Tuesday, February 9, 2016

సీస పద్యాలు

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ కర్నలిస్టు,
సూరారం కాలని, హైదరాబాదు
9700007653.

శీర్షిక: అమ్మాయి పెళ్లి
సీసపద్యము:- 1)

అమ్మాయి పెళ్ళికి అడ్డంకు లొచ్చినా
అదరడు బెదరడు అయ్య యెపుడు

అప్పులే దెచ్చునో ఆరాట పడునో
కన్యదానముచేసి కాళ్ళు గడుగు

వియ్యాల వారిని కయ్యాలు తగదంటు
కట్నకానుకలిచ్చి కడుపు నింపు

కూతురు అల్లుడు కుశలమే కోరుతూ
పొలిమెర వరకొచ్చి పంపి మరులు

ఆవె:-
కట్న కానుకలని కాంతను హింసించి
గ్యాసునూనెబోసి కాలబెట్టి
తల్లి దండ్రు లార దయలేని పుత్రుడా
ఆడపిల్లపట్ల అలుసు తగదు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

గోగులపాటి కృష్ణమోహన్
శీర్షిక :- పాడియావు
సిసము 2)

భారికష్టముచేసి పాడియావుదెచ్చి
పచ్చగడ్డివేసె పాలకొరకు

ఎంతపిండినగాని ఏమిజేసినగాని
పాలి యియ్యదాయె పాడి యావు

అధిక పాల కొరకు అడ్డదారేగతి
పాడుసూదులిచ్చె పాలు పితక

అప్పులు దీర్చింది అసువులు బాపింది
ప్రాణాలె ఫణిపెట్టి పాడియావు

ఆవె
మనిషి బతుకు కొరకు మారెను హీనంగ
గోవు కున్న దెంత గొప్పతనము
ఆవు చేసె మేలు అమ్మైన జేసునా
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు

శీర్షిక :-
విశ్వ నగరం మన భాగ్యనగరం
సీస పద్యం 3)

గ్రేటర్లొ గెలిచారు గొప్పగా నిలిచారు
ఇచ్చిన హామీలు తీర్చ గలరు

నిత్యము నీరిచ్చు నిరతము విద్యుత్తు
స్కైవె రోడ్లనువేసి సొగసు తెచ్చు

కళ్యాణ లక్ష్మితో కన్నవారినిదోచె
వృద్దాప్య వికలాంగ ఫించనిచ్చె

రూపాయి బియ్యము రోజుకూలీలకు
బద్రతే ద్యేయంగ పలికినారు

ఆవె:-
స్వచ్చ హైద్రబాదు సొగసైన నగరంగ
తీర్చి దిద్ద గలదు తెగువ తోడ
అందమైనరోడ్లు అరుదైన టీహబ్బు
ఆసుపత్రులుండు అద్భుతంగ

భాగ్యనగర తీరు బహువిధముగనుండు
మారుచుండె నేడు మరవ కుండు
కేసియారుకారు కదిలేను జోరుగా
విశ్వ నగర కీర్తి వినుతి నెంచ

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

02/09/2016.
జి.కృష్ణమోహన్, జర్నలిస్టు:
శీర్షిక :- ప్రశాత్  శ్రావణి పరిణయము

సీసము 4

శ్రీనన్న మాయన్న శ్రీదేవి ఒదినమ్మ
ప్రేమాను రాగాలు పంచు జంట

సంద్యగుండేరావు సుకుమారి పుత్రిక
వియ్యమందుకొనగ వచ్చెముందు

వినయుడు విద్యుడు వరుడుప్రశాంతుడు
శ్రావణి పున్నాగ సాయి వధువు

కళ్యాణ గడియొచ్చె కాంతను చేపట్ట
దేవతలందించె దీవెనలను

ఆవె'-
ప్రశ్శు నాగ సాయి పరిణయ మాడంగ
బందు జనులు జేరె పందిరందు
పట్టు చీర కట్టి పడతులంతొకచోట
ముచ్చటించబట్టె ముదము తోడ


(మా పెద్దన్నయ్య చిన్న కొడుకు  చి. ప్రశాంత్, శ్రావణి వివాహ సందర్భంగా సీస పద్యం....)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


5)అనాధల బతుకు

అమ్మపిలుపులేక అలమటించెందరో
దిక్కుమొక్కులేక తిరుగు తుండె

అన్నదమ్ములులేక అక్కచెల్లెలులేక
బందుమితృలన్న తెలియ రాక

కడుపునొప్పొచ్చినా కాలునొప్పొచ్చినా
చేరదీసేవారు కానరారు

అయ్యొపాపమనిన ఆరాలుదీసినా
చిరునామ దొరకని జనులువారు

ఆవె
రాజుమారెనేమి రాతమారదుకద
కడుపు నిండదాయె కఠిన బతుకు
బక్క జిక్కి నాము బతకలేకున్నాము
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

6) అప్పు ఇల్లు

ఆస్తులన్నియమ్మి హైదరాబాదొస్తి
పూట కొరకు పాట్లు యెన్నొపడితి

కీలుబొమ్మలాగ కూలినాలిజేస్తు
ఆలిపిల్లనెల్ల అరుసు కుంటు

కాయకష్టముజేసి కాసులెనుకవేసి
ప్లాటు కొరకు పడరాని పాట్లు పడితి

ఇల్లుగట్టినాను అప్పుల పాలైన
అప్పుదీర్చితినేను ఇల్లు యమ్మి

ఆవె
అప్పు జేయ నేల ఇల్లుకట్టగనేల
ఇల్లు యమ్మి అప్పు దీర్చ నేల
యేమి జేదు మన్న యదృష్ట ముండాలి
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

7)
ప్రేమజూపించును పెద్దల పట్లెంతొ
తల్లి, సోదరుడన్న దండ్రి యన్న

పెదనాన, పెద్దమ్మ, బాబాయి పిన్నమ్మ
అమ్మమ్మ తాతయ్య అక్క యన్న

అత్తలు, మామలు అన్నలు ఒదినలు
చెల్లెలు తమ్ముని చేర దీసు

ఇరుగుపొరుగుయన్న ఊరిజనముయనిన
ప్రణయముతోనుండు ప్రణ్యదీపు

ఆవె
ప్రణ్యదీపు పుట్టె ఫిబ్రవరిపదిన
వంద యేళ్ళు నీవు హాయి గుండు
తలచినదితడువు దేవుడివ్వాలిర
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

ప్రేమతో... బాబాయి

8)
కళలకే చంద్రుడు కళారాధ్యుడితడు
కళలన్ని కలబోసె కవిమితృండు

ఎన్నికష్టాలున్న ఎన్నిబాదలుపడ్డ
అనుకున్నలక్ష్యాలు అధికమించె

పుట్టినదినమున పులకించె కవిమిత్ర
పిల్లపాపలతోడ చల్లగుండ

ఆయురారోగ్యము అష్టైశ్వర్యము
కోరుకొనుచుంటిని కోట్ల కెదగ

ఆవె
చంద్రుడన్నతెలుసు కవిమితృలందర్కి
చంద్రుడన్నతెలుసు కవనదారి
చంద్రుడేకదమరి కళలకు చంద్రుడు
చంస్రుడేను మరి దేవి పతుడు


