవనములేకదరా
కువకువలుగ వినిపించును కవులకు కృష్ణా 

83)
(సహస్ర కవయిత్రి అరుణ అలిగెనని అందరు అనుకోగా రాసిన కవిత)

అలుగుట యన్నను యెరుగదు
అలకలు యేల యనుచుండె అరుణే యెపుడున్
అలుగుట యెరుగని అరుణే
అలిగిన నాడా ఫణీంద్రుడలుకలు దీర్చున్

84)
(అవేరా గారు ఇచ్చిన పదాలు " శివ, భవ" నవ లతో పద్యరచన)

శివ శివ యని తలచిననే
భవహరుడేతెంచునుకదభక్తుల బ్రోవన్
శివుడే కద అభయహరుడు
శివుడే నవనాయకుండు శివుడే కృష్ణా

85)
(అవేరా గారిచ్చిన వినండి, కనండి, మనండి, కొనండి పదాలతో పద్యరచనా ప్రయత్నము) 

మంచిని వినండి తప్పక
కంచిని మరువక కనండి కనులారంగా
పంచమనండి ఫలమును
కొంచెము భక్తిని కొనండి కోరిక తోడన్

తేది: 01-02-2016
86)
గోడలు కూల్చుము కులముల
గోడలు కూల్చుము మతముల గొడవలు వలదూ
గోడలె మన ఎదుగుదలకు
గోడై నిలుచుందికదర గొడవకు కృష్ణా

88)
ఆలూ మగలూ ఇద్దరు
పాలూ నీళ్ళూ విధముగ బాగుండాలీ
ఆలే కద అన్నింకను
తాలికొరకెతానుపడును తాపత్రయమూ

89) 
(శ్రీ గుండు మధుసూధన్ గారి సమస్యా పూరణాలకు స్పందించి రాసిన పద్యము)

అక్షరములతోటేతను
లక్షణముగ యాడుకొనును లఘుగురువంటూ
భక్ష్యములేమధుసారుకు
తత్ష్కణమేపద్యమల్లుధన్యుడు కృష్ణా

90) (కందములో వచ్చే గణాల గురించి సూక్ష్మ వివరణ)

భగణములోయాదిగురువు
జగణములో మద్యగురువు జగమున కందం
సగణములోఅంత్యగురువు
గగగురువులు నలలఘువులు ఘణముగ కృష్ణా


91
 (గగ నలములతో ప్రకృతి అందాలను కందంలో బందించే ప్రయత్నము)

తలతల మెరెసెను మెరపులు
ఫలఫల ఉరిమెను ఉరుములు భయములు  కాగా
జలజల కురిసెను చినుకులు
కొలనులొ విరెసెను  కమలము కొలదిగ  కృష్ణా

92)
అరాశ గారిచ్చిన కాపాడు కోరాడు తాగాడు పోతాడు పదాలతో పద్యరచన ప్రయత్నం

కోమలి ఆడుము కృష్ణా
గోముగ అలరాడుమాతొ గోపిక లోలా
ప్రేమగచిరుగాడుపులతొ
ప్రేమగ తాగాడు నాడు పూతన పాలు

93) 
(కవి మితృలు అంజయ్య గౌడ్ గారు శతకవితలు పూర్తి చేసిన సందర్భంగా పద్య కానుక) 

అంజన్న వ్రాసె శతకము
మంజీర నినాదముల వలె మధురము గాగన్
రంజుగ వ్రాసెను పద్యము
అంజన్నా అందుకొనుము అంజలు లివిగో

02-02-2016
94)
ప్రేమంటెకాదు ప్రేయసి
ప్రేమే మాతాపితరులు ప్రేమయె సర్వం
ప్రేమే ప్రేయసి కాదుర
ప్రేమించేవారికొరకు ప్రేమను పంచుమ్

