Wednesday, May 31, 2017

వృక్ష వేదన


వృక్ష వేదన

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్‌ జర్నలిస్టు

లేచింది మొదలు... 
పడుకునేవరకు...

కాదు... కాదు...

పుట్టింది మొదలు.... 
చచ్చేంత వరకు...

ఇంకా చెప్పాలంటే... 
చచ్చాక కూడా...

నేను లేకుండా... నీవుండలేవు....
నా నీడ లేకుండా... నీవు నిముడలేవు....
అర్ధమయ్యిందనుకుంటా నేనెవరినో....
నేనే వృక్షజాతిని....

నీవుండే ఇంటికి ద్వారాన్ని నేను....
పైకప్పునేను.... షోకేసు నేను...
ఊతమిచ్చే చేతికర్రను నేను....
చచ్చాక చితికి కర్రను నేనే....

నీవుతినే పంటసరకు నేను....
వంటచెరుకు నేను....
పప్పు ధాన్యం నేను.... 
పశువకు దాణా నేను....

ఆకుకూర నేను... 
కాయగూర నేను...
కరివేపాకు నేను... 
కొత్తిమీరనేనే...

నెత్తిలో పూవునేనే.... 
పుష్ప గుఛ్ఛం నేనే....
పూలమాల నేనే.... 
ద్వజస్థంభం నేను...

ఆకుమందు నేను... 
ఆయుర్వేదం నేను...
అగ్గిపుల్లా నేను....
అగరు బత్తీనేనూ.... 

పొలందున్నే హలం నేను....
పారకున్న కర్ర నేను ....
కూలి చేతిల తట్టనేను.... 
గడ్డలి కున్న కామ నేను....

రైతు చేతిల కర్ర నేను...
మాస్టారు చేతిల బెత్తం నేను....
దేవాంగునికి ఆసర నెను....
పోలీసు చేతిలో లాఠీను నేనే....

కర్షకుడెక్కే బండిని నేను...
ప్రభువులెక్కే పల్లకి నేను...
రాజులు ఎక్కే రథమూ నేనూ...
మానవుడెక్కే వాహనం నేనే...

నీవు రాసే పెన్ను నేను... 
పెన్ను కింది పేపరు నేను....
పరీక్ష రాసే అట్టను నేనూ...
మరెన్నిటికో మూలాధారం నేనే....


నీశ్వాస నేను... 
నీ ఆశ నేను....
నీ నీడ నేను.... 
నీ తోడు నేను

నేను లేకుండా నీకు నీరు లేదు...
నేను లేకుండా నీకుగాలి లేదు....
నేను లేకుండా నీకు కూడు లేదు
నేను లేకుండా నీకు గూడు లేదు

అసలు నీకు బ్రతుకేలేదు....
నన్ను నాశనం చేస్తున్నావు.....
లేని సమస్యలను కొనితెచ్చుకుంటున్నావు....

వృక్షో రక్షతి..... రక్షతః...

మీ
గోగులపాటి కృష్ణమోహన్,
సూరారంకాలని, హైదరాబాద్.
9700007653

పొగాకును వదిలేద్దాం



శీర్షిక: పొగాకును వదిలేద్దాం
పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా....

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.

పొగాకు తగలేద్దాం
పోరాటం మొదలెడదాం

గుట్కవేసి ఒకడు
జర్ధతింటు ఇంకొకడు..

తంబాకు తింటొకడు
పాన్ పరాగంటొకడు

సిగిరెట్టు, బీడీలు
గంట చుట్టలుతాగి

పొగాకునందరూ
పొట్టనెట్టుకుంటూ...

జీవితాన్ని మీరు
తగలబెట్టుతుండ్రు....

సినిమాకు ముందర
ఎన్ని సూపించినా...

పేపర్ల వార్తలు
ఎన్ని రాసేసినా....

మారదూ ఈ యువ
మారదూ ఈ ప్రజ....

నోట్ల పుట్టు కంపు
వారికెంతొ యింపు

పక్కవాడికి పుట్టు
వెగటు కంపు....

నోట్ల తూట్లు పడ్డ
కడుపులో క్యాన్సరై

మాయరోగాలొచ్చి
మాయమై పోయినా....

మారదూ ఈ యువ
మారదూ ఈ ప్రజ....

నీ యింటి ఇల్లాలు
నీ కంటి పాపలూ....