9)
కడదాక నాతోడు కలసియుంటానంటు
మాయమాటలుజెప్పి కానరావె

నువ్వునేనొకటంటు నావెంటె నీవంటు
తోడులేకబతుకు దీనమాయె

సాయమే లేకున్న సేవలెన్నోజేస్తి
మాయరోగమువచ్చి మానదాయె

పిల్లలు ఇచ్చోట పద్మేమొ అచ్చోట
నాకుదిక్కెక్కడో చెప్పరాదె

ఆవె
అగ్ని సాక్షి తోడ తాలికట్టితిగాని
చివరి వరకు తోడు చూడ నైతి
మద్యలోనెవచ్చి మద్యలోవెల్లితే
ఏమికానుబతుకు ఒంటరైతి

10)
వృక్ష సంరక్షణ ప్రయుడు, సహస్ర కవి మితృలు, పెద్దలు శ్రీ దగ్గుపాటి పార్ధసారధి నాయుడుగారి జన్మదినం పురస్కరించుకొని చిరు పద్యకానుక

సీసము:-
వృక్షమన్నప్రీతి వృక్షమే సర్వము
వృక్షవిలాపాన్ని వినుతనెంచె

వృక్షరాధప్రియ వినయవిజయశీల
పార్ధసారధిగారి జన్మదినము

సాహితీపథములో వృక్షసంరక్షణ
విజయతీరంబున నడిపె ఘనుడు

వృక్షొరక్షతిరక్షః వీదులన్నియుచాట
పుస్తకముద్రణ పూనుకొనెను

ఆవె

దగ్గుపాటి వంశ ఘనతపెంచెనితడు
పార్ధసారధియనుపామరుండు
చెట్లపుట్టలయందు చీడపురుగులందు
జనులనెల్ల మేల్కొలిపినాడు

11)భానునికి గల నామాలతో సీస ప్రయోగము

భాస్కర దినకర భానుడు యంశుడు
అధ్వపతి యరుణ అంబరీష

అంబర రత్నము ఆంశుపత యినుడు
ఉషపుడు అధ్వగు ఉదరథి అద్రి

అశిరుడు కిరణుడు అశుగుడు అకుపార
ఆదిత్య అంబర ఆంశుమంత

అంబుజా హస్కర  అహిమాంశు ఉష్ణుడు
 అంబుతస్కర రవి ఆంశుమాలి

ఆవె
ఇరులుదాయిరులదాయిరులదొంగ ఇర్లుదొంగ ఇవముమేపరివము
యిన్నియన్నియనియెన్నొరవిపేర్లు
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

12)
(స్త్రీకి గల నానార్దాలతో సీస పద్యము)

స్త్రీకిగలవుపేర్లు శతముకుపైగాను
యోషిత సుందరి వామ వనిత

సీమంతనీ వధూ సాధ్వీపతివ్రత ,
అధివిన్న ఇత్వరి అబల , యోష

పత్నిపాణి యువతి పెండ్లాము తలుని
కన్యకా జవ్వని కుమారి గౌరి

ధర్శణీ , చర్షణీ , బందకీ , ఆసతీ
రామణీ పాంసులా రంకులాడి

ఆవె
కాంత నారి లలన కామినీ యంగన
మత్త కాశిని సతి మహిశి యన్య
భార్య  జాయ వర్య భామినీ మానినీ
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

13)
కాకతీయులతోటి కదనరంగంబున
చిలకల గుట్టపై పోరుసల్పి

జంపన్న వాగులో ప్రాణాలు కోల్పోయి
అమరులైనిలిచారు అక్క చెల్లి

సమ్మక్క జంపన్న సారక్క నాగక్క
గిరిజన ప్రజల దిక్కు మొక్కు

మేడారమందున జాతరే జాతర
కోట్లాది భక్తుల కనుల పంట

ఆవె
63)
కోర్కె దీర యిచ్చు నిలువెత్తు బంగారు
భక్తి తోడ కొలుచి కోట్ల జనులు
సమ్మ సారలమ్మ జాతర యందున
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

14)
మేడారమేలేటి పగిడిద్ద రాజుకు
మేనమామౌతాడుమేడరాజు

తనపుత్రి సమ్మక్క గారాల పట్టిని
పగిడిద్దికియిచ్చి పెళ్ళి జేసే

వారకి కలిగిరి ముచ్చట్గ ముగ్గురు
సారక్క జంపన్న నాగులమ్మ

ప్రతాప రుద్రుని యెదిరించి వారంత
అసువులు బాసిరి జనము కొకరు

ఆత్మ గౌర వమ్ము అలనాటి నుండియే
మట్టి నున్న బలము మనకు నెపుడు
మన్య మంత మురిసె మనవార సత్వమే
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

15)
సెల్లుఫోనొచ్చింది సయ్యాట దెచ్చింది
ఇంట్లోన సవితిపోరోలెనిలిచె

బందుమిత్రులెవరు బయటనిలుచుండిన
మాటలన్నవిలేవు మొబైలు వలన

సెల్లుతోసెల్ఫీలు కెమరాల సరిజోడు
కంప్యూటరులతోటి పనులు లేవు

వీనుల విందుగా వీడియో కాలింగు
దూరభారాలను తీర్చిబెట్టె

ఆవె
పావురాలుబోయె ఉత్తరాలొచ్చెను
పోయె యుత్తరాలు పేజరొచ్చె
సెల్లె నేడు వాటి తలదన్నిపాయెరా
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

16)
చెరువులో నీరున్న పంటచేలకుమేలు
         గలగల నీరున్న కాల్వ బారు

చెరువులో నీళ్ళుంటే జెగతిన నీరుండు
     నీళ్ళుంటే చెరువులో  నిండు బాయి

చెరువులో నీళ్ళుంటే చేపలొచ్చిజేరు
       చెరువులోనీరుంటె జీవముండు

చెరువులో నీరున్న చెంబుతో పనియేమి
            చెరువులో నీళ్ళున్న చింత లేదు

ఆవె
చెరువు వలన మేలు జంతుజీవాలకు
పక్షి కీటకాల బతుకు దెరువు
కాకతియులుతొవ్వె ఘనముగా చెరువులు
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

Saturday, February 6, 2016

పూరణాలు - అభివర్ణనలు

పూరణాలు - అభివర్ణనలు
గోగులపాటి కృష్ణమోహన్ 

ఆవె
నీర నుండు చేప నేలకు చేరెనా
తీరమందుసేదతీర్చుకొనగ
మీన వేషమెంతొముద్దుగాయుండెనో
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

కోమటింటఁ దెగెను కుక్కుటములునెల్ల
కోసుకోనితినరుదాసుకొనగ
కోమటయ్యదాన్ని అమ్మిలాభపడెగా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల


కత్తి వదలి వచ్చెఁ గదనమునకు
సమస్యా పూరణము

యుద్దమందుచూసె రక్తపాతములను
కత్తి వదలి వచ్చెఁ గదనమునకు
వైరులంతగూడ ఔరాయనుచువెళ్ళె
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల



ఆడువారికెన్ని ఆభరణములున్న
పట్టుచీరలెన్నొ కట్టుకున్న
కొప్పు లోన పూలు గొప్పగా యుండుగా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

కోతి వచ్చె కొట్టు కొట్టేయ కదలము
దానికొరకెయాడునాటకాలు
వానరానికేమివార్తలతోపని
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల






Friday, February 5, 2016

కృష్ణ ఆటవెలదులు

కృష్ణ ఆటవెలదులు
గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాద్ 


తేది: 03-02-2016
ఆవె
1)
మారు మారు మన్న మారదు యీప్రజ
మార్పు తేవలనిన మనజన మందున
మారు ముందు నీవు మార్చగా జనులను
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