95)
రంగందముండియేమీ
యింగితముతొయుండవలెను యెల్లర జనులున్
సంఘము లోరంగుకన్న
యింగిత మున్నోలకేను యిలువలు కృష్ణా

96)
ఈర్షా ద్వేషాలువలదు
హర్ష్యావ్యతిరేకములును అసలే వద్దూ
ఈర్షా ద్వేషాలె కదర
హర్షము లేకుండజేసు అవనిలొ కృష్ణా

97)
సుఖమే కద సంతోషము
సుఖమే లేకుంటెమనిషి సూక్ష్మంగానూ
సుఖమే సద సంతోషము
సుఖమున్నది సేవలోన సుందర కృష్ణా

98)
తలచకు కీడును మదిలో
తలచిన కలుగును మనలకు తగువులు  యెన్నో
కలవకు కీచక మిత్రుని
వలదుర నీచపలవాట్లు వసుధలొ కృష్ణా

99)
చదువే కదరా భవితా
చదివే కదమనకురక్ష చదివిన యంతన్
చదువే మరి సర్వస్వము
చదువే మరి చదువవలెను చదువుము కృష్ణా

100)
కందములేవందాయెను
అందముగాకవనములనుఅందించితిగా
చంధో రీతిగ నడపగ
ఎందరొ కలరే గురువులు వందన మిదియే


లింగని గని తాను లేచిపోయె

101)
మనసెరిగిన మగనికొరకు
అనువనువునవెదికెమామ అల్లుని కోసం
కనిపెట్టినభామదిగని
తనలింగని గని తనులేచిపోయె

102)
తెల్లనికురులనుచూడుము
ఎల్లరకునువచ్చుచుండె ఏమని తెలుపన్
నల్లగ మారుట కెన్నియొ
కొల్లలుగావచ్చెనేడు కలరులు కృష్ణా

103)
అల్లమనినతెలుసునుకద
బెల్లమువలె పుల్లగుండు భలెబాగుండున్
పుల్లటి బెల్లమె అల్లము
సల్లగ తేనీరువలెనె సేవించవలెన్

104)
తప్పుడు పనులను చేయగ
తిప్పలు దప్పవు ఎవరికి తెప్పలు గొచ్చున్
తప్పులు జేయుట కంటెను
ఒప్పుగ బతుకుట నయముగ ఓరిమి తోడన్

*********************************
★ వందన సమర్పణ ★

నేటికి నా కంద పద్య శతక యజ్ఙము పూర్తయినది.
ఎన్నో తప్పొప్పులు తడబాటులు, పలుమార్లు గతి తప్పిన యతి ప్రాసలు. అయినా ఎప్పటికప్పుడు తప్పులనెంచితూ... సవరణలను చేసి సూచనలను అందించిన పద్య కవులు, భాషాప్రవీణులందరికీ...🙏 కంద వందనాలు.... 
ముఖ్యంగా
ఇందులకు నాకు ఎంతగానో సహకరించి ప్రోత్సహించిన మధుసార్ గారికి, విజయ ద్వయాలకు, వీరా, అవేరాలకు, అంజన్న, చంద్రన్నలకి, అరాశ గారలకు, కడబాల మరియు ఇతర మిత్రులకు, కవయిత్రులకు నా హృదయపూర్వక నమస్కృతులు యెలియజేస్తూ తప్పులున్న క్షమించగలరని ప్రార్ధన...
మీ
కవి మితృడు

గోగులపాటి కృష్ణమోహన్
9700007763

Friday, January 22, 2016

రాక్షస రాజకీయం

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు,
సూరారం కాలని, హైదరాబాద్.

శీర్షిక : రాక్షస రాజకీయాలు

అసలు కుల, మత, గోత్రాలు ఎలా పుట్టాయి

నమ్మకాలే మన మతాలు
రక్తసంబందాల కోసం గోత్రాలు
చేతి వృత్తుల ఆధారంగా కులాలు
ఉద్భవించావన్నది ముమ్మాటికి నిజాలు..