నీ తల్లి దండ్రులూ...
నీ తోబుట్టువులు....

నీ బందుమిత్రులూ
చుట్టుప్రక్కల వారు

ఛీఛీ లు కొట్టినా....
దూరంబుబెట్టినా....

మారదూ ఈ యువ
మారదూ ఈ ప్రజ....

క్యాన్సర్ కారకం
ప్రమాదహెచ్చరికలు

పొగాకు ఉత్పత్తి
పైన రాసే ఉంది...

దానిని చూసైనా
రోగాలు చూసైనా....

నీవారి కోసమూ
నీ రక్ష కోసమూ...

మారాలి ఈ యువత
మారాలి యీ ప్రజా...

మీరు కాలుస్తుంది ప్రత్యక్షంగా పొగాకే...
కానీ పరోక్షంగా అది ధనమని మరవకండి.... 
అందుకే.....
పొగాకు తినడం/తాగడం మానండి....
మీరు... మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోండి....

మీ
గోగులపాటి కృష్ణమోహన్
9700007653

Tuesday, May 16, 2017

సహస్ర కవిత సౌరభాలు


*సహస్ర కవితా సౌరభం*
*ఆహ్వానం*

*తెలుగు కవితా వైభవం* వ్యవస్థాపకులు సాహితీ సేవాబంధు శ్రీ మేక రవీంద్ర గారి ఆద్వర్యంలో....
 ఇప్పటివరకు వాట్సప్ ద్వారా 18 నవంబర్ 2015 న ఒకేరోజు వేయిమంది కవులతో  సహస్ర కవి సమ్మేళనం నిర్వహించింది.

2016 ఉగాదికి అయుత కవితా యజ్ఞం నిర్వహించి 15742 కవితలతో పూర్తి చేసింది

2017 ఉగాదికి ప్రయుత కవితా యజ్ఞం* నిర్వహించి 154098 సాహితీ సమిధలతో పూర్తి చేసి సాహితీ రంగంలో కొత్త ఒరవడికి నాంది పలికింది. 

ఈ సందర్భాలలో మొదటిసారి 2016 లో 49మంది కవులను 69 బిరుదులతో...

2017 లో 143 మంది కవులను 323  బిరుదులతో సమ్మానించడమైనది.

కవులు, కవిత్వం ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు *సహస్రకవుల సత్రయాగం* నిర్వహిస్తున్నది. 

ఇందులో భాగంగా *సహస్ర కవితా సౌరభం* అను పేర *1008 మంది కవుల పరిచయం మరియు కవితలతో* *ఒక మహా కవితా సంకలనం తీసుకురాబోతుంది.* 

ఈ *సహస్ర కవితా సౌరభం* సంకలనంలో పాల్గొనాలని ఇరు తెలుగు రాష్ట్రాలలో, తెలుగేతర రాష్ట్రాలలో, విదేశాలలో నివసించు తెలుగు కవులకు స్వాగతం పలుకుతూ ఆహ్వానంపలుకుతున్నాము. 

కేవలం సహస్రకవులకు మాత్రమే ఈ సంకలనంలో పాల్గొనడానికి అవకాశం కలదు కనుక ముందుగా *సహస్రకవి* గా పేరు నమోదు చేసుకోవాలి.

ఆసక్తి కలవారు తమ పేరు, చిరునామా, వచనమా, పద్యామా, రెండూనా ఏ విభాగమో తెలుపుతూ *+91 9177059331* కు వాట్సప్ ద్వారా సంక్షిప్త సమాచారం పంపి పేరు *సహస్ర కవి* గా నమోదు చేసుకోగలరు. *పేరు నమోదుకు ఎటువంటి రుసుము లేదు*. 

మొదట మిమ్ములను *సహస్ర కవి* గుర్తించి ఒక ఐడి. నెంబరు కేటాయించబడును. అటు తరువాత మీరు *తెలుగు కవితా వైభవం* నిర్వహించే వివిధ కార్యక్రమంలో పాల్గొనుటకు వీలు అగును.