2)
ప్రక్క వాడి తోటి పంతమేలమనకు
ఎవడి బతుకు వాడు యేడ్చు చుండ
పంత మొదలి నీవు బతుకుము బహుబాగు
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

3)
అప్పు కావలనిన అందుకుందురుకాల్లు
తిరిగి అడిగి చూడు తిట్టి పెట్టు
అప్పు యియ్య రాదు అడుగరాదుతిరిగి
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

4)
అమ్మనాన్నలనిన ఆడుబిడ్డలనిన
అన్నదమ్ములన్న అందరనిన
గౌరవించెతీరు యెరుగరు యువకులు
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

5)
పెద్ద వారు జెప్ప పెడచెవిబెట్టగ
అడ్డ దారి వెళ్ళి ఆగ మయ్యె
పెద్ద లన్న మాట పెరుగన్న మూటరా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

తేది: 04-02-2016
6)
దమ్ము కొట్టి ఒకడు దంచితాగింకోడు
కిల్లి కొట్టు కాడ కల్లు కాడ
ఏడ జూడు యువత ఏమికానుభవిత
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

7)
ఆడపిల్లజూడ అందాల పోరులో
అతిగ మోజు మీద ఆగమయ్యె
అందమన్నపైన హంగులు కాదమ్మ
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

8)
కష్ట పడిన వాడు ఎన్నడూ చెడిపోడు
ఇష్ట మైన యేది కష్ట మవదు
కష్ట మైన పనిని నిష్టగా చేయుము
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

9)
అప్పు దెచ్చు టేల ఆరగించుటయేల
అప్పు నీకు యెపుడు ముప్పు యగును
అప్పు లేక నీవు హాయిగా యుండుము
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

10)
మంచితనము నేడు కుంచించి పోయెగా
మాయ మోస గాళ్ళ మహిమ చెత
మంచి తనము  పెంచు మంచినే పంచుము
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

11)
కూలి నాలి జేస్తు కూడులేకుండగ
కాలి కడుపు తోటి గడుపుడాయె
వారి కడుపు నిండె భాగ్యమే నాడుందొ
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

12)
అమ్మ ఉన్న నాడు ఆమేంటొ తెలియదు
విలువ తెలిసె నాడు వీరు లేరు
అమ్మ ఉండ గానె విలువేంటొ తెలుసుకో
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

13)
అన్ని యుండి నోడు అరగక తినలేడు
రొక్క మున్న కూడ రోగముండు
తిండి యున్న నీకు తృప్తిలేదాయెరా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

14)
ఆలి మాట వినెను అమ్మనెడలిగొట్టె
ఆలి అమ్మ కన్న ఏల గొప్ప
ఆలి కూడ రేపు అమ్మకాకుండునా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

15)
ఆలి అమ్మ నెపుడు వేరుగా చూడకు
అమ్మ నేడు కాని ఆలి నాడు
ఆలి కూడ రేపు అమ్మనే అవునుగా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

16)
భర్త బాగు చూస్తు ప్రేమగా లాలిస్తు
అత్త మామ వద్ద ఇంటి పట్ల
అంత తనదె నంటు ఇల్లాలు యుండురా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

తేది: 05-02-2016
17)
ఆస్తి ఆభరణము అంతస్తు లుండిన
ఆపదందుయేవి ఆదు కోవు
వాటి కన్న మిన్న ఆత్మాభి మానము
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

18)
కన్న వారి కలలు నెరవేర్చ వలెనన్న
వారి ఆశయములు తీర్చ వలెను
తల్లి దండ్రు లందు ప్రేమతో మెలుగురా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

19)
ఎర్ర బస్సు ఎక్కు ఎక్సుప్రెసెక్కినా
వేగమంతె యుండు వేటు వేరు
బస్సు చూడమాకు బోర్డుచూడాలిరా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

20)
ఎర్ర బస్సు కేమొ ఎక్సుబోర్డుంటది
బస్సు ఎక్కినాక బాదుడు యుంటది
ఏడ జూడు బస్సు ఆగుడే ఆగుడు
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

21)
ఏండ్ల కొద్ది నువ్వు ఎంతపంజేసినా
రోజు కూలి గాడె రక్ష లేదు
పర్మినెంటుజేయ పనిలేదు యందురు
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

22)
పేపరేసెటోడు పొద్దున్నె లేవాలి
ఎండ వాన చలని లెక్క లేక
ఎంత కష్ట పడ్డ ఏముంది లాభము
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

23)
పాలు పితకి వచ్చి పాలడబ్బలొపోసి
బండి మీద నువ్వు బస్తి తిరిగి
ఎంత కష్ట పడ్డ ఏముంది లాభము
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

24)
ఆరు గాలమనుచు కాయకష్టముజేసి
పంట పండె కాని తింట లేదు
కోత కొచ్చె పంట చేతికి రాదాయె
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

25)
పత్తి పంట వేసి బంగారు బతుకని
ఎన్నొ కలలు గన్న ఏమి లేదు
అప్పు చేసె ముప్పు ఆపదే దెచ్చెనా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

26)
బ్యాంకు లోను యిచ్చె బండప్పు దెచ్చెను
బండి తిరగ దాయె పరువు బాయె
బ్యాంకు సారు వచ్చి బండిగుంజుకపోయె
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

27)
కూర గాయ దెచ్చి కూర్చోని అమ్మగా
లాభమేమొగాని గాబరొచ్చె
ఎంత కష్ట పడ్డ ఏముంది లాభము
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

28)
రాజకీయమందు రాజిల్ల వలెనన్న
మోసమందు నీవు మెలిక నేర్వు
లేని యెడల నువ్వు రాణించలేవురా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

30)
అమ్మ వలెను యన్న ఆధర లేదంటు
కొంట మంటె ధరలు మండ బట్టె
అమ్మ బోతె అడవి కొనబోతె కొరవిరా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

31)
నీర నుండు చేప నేలకు చేరెనా
తీరమందుసేదతీర్చుకొనగ
మీన వేషమెంతొముద్దుగాయుండెనో
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

32)
కోమటింటఁ దెగెను కుక్కుటములునెల్ల
కోసి తినఁడు దాచుకొనును తాను 
కోమటయ్య దాని నమ్మి లాభపడెను
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

33)
రక్తపాతముఁ గని రాజు మెచ్చక తాను
కత్తి వదలి వచ్చెఁ గదనమునకు
వైరివీరులంత నౌరా యని తొలఁగె
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల 

34)
ఆడువారికెన్ని ఆభరణములున్న
పట్టుచీరలెన్నొ కట్టుకున్న
కొప్పు లోన పూలు గొప్పగా యుండుగా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

35)
ఏమి సొగసు నీది ఏమని పొగడను
అంతరంగమందు అరుదెంచి నిలిచావు
కాన కుండ యేమి కనులలో నిలిచావు
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

36)
కట్న కానుకలకు కడుపుకోతేలరా
తల్లి కన్న బిడ్డ దహన మేల
బుద్ది లేని జనుల బద్దిమారేదెలా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

37)
కట్న కానుకలని కాంతను హింసించి
గ్యాసునూనెబోసి కాలబెట్టి
తల్లి దండ్రు లార దయలేని పుత్రుడా
ఆడపిల్లపట్ల అలుసు తగదు

38)
మనిషి బతుకు కొరకు మారెను హీనంగ
గోవు కున్న దెంత గొప్పతనము
ఆవు చేసె మేలు అమ్మైన జేసునా 
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