కానీ....నేటి కుళ్ళు రాజకీయాలకు
కుల, మతాలే ఆయుధాలయ్యాయి...
మారణహోమాలకు కారణాలయ్యాయి...

అంతరిక్షానికి వెలుతున్న తరుణంలోనూ
అసమానతలు... అంటరాని తనాలు...

ఓట్లకోసం రాజకీయాలను కుళ్ళు చేస్తున్నారు మన నాయకులు ....

ఆదిపత్యం కోసం ఒకడు
పదవీ వ్యామోహం కోసం ఇంకొకడు
అఙ్ఞానంతో ఒకడు... విజ్ఞానంతో ఇంకొకడు
ఇలా ఎవడికి వాడు
యమునాతీరుగా.....
వాస్తవాలను మరిచి వీధికెక్కుతున్నారు
వీధి కుక్కల్లా వాగుతున్నారు....

ఒకప్పుడు దారిద్ర్యము తో అలమటించే వాన్ని"దళితులు" గా పేర్కొంటే
నేడు ఆ పదానికి విలువ లేకుండా చేస్తున్నారు నేటి బడా బాబులు...

దళిత బోర్డుతో కొందరు కార్లలో ....
మరికొందరు బహుళ అంతస్తుల భవనాలలో బతుకీడుస్తున్నారు....
దళితులంటే వీరా?
అని ప్రశ్నించే విధంగా ప్రవర్తిస్తున్నారు...

కాని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారి బతుకులలో మాత్రం మార్పు లేదు... రాదు...
ఎందుకంటే వారిలో మార్పువస్తే ఇక ఈ  నాయకులకు పనిఉండదు కదా...

అందుకే...అందుకే చెబుతున్నా....

"దరిద్రులంతా.... దళితులు కారు....
దళితులంతా... దరిద్రులు కాదు...." అని.

నేడు దారిద్ర్యము అనుభవిస్తున్న వారిలో
చాతుర్వర్ణస్తులు ఉన్నారు....
అన్ని మతస్తులు ఉన్నారు....
పండితులు ఉన్నారు....
పామరులు ఉన్నారు....
చేతి వృత్తులవారు ఉన్నారు....
కుల వృత్తుల వారు ఉన్నారు....
రైతులు ఉన్నారు.....
రోజు కూలీలు ఉన్నారు....
రాజకీయ నాయకులున్నారు....
రౌడీలు ఉన్నారు...

ఇలా ఎందరో నేడు దారిద్ర్యం అనుభవిస్తున్నారు....

దళితనాయకులమని చెప్పుకునే నాయకులారా....
నిజంగా దళితోద్దరణే మీ నినాదమైతే...
దారిద్ర్యం అనుభవిస్తున్న అందరినీ దరికి చేర్చండి....
కుల గోత్రాలు అడగకండి....

కులం పేరుతో రాజకీయాలు చేస్తున్న నాయకులారా..... నిజంగా కులోద్దారనే మీ కల అయితే.....
కులవృత్తులనే నమ్ముకొని కూటికోసం తపిస్తున్నవారిని ఆదుకోండి....
అగ్రకులాలని చూడకండి....

మతం పేరుతో మారణహోమానికి పాల్పడుతున్న మతోన్మాద నాయకులారా...
మతోద్దారనే మీ అభిమతమైతే....
మతంలోని మంచితనాన్ని చాటండి.....
మారణహోమాల్ని మత మార్పిడిలను ఆపండి....

ఇకనైనా మెల్కొనండి
కులం పేరుతో... మతం పేరుతో...
రాజకీయాలు మానండి.....
అసమానతలు, అంటరాని తనాలు లేకుండా చేయండి....

ఈ జగతిలో రెండుకులాలే అని నమ్మండి.... అవి
ఒకటి  ధనికులమైతే...
రెండు పేదకులం....

పేదల కోసం పాటుపడండి
నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఎలుగెత్తి చాటండి....

