Tuesday, June 13, 2017

సినారె ఇకలేరు



ఇకలేరు మన సినారె

గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని,  హైదరాబాదు.

ఇకలేరు సినారె
కవనాలతో అలసినారె
ఎన్నో కవనాలు రాసినారె
ఎంతోమందికి జ్ఙానంబోసినారె
చాలామంది కవులకు మార్గం చూపేసినారె
ఎన్నోసంకలనాలకు ముందుమాట రాసినారె
సాహితీవేత్తల మదులను దోచేసినారె
ఎందరిమనసులనో గెలిచేసినారె
జ్ఙాన్ పీఠ్ అవార్డును పొందేసినారె
ఉన్నతపదవులెన్నోచవి చూసినారె
కవులందరికి దారి గీసినారె
మా అందరికి మార్గదర్శి సినారె
మాహృదిలో దేవుడు సినారె
దేవుడు ఏంమాయ జేసినారె
మమ్మువిడిచి వెళ్ళేసినారె
లేరు లేరు ఇక మా సినారె

బాదాతప్తహృదయంతో....
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు
9700007653