39)
నోటు గనిన చాలు నోట నీర ముబుకు| కాటు వేయు నదియె ఘాటుగాను.
నోటు లేని యెడల నోటమాటరాదే
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

40)
చేతికున్నవాచి అతిగతిరుగుచుండె
ముల్లు వేగ మాప ముల్లునాపెనొకడు
కాల గతిని నిల్పఁగలఁడుగా మానవుఁడే.
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

41)
రెండు వేల నుండి గజము ప్లాటు
ఎర్ర చందనాల ఎరుపు తోడు
యాదగిరికి ఐదు ఆమడల దూరంలో
అమ్ము చుండిరికద అందమైనప్లాట్లు

42)
కోతి వచ్చె కొట్టు కొట్టేయ కదలము
దానికొరకెయాడునాటకాలు
వానరానికేమివార్తలతోపని
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

43)
మనసెరిగిన మగని పరిణయమాడగ
భామ మనసు ఎంతొ పరితపించె
తాను మెచ్చె వాడె తనకు కావాలంటు
లింగని గని తాను లేచిపోయె

44) 
(సంతోష్ శ్రీవిద్య ల గూర్చి)
ముచ్చటైనజంట ముసిముసి నవ్వులు
మనసులెరగియండె నొకరికొకరు
తల్లి దండ్రి తోడు తనవారి నందర్ని
సంతసంగ జూడ సంతు సిరులు

45)
ప్రశ్శు నాగ సాయి పరిణయ మాడంగ
బందు జనులు జేరె పందిరందు
పట్టు చీర కట్టి పడతులంతొకచోట
ముచ్చటించబట్టె ముదము తోడ

46)
స్వచ్చ హైద్రబాదు సొగసైన నగరంగ
తీర్చి దిద్ద గలదు తెగువ తోడ
అందమైనరోడ్లు అరుదైన టీహబ్బు
ఆసుపత్రులుండు అద్భుతంగ

47)
భాగ్యనగర తీరు బహువిధముగనుండు
మారుచుండె నేడు మరవ కుండు
కేసియారుకారు కదిలేను జోరుగా
విశ్వ నగర కీర్తి వినుతి నెంచ

48)
రాజుమారెనేమి రాతమారదుకద
కడుపు నిండదాయె కఠిన బతుకు
బక్క జిక్కి నాము బతకలేకున్నాము
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

49)
అప్పు జేయ నేల ఇల్లుకట్టగనేల
ఇల్లు యమ్మి అప్పు దీర్చ నేల
యేమి జేదు మన్న యదృష్ట ముండాలి
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

50)
జనులు పెరుగు తుండె జగతిలో నధికము
భూమి పెరగ కుండు జనుల తోడు
ప్లాట్లు యున్న చాలు పాట్లుండ బోవుగా
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

51)
ప్రణయన్నపుట్టె ఫిబ్రవరిపదిన
వంద యేళ్ళు నీవు హాయి గుండు
తలచినదితడువు దేవుడివ్వాలిర
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

52)
చంద్రుడన్నతెలుసు కవిమితృలందర్కి
చంద్రుడన్నతెలుసు కవనదారి
చంద్రుడేకదమరి కళలకు చంద్రుడు
చంస్రుడేను మరి దేవి పతుడు 

52)
అగ్ని సాక్షి తోడ తాలికట్టితిగాని
చివరి వరకు తోడు చూడ నైతి
మద్యలోనెవచ్చి మద్యలోవెల్లితే
ఏమికానుబతుకు ఒంటరైతి

53)
అడగ కుండ నాకు అన్నమే పెట్టింది
చేత డబ్బు బెట్టి షిర్డి బంపె
బాగు కోరు జనుల పదిలమ్ముగుండగా
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

54)
దగ్గుపాటి వంశ ఘనతపెంచెనితడు
పార్ధసారధియనుపామరుండు
చెట్లపుట్టలయందు చీడపురుగులందు
జనులనెల్ల మేల్కొలిపినాడు

55)(ఎయిర్‌పోర్టు లో ఆగమనాల వద్ద ఎదురుచూపులు, ఆలింగనాలను చూసి రాసిన కవిత)

ఎయిరుపోర్టులోన ఎన్నాల ఎడబాటొ
ఆగమనముకొరకు అందరచట
వారిరాకతోటె వదలిరి బాష్పాలు
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

56)
ఇరులుదాయిరులదాయిరులదొంగ ఇర్లుదొంగ ఇవముమేపరివము
యిన్నియన్నియనియెన్నొరవిపేర్లు
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

57)
పాపపుణ్యములను పర్వతకొండను
వృక్ష సంపదలను వానరులను
మానమృగములను మోయును భూతల్లి
భారమనక తాను భాద్యత తోడ

58)
మామ యన్న తెలుసు అమ్మతోబుట్టని
మామ యన్న తెలుసు ఆలి తండ్రి
చందమామ యేలయవునుమనకుమామ
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

59)
కాంత నారి లలన కామినీ యంగన 
మత్త కాశిని సతి మహిశి యన్య
భార్య  జాయ వర్య భామినీ మానినీ 
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

60)
అతివ అబల సబల అంగన తిలలామ
నాతి ఇంతి కాంత నారి తరుణి
భామ సుదతి పడతి భామిని ఆడది
మగువ రమణి వనిత మహిళ లలన

61)
(భర్త రాగానే భార్య పరిచర్యలు)
ఆవె
బర్తరాకకొరకు పడిగాపులుపడుతు
వచ్చెరాకతోటె వచ్చిపలకరించు
లుంగి చేతి కిచ్చి కాళ్ళకు నీలిచ్చి
చేత గ్లాసు నిండ చాయ యిచ్చు

62)
కార్యలయమునందు కష్టములడుగును
బాద పడిన యడల దైర్యమిచ్చు
భర్త మొఖము నందు యానందమేమెచ్చు
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

63)
కోర్కె దీర యిచ్చు నిలువెత్తు బంగారు
భక్తి తోడ కొలుచి కోట్ల జనులు
సమ్మ సారలమ్మ జాతర యందున
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

64)
పావురాలుబోయె ఉత్తరాలొచ్చెను
ఉత్తరాలుబోయి పేజరొచ్చె
సెల్లు నేడు యన్ని తలదన్నిపాయెరా
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

65)
దేవిచంద్ర జన్న దన్యమాయెనునేడు
సమ్మ సారలమ్మ దర్శనముతొ
అయ్య పుణ్యమాని అమ్మదర్శనమాయె
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

66)
ఆత్మ గౌర వమ్ము అలనాటి నుండియే
మట్టి నున్న బలము మనకు నెపుడు
మన్య మంత మురిసె మనవార సత్వమే
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

67)
చెరువు వలన మేలు జంతుజీవాలకు
పక్షి కీటకాల బతుకు దెరువు
కాకతియులుతొవ్వె ఘనముగా చెరువులు
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల

68)
నత్తి మాట తోడు నయనాలు కదిలిస్తు
బుంగ మూతి పెట్టి బుసలు కొట్టు
సగము బట్ట లేసి సొగసుచూపించును
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

69)
పప్పులోనయుండుబలమైనవిటమిన్లు
పప్పు తిన్న కారు పప్పు సుద్ద
పప్పు నెయ్యి తోడ బోంచేసి చూడుము
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

70)
మాంసహారకన్న శాకహారముమేలు
శాకహారమందుసకలముండు
శాకహారమన్న శహభాషు తిండిరా 
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

71)
శాక మన్న కూర శాకమనినచెట్టు
శాక మన్న కూర ఆకు కూర
శాక మనిన పప్పు శాకమే తినుమురా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