రాక్షస రాజకీయానికి తెర దింపండి
నిస్వార్ధ రాజకీయానికి తెర లేపండి

మన రాజ్యాంగ నిర్మాతల కలలు
సాకారం చేయండి....
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి....

ఇదెక్కడి న్యాయం....

అయిత కవితా యజ్ఙము
SK 326 - 20

గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు.

అంశం : సామాజికం
శీర్షిక: ఇదెక్కడి న్యాయం

చిన్న దొంగలను బట్టి చితకబాదుతారు
పెద్ద దొంగలకేమో పట్టం కడతారు

వందగజాలోన్ని ఉరికిచ్చి తంతారు
వందల ఎకరాలు అప్పనంగిస్తారు

చిన్న అప్పులోలను నలదీస్తు ఉంటారు
కోట్లుఎగగొడ్తేమో కొంచమైనా అడగరు

అప్పు కావాలంటే కాలేల బడుతారు
అప్పుతీర్చమంటే కేసుపెడతంటారు

ప్రభుత్వ సార్లే పాఠాలు చెబుతారు
వారి పిల్లలేమో ప్రయివేట్కు వెలతారు

పేదోడి బియ్యము పక్కదారినపట్టె
బక్కోడికి ఒక్కరూపాయి రేషనే కరువాయె

కాంట్రాక్టుల పేరుతో కాసులపంట
కానరాదు ఎచట అభివృద్ది పంట

ఓట్ల పేరుతోనే ఖర్చు పెట్టె కోట్లు
గెలిచినాక చూడు నిధులకు తూట్లు

పైసలున్నోడికే మీడియాలో చోటు
డబ్బులేనోడికి అన్నీ అగచాట్లు

ఇదెక్కడి న్యాయమని అడిగెటోడే లేడు
అడిగినాడంటే వాడౌవుతాడు పిచ్చోడు

బయమేల సోదరా కలముండ నీకడ
కవనములతోడనే నిలదీయగలవురా

భయం... భయం

అయిత కవితా యజ్ఙం
SK 326 - 22
గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు.

శీర్షిక : భయం... భయం

తల్లి కడుపుల బిడ్డకేమౌతదో అన్న భయం
బయటపడ్డ బిడ్డ బ్రతుకుతాడా అని భయం
బ్రతికిపోయిన బిడ్డ పాకెదాక బయం
పాకుతున్న బిడ్డ నడిచేదాక భయం
నడుస్తున్న బిడ్డ పరిగెడుతాడని భయం
పరుగిడిన బిడ్డ ఎగురుతాడని భయం
ఎగిరుతిన్న బిడ్డ పడతాడని భయం
పడిపోయిన బిడ్డ బడికెళ్ళడని భయం
బడికెళ్ళిన బిడ్డ కు ఫీజుల భయం
ఫీజు కట్టిన బిడ్డ చదవడని భయం
చదువుతున్న బిడ్డ కు పరీక్షల భయం
పరీక్ష రాసిన బిడ్డకు ఫలితాల భయం
పాసైన బిడ్డకు పై చదువుల భయం
చదువుకున్న బిడ్డకు ఉద్యోగ భయం
ఉద్యోగ మొచ్చాక పెళ్ళీల భయం
పెళ్ళైన బిడ్డకు పెండ్లాం తో భయం
పెండ్లాం మొచ్చాక సంపాదన భయం
సంపాదించిన గాని సుఖం కై భయం
సుఖం ఉన్న బిడ్డకు పాప పుణ్యాల భయం
పాప పుణ్యాల తరువాత సావుపై భయం
సచ్చిన తరువాత మరోజన్మ కై భయం
పుట్టిననాటి నుండి సచ్చేదాక భయం
పుట్టిన ప్రతివాడు సస్తాడని తెలిసినా చావు పుట్టుకల మధ్య ఎందుకీ భయం....
ఎందుకీ భయం.......