తరువాత మిమ్ములను ప్రస్తుతము నిర్వహింపడుతున్న *సహస్ర కవుల సత్రయాగం* గ్రూప్ లో చేర్చబడును. అక్కడ  దేశంలోని వివిధ ప్రదేశాలలో నివసిచే కవులను మీరు పోస్టు చేసి కవితలకు పాఠకులుగా పొందవచ్చు, మరియు మీ ప్రతిభ అనుసారము తగిన గుర్తింపు,బిరుదులు పొందే అవకాశం కలదు. *ఇప్పటి వరకు ఎంతో మంది కవులు ఈ వేదిక ద్వారా తెలుగు విశాల ప్రపంచానికి పరిచయమై పేరు మన్ననలు గడించారు.*


తరువాత *సహస్ర కవితా సౌరభం* సంకలనంలో ప్రచురించడానికి *మీ పరిచయాన్ని మరియు కవితలను పంపడానికి ఒక సంపాదకునికి మిమ్ములను కేటాయించబడును. ఆ సంపాదకునికి మీ పరిచయాన్ని, కవితను పంపవలసి వుంటుంది.* ఎలా పంపాలి, ఏ నమూనా లో పంపాలి, హామీ పత్రం ఎలా వుండాలి అన్న వివరాలు పేరు నమోదు చేసుకున్న తరువాత మీకు వివరంగా పంపబడును.

*కవిత ఎంపిక అయిన ప్రతి కవి ప్రచురించబోయే *సహస్ర కవితా సౌరభం* యొక్క మూడు ప్రతులు ముద్రణకు ముందుగానే కొనవాలెను. అట్లు కొన్నవారి కవితలు మాత్రమే ఈ తొలి 1008 కవుల సంకలనం లో ప్రచురింపబడును.* ఈ విధంగా మీ పరిచయం కనీసం 1008 కవుల గృహ గ్రంథాలయాలలో చోటు సంపాదించుకుంటుంది. మరియు ఎంతో మంది సాహితీ వేత్తల దృష్టిలో పడితుంది.

ఈ ప్రచురణలో మీ కవిత వుండేలా చూసుకొని సాహితీ లోకంలో మీ పేరు బహుకాలం నిలిచిపోయేలా చూసుకొనగలరు.

ఆసక్తిగల కవులు పేరు నమోదుకు మరియు ఇతర వివరాలకు *+91 9177059331* కు వాట్సప్ ద్వారా మీ పేరు చిరునామ పంపగలరు

ధన్యవాదాలు
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త, 
సహ-సంపాదకులు...
సహస్రకవితా సౌరభం (సంకలనం)
తెలుగు కవితా వైభవం
హైదరాబాదు
9700007653

Saturday, May 13, 2017

ఆడ జన్మకి గర్వకారణం ..... అమ్మ

గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు,


శీర్షిక: ఆడ జన్మకి గర్వ కారణం….
``````````````````````````````````
ఆడ జన్మకి గర్వ కారణం….అమ్మే.
అమ్మ అనే కమ్మని మాట లోనే వుంది అమృత ధార….
మన జన్మకి తన ప్రాణాన్ని పణంగా పెట్టే ఈ అమ్మ జన్మ ఇలలో ఒక అద్భుత వరం…

ప్రేమ పంచి పెంచి, లాలించి, బుజ్జగించి
అభిమానాన్ని గోరు ముద్ద గా పెట్టే అమ్మకు
ఆ బ్రహ్మ కూడా దాసోహమేగా….

కర్ఖోటకుడిని సైతం కళ్ళల్లో పెట్టి చూసుకునే ఓర్పు అమ్మ ప్రేమేగా ….

గుండె మండేలా మాట్లాడినా, గునపాలు దించినా, కిక్కురుమనక అనురాగం పంచేది అమ్మేగా…

కంట నీరు పెట్టించినా, ఎంత వేదన మిగిల్చినా, మన కష్టంలో వేలు పట్టి వెన్ను తట్టి ఓదార్చేది అమ్మ అనురాగమే కదా…

మనకి కష్టమొస్తే తన కన్ను నీరు వర్షిస్తుంది,
పాషాణ గుండెకి మమతని ధారబోసేది అమ్మే…

అమ్మ అని పిలిస్తే ఆప్యాయాన్ని అంతా ఆలంబనగా చేసి, మన విజయానికి మనల్ని మించి సంబరపడి పండగ చేసుకునేది అమ్మ ప్రేమే…

మనకి కొండంత అండగాతన గుండె పరిచి నడిపించి కాపాడేది ఈ అమ్మ జన్మేగా….
ఆడ జన్మకి గర్వ కారణం….అమ్మే. అమ్మనే
..
మీ
సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
9700007653