72)
బార్య బిడ్డలన్న బుద్దుడికిప్రేమ
వారినెపుడు వదిలి వుండలేడు
పద్మలేనిలోటు పూడ్చేది కాదయా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

73)
భార్య యన్న ప్రేమ భార్యయన్న భవిత
భార్య యన్న సఖల భాధ మనకు
భార్య లేక నీవు బతుకునడపలేవు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

74)
పూర్వ కాల మందు పెండ్లీలు జేసినా
ముందు గానె వచ్చు బందు జనులు
నేడు చూడ తంతు గంటలో ముగుసును
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

75)
సంతొషముగ నుండ సంతుప్రియాంకలు
పెళ్ళి రోజు నాడు పరవశించి
వంద వత్సరాలు వర్ధిల్ల వలెజంట
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

76)
పెద్దవారితోటి పిల్లపాపలతోటి
పెట్టెసదురుకోని బందులొచ్చె
ఇల్లుసందడాయె ఇంటిల్లి పాదికి
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల



77)
ఏసిటీవొ నేడు డీసిటీవోనయ్యె
ఇందిరమ్మ కెంతొ సంతసంబు
పదవులెన్నొనీవు పొందాలి ఘనముగా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

78)
కవులనెల్లతాను కూర్చెను నొకచోట
అయిత కవిత యజ్ఙ హితము కోరి
వృత్తి యందు నేడు పొందెపదోన్నతి
ఎదురులేదు రవికి  ఎందులోను

79)
కలసి యున్న చోట కలహాలు యుండునా
కలసి మెలసి మనము మెలయవలెను
కలసి యుండు వారె కవిమితృలందురు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

80)
మహిళ యన్న ఓర్పు మహిళయనిననేర్పు
మహిళ లేని మహిని చూడలేము
మహిళ వలనె కదర మానవ జన్మము
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

81)
అక్క చెల్లి మహిళ అమ్మమ్మబాపమ్మ
ఆడబిడ్డ అమ్మ కూడ మహిళ
ఆడవారు వారె ఆరిపోసుకొనుచు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

82)
సంఖ్య వలన కవిత సంగతే మరిచాము
సంఖ్య వలన కవులు రెచ్చిపోయి
సంఖ్య కన్న కవికి సంగతే ముఖ్యము
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

83)
పస్తులుండినాము పగలంత పూజతో
జాము రాత్రి వరకు జాగరణతొ
శివుని పూజ చేస్తి శివరాత్రి దినమున
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల


గుడిపల్లి వీరారెడ్డి గారు ఆరువందలకు పైగా పద్యాలు రాసిన సందర్భంగా.....
84)
వీర రాసె వంద వీరన్న పదములు
వీరు గణిత మీద నూరు రాసె
భావ వల్లరేమో మూడువందలుదాటె
శంభు మీద మరొక శతకమాయె

85)
అన్ని గలిపి జూడ ఆరువందలుదాటె
వేయి రాయ పెద్ద వెలది కాదు
రమణు భక్తి తోడ రంజిల్లు తుండెను
శివుని మాయ తనకు శక్తి నిచ్చె

86)
సమయవచ్చు వరకు సామాన్యుడిగ యుండు
సమయమొచ్చినాక సత్త జూపు
సమయమెంతొ మనము గమనించ వలయును
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

87)
చెంబు నీళ్ళు దెచ్చి లింగాన్ని పూజించి
బస్మదారజేసి భజనజేసి
పత్రి పూల తోటి భక్తితో కొలచుము
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

88)
నిప్పు మీద నీవు నీళ్ళుపోసినయారు
నిప్పు కాలి యవును నివురు గాను
నిక్కమున్నచోటె నిప్పుకు విలువుండు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

89)
ఒక్క మాసమైన రొక్కంబు లేకున్న
బక్క జీవి ఎటుల బతుక గలడు
పిల్ల యిల్లు జెల్ల గుల్లయై పోవుగా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

90)
తేట గీతి కంద ఆటవెలదులన్ని
లెక్క మీద కూడ లెక్క లేని
పద్య కవిత రాసె పలువురి మెప్పించె
వీర రెడ్డి సారు వీరుడయ్యె

91)
ఎడ్ల బండి లోన ఎక్కిచూడొకసారి
దుముకు కుంటు బండి దూసుకెళ్ళు
ఎన్ని బండ్లు ఉన్న ఎడ్లబండేమిన్న
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

92)
చెంబు నీళ్ళు లేక చావుమరణమాయె
నళ్ళ నుండి రాక నీళ్ళ వెతలు
పడుచు చుండె పాట్లు పట్నవాసులునేడు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

93)
నల్ల నీళ్ళు రాక నానపాట్లుపడుతు
నీళ్ళ కొరకు జనులు నీల్గుచుండె
పల్లె పట్న మన్న భేదమే లెదుగా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

94)
ఎండకాలమొచ్చె ఎండమండుచునుండె
నీడపట్టు లేక నీరసించె
చెట్లు ఉన్న నేడు చల్లగా యుండేది
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

95)
చేతి వాచి లేక చేయిచిన్నబోయే
కొడుకు నేడు నాదు కోర్కె దీర్చె
ప్రేమ పూర్వకంగా బహుమతినిచ్చెగా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

96)
మల్లి మేడమేమొ మక్కువతోరాసె
శతక కవిత లైదు చితక బాదె
వాసి రెడ్డి పదము వాస్తవమ్ముకదర
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

97)
బర్రెమీద కుక్క బలిసిపన్నదిచూడు
ఏమి చేయలేని ఎర్రి బర్రె
తెలివి వున్న వాడె తెగువచూపించును
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

98)
రంగు లెన్నొ నేడు రాజ్యమేలుతునుండె
చిన్న పెద్ద తేడ చూడకుండ
హోళి పండుగెంతొ హొయలుపడుచునుండె
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

99)
వేయి కవుల తాను వొకచోటనెకూర్చి
అయిత యజ్ఙ మంటు అంటు పెట్టె
వేయి కవన జ్యోతి వెలిగించె మనరవి
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

100)
మేరు కొండ లాగ మేకరవీంద్రుడు
కవుల కండగుండె కవనమల్ల
మేక రవిని కవులు మరువలేరెన్నడు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల


101) వీరారెడ్డి గారి మేనకోడలు పెళ్ళి అందర్భంగా

హైద్రబాదువధువు హాసినిహారిక
అనుపు రెడ్డి తోడ అమ్రికాకు
పెళ్ళి జేసుకోని వెళ్ళుచుండెనుజంట
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

102) అవేరా గారికి మనువరాలు పుట్టింది.

బిడ్డ కేమొ బిడ్డ పుట్టెనానందము
మనువరాలుతోడ ముదము పెరిగె
జరుపుకొనుచునుండె మెరుపుసంబరాలు
అమ్రికాలొ నేడు ఏవి రావు

103)
దుర్ముకొచ్చినాది దూసుకుంటీసారి
కాల గర్భ మందు కలసి పోను
ఆరు పదులు దాటి అరుదెంచెవత్సరం
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

104)
తెలుగు ముంగిటందు తెలవారె వత్సరం
కొత్త ఆశ లెన్నొ కట్టు కొచ్చె
సఖల జనులు యుండ శాంతిసౌఖ్యాలతొ
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

105)
అవేరా గారికి
రెండు వందల ఆటవెలదులను అవలీలగా అర్ధవంతంగా పూర్తిచేసినందుకు గానూ అభినందిస్తూ......