Thursday, January 7, 2016

జర్నలిస్టు బ్రతుకునౌక



శీర్షిక: జర్నలిస్టు బ్రతుకునౌక

చావలేక బతకలేక
ప్రతినిత్యం చచ్చుకుంటు
తమ మనసులు చంపుకుంటు
పరువు కొరకు పాకులాడి
కలమమ్మను నమ్ముకుంటూ
బ్రతుకు బండి నడుపుకుంటూ
సాగుతుంది మా నౌక
జర్నలిస్టు బతుకు నౌక

ఊరూరూ తిరుగుకుంటూ
వాడ వాడ తిరుగుకుంటూ
వార్తలన్ని సేకరించి
అందంగా తీర్చిదిద్ది
గల్లి వార్త డిల్లిదాకా
డిల్లి వార్త గల్లి దాకా
చేరదీసుకొస్తన్నా....
పర్మినెంటు లేని బతుకు

బయట జనం మమ్ముల్ని
మీకేంతక్కువంటారు
మోసగాళ్ళు అంటారు
బ్లాక్ మెయిల్ అంటారు
లంచగాళ్ళు అంటారు
వైట్కాలర్ బతుకంటరు
దొరల్లాంటి దొంగలంటరు
సంపాదన మస్తంటరు

ఇంట్లో సామానంటరు
ఏమివండమంటారు
ఫీజులేవి అంటారు
రెంటేది అంటారు
పాలోడికి అంటారు
ఇంకేదేదో అంటారు
ఏంతెచ్చావంటారు
జేబులు ఖాలీ అంటే

కూలోడు నయమంటారు
కూలికి పొమ్మంటారు
సంపాదన చేతగాంది
సోకులెందుకంటారు
ఎవరికి చెప్పినా గాని
మార్పులేని మా బ్రతుకు
నవ్వులాట మా బ్రతుకు
నవ్వుకొరకే మా బ్రతుకు

నెల జీతం మాకు రాదు
రోజు రాబడి మాకు తెల్వదు
టార్గెట్ లు చేయకున్నా...
క్యాలెండర్ నింపకున్నా....
పై సార్ల మాట వినకున్నా
దళారి పనులు చేయమన్నా
పని మాని పొమ్మంటరు
ఇంట్లనే కూకోమంటరు

ఇదే ఇదే మా బతుకు
నిత్యం వార్తలు తీసే
సదరు జర్నలిస్టు బతుకు
నవ్వులాట మా బ్రతుకు
బ్రతుకు బండి నడపలేక
సావలేక బతకలేక
సాగుతుంది మా నౌక
జర్నలిస్టు బతుకు నౌక

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
మొబైల్ నం. 9700007653

బాల్యాన్ని రక్షించండి


                     శీర్షిక : బాల్యాన్ని రక్షించండి

చిట్టిచేతుల చిన్నారులు ....
బాల కార్మికులైనారు....
ఆడిపాడాల్సిన బాల్యం... ఆగమైపోతుంది.
తల్లిదండ్రుల పేదరికం ఒకవైపు...
నిరక్షరాస్యత మరోవైపు...
వెరసి
స్వేచ్ఛా విహంగంలో ఆనందాలను అనుభవించాల్సిన బాల్యం ..
బందీ గా మారింది.
చెడు స్నేహాలు, చిల్లర అలవాట్లకు బలై
బాల నేరస్థులుగా బ్రతుకీడుస్తున్నారు మరికొందరు....
అమాయకపు మాటలు నమ్మి .... కన్యత్వాన్ని తాకట్టుపెట్టి....
సెక్స్వర్కర్లుగా మారుతున్నారు ఇంకొందరు...
ఇలానే కొనసాగితే
పేదరికం వలన బాల కార్మిక వ్యవస్థ,
బాల కార్మిక వ్యవస్థ వలన నిరక్షరాస్యత,
నిరక్షరాస్యత వలన పేదరికం .... వెనకబాటుతనం.....
అన్నీ చక్రబంధమై పెరుగకమానదు....
మన భావిభారతం తరగక మానదు....
కలం పట్టాల్సిన చేయి కత్తి పట్టొద్దు..
బడికి వెళ్ళాల్సిన బాల్యం బలైపోవద్దు...
ఆటపాటలతో పెరగాల్సిన పిల్లలు
పనులకు పోవద్దు...
అమ్మ ఆలన... అయ్య పాలన తెలియని పసిమొగ్గలు వీరు...
కంప్యూటర్ ఆటలు... హైటెక్ చదువులు తెలియని పేదరికం వీరిది...
చట్టాలు ఎన్నున్నా....
వీరిని మాత్రం అపలేకపోతున్నాయి...
అలోచించండి ఆదుకోండి ...
బాల్యాన్ని రక్షించండి...