చిరు పద్య కానుక

ఆటవెలదితోటి ఆటలే ఆడావు
రెండు శతకములను నిండు జేసి
ఏవిరావుగారు అందుకో వందనం
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

106)
అయిత కవిత యఙ్ఞ ఆనంద హేళది
వేయి కవులు కలిసె వేదికిదియే
కవనధారులంత కలబోసియుండగ
కనులపండుగాయె కవులకంత


107)
ఎండకాలమొచ్చె నీడపట్టునయుండు
ఏటియెమ్ములోన ఏసి యుండు
ఏసి వాడుకొనుము ఏమిచెల్లించక
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

108) (చి. భరత్ జన్మదినం సందర్భంగా)

కవిత లల్లగలదు కమ్మగా పాడును
రాజవాసిరెడ్డి రమ్యముగను
జన్మదినమునేడు జయముకలుగుగాక
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

109) (రాజా వాసిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా)
కవిత లల్లగలదు కమ్మగా పాడును
రాజవాసిరెడ్డి రమ్యముగను
జన్మదినమునేడు జయముకలుగుగాక
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

110)
వాయు సుతుడు హనుమ వాయువేగంబున
భాను మింగ తాను బయలుదేరె
ఇంద్రుడడ్డుకొనగ హితము కూర్చగ ఆగె
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

111)
అడవి లోన హనుమ అడ్డెను రాముని
అసలు విషయమెరిగి అంత తిరిగె
సీత జాడ కొరకు చేరెను లంకను
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

112)
సీత మాత జూసి చింతిల్లి హనుమన్న
లంక కాల్చివేసి రంకెలేసి
తెలిపె సీత కపుడు దీన రాముని కథ
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

113)
రామ దండు కదిలె రావణు జంపగా
కోతి మూక చంపె పాతకులను
రావణుండు జచ్చె రామ బాణంబుతో
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

114)
అంత కలిసి చేరిరా అయోధ్యకు వేగ
సీత రామ అనుచు చెంతజేరి
రాము డయ్యె రాజు రాజిల్లె నగరము
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

115)
ఒక్కడున్నచాలు చక్కనైనహనుమ
దుష్ట శక్తు లెల్ల దూరమెళ్ళు
రామనామజపమె రమ్యముగాజేయు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

116)
పుట్టెడున్ననేమి పుస్తకాలింటిలో
చెదలుబట్టు తీసి చదువకున్న
మనసు పెట్టి చదివి
మదినిండ నింపుకో!
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

117)
శుద్దమైనదిసుమి శృంగారమెప్పుడు
నవరసాలలోన నదియునొకటి
శృతియె మించినపుడు శృంగభంగమగును
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

118)
భోజన పథకం పై నా అభిప్రాయం

ఉన్న వాడు ఎవడు ఊరికే తినిరాడు
లేని వాడి కెంతో లేప్య మదియె
పేదవాడికింత పేగుకాసరవును
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

119)
ఎండలెక్కువాయె పంటలెండియుపోయె
గడ్డి పరకలేక బీడు బోయె
పశువు బాధ నెవడు పట్టించు కోడాయె
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల
సూర్య గణములు

120)
దారిలోన పంట పొలాలన్నీ ప్లాట్లు చేసి అమ్ముతున్నారు

పంట పొలము నేడు పాకస్థలములయ్యె
జనులు పెరుగు చుండె జగము నందు
పంటలేక మనకు పబ్బమెట్లగడుచు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

121)
చేత కత్తి బట్టి చెక్కులూడయుదీసి
యంత్ర మందు బెట్టి యరగదీసి
రసము దీసి జనులు రంజుగాత్రాగేరు
దీని భావ మేమి ధీరులార?
(చెరకు రసం)

122)
పెద్ద బండి ఎక్కె పెసరులింగారెడ్డి
నవ్వు మోము తోడు నళ్ళ జోడు
రయ్యుమంటుతోలు రాజోలె బండిని
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

123)
ఎండకాలమందు ఏమిజేయగలరు
ఏడి కెల్దమన్న ఎండ బాధ
ఈడికాడికన్న ఇంట్లున్నదేనయం
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

124)
ఇంట ఇంట యొకటి ఇనుకుడు గుంతున్న
ఇనుకు నీరు మన ఇంటిలోన
నీటి కొరకు తప్పు యేటేట బాధలు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

125)
ఇంట్లో కూరగాయలు తెమ్మంటారు.... తీరా తెచ్చాక వంకలు బెట్టుతారు ఇలా .....
కదా😃

బీరకాయదెస్తె పీచున్నదంటారు
దొండ కాయ దెస్తె పండు పండె
మునగ కాయ దెస్తె ముదిరింది యంటారు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

126)

గాలి వాన వచ్చి గాలిలోకలిసిన
ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె
పంటనష్టపోగ గుండాగె రైతుది
జ్యొతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

127)
సరదాగా సుమండి

దురుద యున్న చోట గోరుతో గోకిన
సమ్మ గుండు ఎంతొ సామిరంగా
గోకుడున్ననీకు గీకుడేమందురా
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

128)
 చిన్న సవరణతో....

బండపగల గొడుతు బావులెన్నోత్రవ్వ
బెండు మునుఁగు నినుపగుండు దేలు
నీటి చుక్క రాక నీరసించె జనులు
జ్యోతినవ్య కృష్ణ జూడుఁ మఖిల

129)
అమ్మ లేని బాధ అందరెరుగబోరు
మాతృ మూర్తి గొప్ప మాకు తెలుసు
తల్లి ప్రేమ లేక తల్లడిల్లుచునుంటి
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

130)
అమ్మ యాది కొచ్చి ఆగమయ్యెమనసు
మళ్ళి దొరకదాయె తల్లి మనకు
అమ్మ ఉన్న వాడె అధికసంపన్నుడు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

131)
ర్యాంకు వచ్చినేమి రాజకీయముముందు
చదువు కున్ననేమి చదువుకొన్న...
మేధ యుండు యెపుడు మేధవికేనురా
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

132)
చదువు చదవ నేల చవటవ్వడముయేల
చదువుకన్ననేల చదునుమేలు
విలువలేని చదువు వదులుకోసోదరా
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

133)
వ్రాయ వ్రాయ అదియే వ్రాయవచ్చునండి
అందులోన యేమి సోద్యముంది
రాయవలెను అన్న రాయగలవునీవు
జ్యోతి నవ్య కృష్ణ జుడుఁ మఖిల

134)
ఆట వెలది తోటి ఆటలాడేవేర
తేటగీతితోటి తేనె లొలికె
కందమందు తాను ఘనుడాయె మెండుగా?
జ్యోతి నవ్య కృష్ణ జుడుఁ మఖిల

135)
అచ్చ తెనుగు రాదు ఆంగ్లమసలురాదు
వచ్చిరాని చదువు వగలు లెస్స
ఆంగ్ల మాద్యమందు అంతేర చదువులు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖి

136)
చింతపండు ఓమ జిలకర్ర దంచేసి
మిరుపకాయదెచ్చి చీర్చిపెట్టి
వేడి నూనెలోన వేయించి తిన్నచో
నమిలి చూడ నాల్క నాట్యమాడు

137)
పండ్లపుల్లబోయి ప్లాస్టీకు బ్రష్షొచ్చె
సేమియాలొనేడు సిల్కు జొచ్చె
దొంగ నోట్లు కాస్త దొరలనోట్లాయెరా
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

138)
కానరాని మందు కార్భైడ్ వాడుతూ
పసుపు రంగు కొరకు పాకులాడి
పచ్చి కాయ దెచ్చి పండ్లను జేస్తుండ్రు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

139)
వ్యాఖ్యాన రత్న బిరుదు పొందుతున్న శ్రీమతి లలిత గారికి అభినందనలతో.....

వంశి సంస్థనుండి వ్యాఖ్యాన రత్నగా
బిరుదు నొందుచుండె అరుదుగాను
లలిత గారు మీకు వేలవందనములు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

140)
మధుర గాయకమౌళి వై ఎస్ రామకృష్ణ గారికి అభినందనలతో

మధుర గాయకుండు మౌళాయె యీరోజు
రామకృష్ణగారు రమ్యముగను
అందు కోండి మీరు అభినందనలమాల
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

141)
భర్త రాక కొరకు భార్యయెదురుచూపు
అతడు రాకపోతె అలక పాన్పు
ప్రేమకొద్ది చూసె భామనే భార్యగా
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

142)
నాల్గు పుస్తకాలు నలుగురు మెచ్చంగ
రాజ వాసిరెడ్డి రాయగలిగె
పురుడు పోసుకోను పుణ్యదినమునేడు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

143)
కులము మతము లంటు కుచ్చులాటలువద్దు
కులము మతము కన్న గుణము మిన్న
కులమతాలుమనకు కూడుపెట్టవుగదా
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

144)
మతము పేర నేడు మారణహోమాలు
కులము పేరనేమొ కుచ్చులాట
కులమతాలతోటి కూల్చకు సంఘాన్ని
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

అవయవదానము లపై అవగాహన కొరకు

145)
కన్ను కిడ్ని లివరు కొనలేముమనము
అవయవములు లేక ఆర్తు లంత
ఎదురు చూచు చుండె ఎవరిద్దురాయని
అవయదానమిచ్చి ఆదుకొనుము
(జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల)

146)
సర్వ యింద్రియాలు సమపాలు లుండక
అవటితనముతోటి అలసిపోయి
తల్లడిల్లుచుండె తమవారు ఎందరో
అవయదానమిచ్చి ఆదుకొనుము
(జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల)

147)
కాలుచేయిలేక కంటిచూపుయులేక
బిచ్చమెత్తుకుంటుబతుకుటాయె
చూపు యున్న యేదొ చేసుకొనిబతుకు
అవయదానమిచ్చి ఆదుకొనుము
(జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల)

148)
ఆస్తిపాస్తులుండి అంతస్తులున్ననూ
అవయవాలు లేక అవటి తనము
ఏడకొందమన్న ఎవరమ్ముతారవి
అవయదానమిచ్చి ఆదుకొనుము
(జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల)

149)
కిడ్ని పనికి రాక కుశియించెనొక్కడు
కళ్ళు లేక యేమి కానరాక
గుండె లోన కొవ్వు గూడుకట్టిసచ్చె
అవయదానమిచ్చి ఆదుకొనుము
(జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల)

150)
 చేతులన్నిపోగ చేవసచ్చియుపోగ
తానె సచ్చిపోయె చేనెతన్న
ఆదుకొందురెవరు అయన్ననిప్పుడు
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

151)
 బట్టనేయు తనకు బట్టలే కరువాయె
తింద మన్న కూడ తిండి లేక
ఉందమన్న నేడు ఊరువాకిలియేది
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

152)
 సకలజనులసమ్మె సాధించే రాష్ట్రము
అమరులాషయంబు అమలు కొచ్చె
కేసియారుసారు కేముంది ఎదురింక
రాజ్యమేలుతుండె రాజువోలె
(జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల)

153)
ఎంత విద్య నేర్చి యేముంది లాభమూ
బాపనయ్యబతుకు బారమాయె
బతుకు దెరువు లేక బడుగాయె బ్రాహ్మండు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

154)
విప్రుడన్నవాడు విజ్ఙతతోనుండ
దారిచూపు తాను దాత్రికెపుడు
విశ్వమందు తాను విజయుడీలాగురా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

155)
జూదగాళ్ళమీద జోరుగా రాసావు
అనుభవాలు ఉన్న అతివలాగ
రవియు గాంచలేంది కవిగాంచునందురే
సందితమ్మనీకు వందనాలు
(జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల)

156)
విప్రుడన్నవాడు విజ్ఙతతోనుండ
దారిచూపు తాను దాత్రికెపుడు
విశ్వమందు తాను విజయుడీలాగురా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

157)
ఎంత విద్య నేర్చి యేముంది లాభమూ
బాపనయ్యబతుకు బారమాయె
బతుకు దెరువు లేక బడుగాయె బ్రాహ్మండు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

158)
పేరుగొప్ప తనది పేదరికముయున్న
బాపనయ్య యెంత బాధ యున్న
కరువు యెంత యున్న కనపడకయుండురా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

159) తొలి ఏకాదశి సందర్భంగా

విష్ణుమూర్తి నేడు విశ్రాంతి పొందగా
శయ్య పైన నేడు శయ్యనించి
శయన యేకదశిమి స్వామికుపవాసం
పొందు జేసి నీవు పుణ్యఫలము
(జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల)

160)
అమ్మ యన్న పిలుపు ఆత్మీయతనుపెంచు
అమ్మలేని జన్మ అడవిపాలు
అమ్మ యున్నవాడె అధిక సంపన్నుడు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

161)
అనగ యనగ నొక్క అబ్దుల్ కలాముడు
పేపరమ్ముకుంటు పెరెగెనతడు
రాష్ట్రపతి యె యాయె రామేశ్వరమువాల
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

162)
(శంకరాభరణం సమస్య)

దేశమందుయున్న దేశద్రొహులపైన
పోరు వలన శాంతి బొందగలము
ద్రోహులెక్కడున్న తొక్కిచంపాలిరా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

163)
అమ్మ యన్న పిలుపు ఆత్మీయతనుపెంచు
అమ్మలేని జన్మ అడవిపాలు
అమ్మ యున్నవాడె అధిక సంపన్నుడు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

 164)
మారుతన్న యన్న మంచికి మార్పేరు
మారుతన్న మనకు మార్గదర్శి
జన్మదినము నేడు జయముగలుగునీకు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

(చిరకాల మిత్రులు, సీనియర్ జర్నలిస్టు, టి యు డబ్ల్యూ జె నాయకులు అయిన శ్రీ మారుతి సాగర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో కందపద్య కానుక)

165)
డాట అయ్యిపోయి ఆటాగిపోయెగా
సొల్లు కబురులన్ని సెల్లులోనె
చాటు చేయలన్న చార్జింగు కావలె
సెల్లు లేకపోతె ఇల్లు గళ్లు

166)
కంటికేమొరెప్ప కాలుకు బూటులు
వంటికేమొబట్ట ఇంటికప్పు
దుప్పటోలమనకు కప్పబడుండును
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

167)
 (కవిమిత్రుడు అవేరా గారు SE గా పదోన్నతి పొందిన శుభసందర్భంగా కవితా కానుక)

జూనియర్రునుండి సీనియర్రాయెగా
ఇంజనీరుసారు ఏవిరావు
అందుకందుకొనుము యభినందనలమాల
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

168)
ప్రొ. జయశంకర్  సారు జయంతి సందర్భంగా

పోరు బాట పట్టి పోరాటమేజేసి
అమరుడయ్యె మనకు మార్గదర్శి
జయహొ జయహొ నీకు జయశంకరాసారు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

169)
శ్రీమతి & శ్రీ సర్వేపల్లి వర్ధనమ్మ వేణుగోపాలరావు గార్ల అర్ధ శతక పెళ్లిరోజు సందర్భంగా కవితా కానుక...