బలౌతున్న బాల్యం





శీర్షిక : బలౌతున్న బాల్యం

ఇటుకలుమోస్తూ కొందరు...
ఇనుమును కరిగిస్తూ ఇంకొందరు...
రిక్షాలాగుతు కొందరు...
బిక్షమెత్తుకొంటూ మరికొందరు...
పంక్చర్ చేస్తూ కొందరు...
పల్లీలమ్ముతు మరికొందరు...
పేపర్ వేస్తూ కొందరు....
పాలను ఏస్తూ మరికొందరు....
ఇంటిపనిలో కొందరు....
కంపెనీలలో ఇంకొందరు....
పశువులు కాస్తూ కొందరు...
కలుపులు తీస్తూ ఇంకొందరు...
పాలిష్ చేస్తూ కొందరు..
పెయింట్ వేస్తూ ఇంకొందరు...
అన్నం లేక కొందరు...
ఆటలు తెలియక ఇంకొందరు...
బాల్యం చితికి కొందరు....
బాద్యత తెలిసి ఇంకొందరు...
దవాఖానలో, దర్భారుఉో...
చాయ్ దుఖానం.... పాన్ షాపులో
కల్లు కొట్టులో... సార బట్టిలో
వైన్స్ షాపులో.... చైనీస్ కొట్టులో
మంగళి షాపులో, కిరాణ కొట్టులో
ఎక్కడ చూసిన బాల్యం బాల్యం...
బలౌతున్న బాల్యం....

అడ్డమైన రోగాలు


శీర్షిక : అడ్డమైన రోగాలు

నవమాసాలు పెంచి పోషించింది నా అమ్మ...
ఇన్నాళ్లు రెక్కలు ముక్కలై పెంచాడు నా నాన్న
కల్తీకాలంలో... అడ్డమైన రోగాలకు అడ్డం పడుతున్నం.....
అలాగని నీ దవాఖానాకొస్తే....
కొన నాలికకు మందిచ్చి ఉన్న నాలికను ఊడ్చేసినట్టు....
రోగానికి మందియ్యక.... అవయవాలు పీకేస్తవా....
వందకాడ రెండొందలు తీసుకో బాంచన్...
కాని లచ్చలు లచ్చలు కూడబెట్టాలని అడ్డంగా అంగాలు దొంగిలించకు దొరా...
మా అమ్మ అయ్య నాకు ముల్లుగుచ్చుకుంటేనే తట్టుకోరు...
అలాంటిది నువ్వు నా వొంట్లో అవయవాలనే ఖాలీ చేస్తుంటే ఎలా ఊరుకుంటారనుకుంటున్నావు...
ఒక్కసారి ఆలోచించు... వాళ్ళకు నీ దొంగబుద్ది తెలిసిననాడు  నిన్నేమి చేస్తారో...
ఓ డాక్టరు దోరా... కాల్మొక్త సారూ....
రోగానికి మందియ్యి గాని....
మందిచ్చి రోగాలు తేకు స్వామి....

బాల్యం ఒక మధురం



                        శీర్షిక : బాల్యం ఒక మధురం

చిలిపి చేష్టలు, కోతి గంతులు...
రంగుల ప్రపంచం లో...
స్వేచ్ఛా విహంగం....
తెలిసీ తెలియని వయస్సులో....
మిత్రులతో తగాదాలు....
అమ్మా నాన్నలకు శికాయిదీలు..
తెల్లారేసరికి మళ్లీ మిత్రులతో చెట్టపట్టాలు....
కోతి కొమ్మలు, చిర్ర గోనెలు,
బొంగారాల గిరగిరలు..
ఉప్పు బందరు, చార్ పత్తా..
దొంగబంతి, దాగుడు మూతలు....
గుడు గుడు గుంజం, గుండే రాగం...
వీరీ వీరీ గుమ్మడి పండు....
చెట్ల కింద అమ్మా నాన్నల ఆటలు, అష్టాచెమ్మలు, ఓనగుంతలు,
అచ్చన గుళ్ళు, అలెంకీలంక, చెడుగుడు చెడుగుడు,
పలిజూదం, దాడులు ఆడతూ. శివరాత్రికి పచ్చీసులు, మూడు ముక్కలు.... తొక్కుడు బిల్లలు...
బాగోతాలు, బొమ్మలాటలు...
ఇలా రోజులు ఎలా గడిచావో ఆనందంగా... హాయిగా....
బడికెళ్ళి వస్తూ రేగుపండ్లకై ఫైట్లు... చేతి నిండా గాట్లు....
మేడిపండుకోసం పాట్లు..
చీమలతో కాట్లు....
ఈత నేర్వడం కోసం లొట్టలకై పాట్లు... బాయిలో వేస్తే మునుగుతూ అగచాట్లు....
దరిచేరటం కోసం నానా పాట్లు... చేతినిండా మొరం గాట్లు....
అన్నం కలుపుతుంటే వేడి కారం మంటలు....
అమ్మ కలిపి పెడుతుంటే మమకారపు జల్లులు...
మల్లీ ఎప్పుడొస్తుందా బాల్యం ...
అని  ఎదురు చూపులు...
రాదని తెలిసి నిస్పృహలు....
ఏది ఏమైనా బాల్యం ఓ మధురం...
మల్లీ రాని మధుర జ్ఙాపకం....

జై జవాన్... జై కిసాన్


           
శీర్షిక : జై జవాన్.. జై కిసాన్...

దేశానికి తిండి పెట్టేది ఒకరు
దేశాన్ని కాపాడేది మరొకరు

ఆరుగాలం శ్రమించేది ఒకరు
అన్నికాలాలు పనిచేసేది మరొకరు

ఆహారాన్ని అందించేది ఒకరు
జాతి ప్రాణాలు నిలిపేది మరొకరు

అప్పుల ఊబిలో ఆత్మత్యాగి ఒకరు
ముష్కరుల దాడిలో ప్రాణత్యాగి మరొకరు

జై జవాన్ ఒకరు
జై కిసాన్ మరొకరు....

Friday, January 1, 2016

కరిగిందో ఏడాది

                        శీర్షిక : కరిగిందో యేడాది

ఘనమైనా గాయమైనా కరిగిందో ఏడాది
సువిశాల ప్రపంచంలో కలిసిందో జ్ఙాపకం
నవభావాలను పలుకుతూ వచ్చిందో వత్సరం
సరికొత్త ఆశయాలతో ఆహ్వనిద్దాం అందరం

మళ్లీ వచ్చింది మరొ ఏడాది

మళ్లీ వచ్చింది మరో ఏడాది

అగో... మళ్ళొచ్చింది మరో ఏడాది...
సంబరాలు చేసుకుంటున్నారు... మా వూరి జనం...
రావుగారబ్బాయి.. పదివేల టపాకాయలు తెచ్చాడు..
సుబ్బిగాడేమో.... ఐదువేలుపెట్టి మందు పార్టి ఇస్తుండు....
మల్లిగాడు మటన్ తస్తా అన్నాడు....
ఇంకేముంది... పోయినేడాది లెక్కనే ఈ ఏడాది కూడా ఫుల్లు ఏర్పాట్లు....
తాగినోడికి తాగినంత... తిన్నోడికి తిన్నంత...
తెల్లారే... పొద్దుగూకె...రోజట్లాగే...
తెల్లారితే దిగినాక తెలిసింది...
చేసిన ఖర్చు.... తెచ్చిన అప్పు....
మారింది పది రూపాయల క్యాలెండరే...
అదీ ఓ సంవత్సరం మారిందంతే...
కాని
అప్పుల తిప్పలు, ఆలి అలకలు, ఇంటి మరకలు, ఉద్యోగ బాద్యతలు, పిల్లల ఫీజులు, పాలోడి బిల్లు,  నల్లా బిల్లు, పేపర్ బిల్లు, కిరాణ బిల్లు, నెట్ బిల్లు, కేబుల్ బిల్లు, ఇ ఎమ్ ఐ లు, అన్నీ అలాగానే ఉన్నాయి... ఎందులో ఏవీ మారలే....
మరెందుకు నిన్న అంత ఖర్చు చేసా అని అప్పుడాలోచిస్తున్నారు మనోళ్ళు....
ఈ పైసలైనా ఉంటే ఏదో ఓ అప్పు తీరేదిగా అని....
ఇలా ఏడాదికోమారు క్యాలెండరు మారుతునేఉంటది.... మన బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మాదిర.... అక్కడే ఉంటది....
అందుకే క్యాలెండర్ లో గీతలు మారినంత మాత్రాన తల రాతలు మారుతాయనుకుంటే అది మన పిచ్చే...
అందుకె పోయేదాన్ని సాగనంపుదాము...వచ్చేదాన్ని అహ్వానిద్దాం...
అందుకు రూపాయి ఖర్చు లేదు....ఏమంటారు....

పేదవాడి పాట్లు


శీర్షిక : పేదవాడి పాట్లు

పొద్దున్నే లేచి సద్దికట్టుకొని అడ్డామీదికి వెళ్తాం....
పని కోసం మేస్త్రీల వెంట పడతాం....
పోటీలను చూసిన మేస్త్రీ మాతో బేరమాడుతాడు....
మాపటిపూటకు తిండి కావాలంటే
ఎంతకో అంతకు ఒప్పుకోవాల్సిందే...
రోజంతా పని... బరువైన పని..
ఇల్లుచేరినాక ఒల్లంతా నొప్పులు...
నొప్పులు పోనీకి ఓ పావు తిప్పలు....
ఇంకెం...
సంపాదించిన దాంట్లో సగం ఖతం
దొడ్డుబియ్యపు అన్నం....
పచ్చడి. పచ్చిపులుసు....
ఇదే మాకు పంచభక్ష్య పర్వాన్నం...
మల్లీ పడుకున్నామా - తెల్లారిందా...
బందులు విందులూ పోనూ
నెలకు ఇరువై రోజులు పని
తాగనీకి తిరగనీకి పోనూ
మిగిలింది తిననీకి సరిపోయే...
ఇక
ఊల్లో చేసిన అప్పులేం గాను
పోరగాలను ఎట్ల సదివించేది...
అయ్యమ్మకు ఏం పంపేది....
చెల్లె పెండ్లెట్ల జెయ్యాలి....
పెండ్లాం పిల్లలకు రోగమొస్తెట్ల...
అన్నీ ప్రశ్నలే... సమాదానం కరువు...
పేదవాడి జీవితం అందుకే బరువు...
ఓ దేవుడా వచ్చే జన్మంటూ ఉంటే
మానవుడిగా మాత్రం పుట్టించకు...
అదీ పేదవాడిగా అస్సలు పుట్టించకు...