వర్ధనమ్మ వేణు వందనములుమీకు
వందయేళ్ళు మీరు వర్ధిల్లవలెను
అర్ధశతకమాయె ఆల్మొగలుగమీకు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

170)
ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.....

చుట్టరికములేని నిండునేస్తమతడు
స్వార్ధచింతలేని స్నేహితుండు
కష్టసుఖములోన కడదాకనుండురా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

171)
రక్షబందన్ సందర్భంగా

ఆవె.
అమ్మ లోని ఆది నాన్నలోనిచివవర
రెండు కలిపి చూడు నిండుగాను
అన్న యన్న యతనె యవనిలొ చెల్లికీ
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

172)
ఆడ పిల్లలెల్ల యాడదొరకరాయె
కొడుకు పెళ్లినేడు కొరివియాయె
వరుని కొరకు నేడు వధువులే కరువాయె
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

173)
ఏలభామనీకు యిట్టివేలయలక
ఏమివరమునీకు యివ్వగలను
పారిజాతమెపుడొ పాతదయ్యెనుకదా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల


174)
ఆలి యలిగినంత యలకువ యనుకోకు
బ్రతిమిలాడిచూడు బంగపడక
ఆలుమగలమధ్య అలకలు మామూలె
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

175)
జలముతోటి తడచి జగముపులకరించు
అగ్గిలేని జగము బుగ్గిపాలు
నింగి నేల గాలి నీరునిప్పుమనకు
నిత్య మవసరములె నిజము సుమ్మి
(జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల)

176)
తెలుగు బాషాదినోత్సవ శుభాకాంక్షలతో...

అమ్మ నాన్న పలుకు యానవాలేలేదు
మాతృ బాష మీద మక్కువేది
తెలుగు మాటలాడు తెలుగు ఘనతచాటు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

177)
అమ్మ నాన్న యనెడి యాత్మీయ పలుకులు
పద్య సంపదున్న బాష మనది
తేటతెనుగుబాష తెలుగు భాష
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

178)
వానవచ్చెనేమి వరదలైపారగా
నిత్యనరకమాయె నగరమందు
ప్రభుతమారనేమి పనితీరుమారదే
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

179)
ఆలి యలుకచూడ యానందముగనుండు
బ్రతిమిలాడుచుంటె బాగుగుండు
ఆలుమొగలమద్య యలుకలు మామూలె
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

180)
ఆలుమగలమద్య అంతరం పెరిగినా
సంతసంబుకాదు సతికిపతికి
ఒడుదొడుకులనొదిలి ఒక్కటైపోవాలి
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

181)
జ్యోతి అలిగెనంటె జోరుగాయుండును
చిన్న నవ్వుతోటె చెరిగిపోవు
అలకలున్నచోటె ఆప్యాయతలుయుండు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

182)
నోరు యున్న కూడ నోరెత్తియడుగవు
నమ్మినోడె తనను నరుకుతున్న
మూగజీవిబతుకు మూగబోనున్నదా?
జ్యోతు నవ్య కృష్ణ జూడు మఖిల

183)
నోట్లు మార్చి ప్రభుత నోట్లమన్నేగొట్టె
దొంగ నోట్లుచేయు దొంగలకును
మోడిపొందెనేడు మోదమైనఘనత
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

184)
దొరలచెంతనేడు దొంగనోట్లెన్నియో
చెల్లకుండబోవు  చెదలుపట్టి
కష్టపడ్డవాడు నష్టపోవద్దురా
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

185)
నోట్లు మార్పుతోటి నోటుదొరకదాయె
బ్యాంకుముందుయంత బార్లుదీరె
ఏటియమ్ములన్ని ఎండినట్లాయెగా
జ్యోతి నవ్య కృష్ణ జూడుఁ మఖిల

ఇందిరావెల్ది గారిని ఉద్దేశించి
186)
పద్య మొకటి రాయ ప్రయుతలో యిందిర,
యతులు ప్రాసలేమొ గతులుతప్పె.
గద్యరూపమందు పద్యమే రాయగా
పద్యలక్షణాలు పారిపోయె.

187)
 ఇందిరమ్మ నేడు కలమునే ఝులపించె
కవులమీదతాను కవితలల్లి
వెలుగుతల్లినీవు వెయ్యేళ్ళు హాయిగా
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

2017 లో మొదటి కవిత

188)
అవయవములు యున్న దేవాంగులెందరో
దొంగవేషమేస్తు దోచుకుంటు
దేశప్రగతినంత దిగజార్చుచుండెగా
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖల

189)
పొద్దుగాలలేసి బోగిమంటలువేసి
బోగిపండ్లుపోసె పీడతొలగ
సంకురాతిరివచ్చె సంబరాలేదెచ్చె
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖల

190)
సంకురాత్రి నాడు సంభరాలేజేయ
కవులు యంత కలిసి కవితలల్లి
కవన విందు జేయ కనులార చూడండి
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

191)
తల్లి యన్న తనకు తనివితీరనిప్రేమ
ఆలి వచ్చి నాక యన్నిమరిచే
ఆలి కూడ రేపు అమ్మకాకుండునా
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

192)
సెల్లు లోనె నేడు సొల్లు కబురులన్ని
ఫోనులోనె గలవు ఫోటొలన్ని
కెమర, కంప్యుటర్లు కలవిందులోనేడు
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

193)
మాడుగుల నారాయణ మూర్తి గారి ఆంగ్ల పద్యాలకు నా స్పందన

ఏది రాస్తెనేమి ఎక్సులెంటేకదా
మాడుగులకు యది మాములేగ
భాషయేదియైన భావము ముఖ్యము
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

194)
తల్లిదండ్రి నొదిలి తనవారినొదిలొచ్చి
జీవితాన తాను జ్యోతివోలె
మెట్టినింటతాను జోతలే నింపింది
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

195)
నాదు వేలు పట్టి నడిపించె మానాన్న
నాదుచేయిపట్టి దిద్దిపించె
అడిగినదెతడవుగ యన్నియిప్పించెగా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

196)
మంచి మాట జెప్పి మంచితనమునేర్పి
మానవత్వమన్న మాటతెలిపి
మనుషులందు జూపె మాహానుభావులన్
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

197)
కష్ట నష్టమందు.... కడదాక నిలిచేటి
సుఖము దుఃఖమందు సోపతుండు
నాలుమగలుకాద! యాదర్శ దంపతుల్
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల

198)
విఘ్నరాజ నిన్ను వినతితో మ్రొక్కెద
విఘ్నములనునెల్ల బగ్న పరుచు
ఇల్లుపిల్లనెల్ల యింపుగా చూడయ్య
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

199)
ఇష్టపడ్డవాణ్ణి కష్టపెట్టవలదు
కష్టమయిన గాని యిష్టపడుము
యిష్టమైనదెపుడు కష్టమవ్వదుకదా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

200)
నుదుట బొట్టు పెట్టి యెదుటనిలిచినాది
కండ్ల కాటుకెట్టి కన్నెపిల్ల
తొంగిచూడబట్టె దొంగచూపులతోటి
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

201)
కట్టుకున్నదాన్ని కన్నవారినొదలి
పొట్టకొరకు కట్టుబట్టకొరకు
పల్లెనొదిలి జనులు పట్నమెళ్తున్నారు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల