Saturday, April 23, 2016

వ్యభిచారిణి

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని. హైదరాబాద్.
9700007653

శీర్షిక: వ్యభిచారిని....

ఏ స్త్రీ తనమానాన్ని తాకట్టు పెట్టాలనుకోదు....
తన జీవితాన్ని అందరిలాగా ఒకడితోనే పంచుకోవాలని భావిస్తుంది....
కానీ కాలం వారిని కఠినంగా మార్చేస్తుంది....
కారణాలు అనేకం.....
చిన్నతనంలోనే తల్లి దండ్రులకు దూరమై కొందరు....
నా అని చేరదీసే వారు లేక ఇంకొందరు....
దుర్మార్గుల కంటపడి బతుకీడుస్తున్న వారు మరికొందరు....
తోడులేక కొందరు.... తోడుండి సుఖము లేక ఇంకొందరు....
ఇలా మొదలై వారు...
అవసరాలకోసం,
ఆనందాల కోసం,
సరదాల కోసం,
కుటుంబ పోషణ కోసం,
మరే గత్యంతరము లేక
అందులోనే కొనసాగిస్తున్నారు.....

వారు ఆనందిస్తున్నారు అనుకుంటే పొరపాటే....
మద్యం తాగి వస్తాడు ఒకడు,
గుట్కాలు, తంబాకు, కిల్లీలు నములుతూ వస్తాడు ఇంకోడు....
స్నాన పానాదులు లేక కంపుతో ఒకడు....
అడ్డమైన సెంటు కొట్టుకొని మరొకడు.....
సిగిరెట్ వాతలు... గోర్ల గాట్లు....
అసభ్య పదజాలాలు.... వికృత చేష్టలు....
ఇలా అన్ని భాదలను వారు అనుభవిస్తూ దొంగచాటు నవ్వుతో కవ్విస్తూ దుఖిఃస్తూ సుఖిస్తున్న అభాగ్యులు....
ఎదుటివారిని సుఖపెడుతూ వారు సుఖవ్యాదుల బారిన పడుతున్నా వైద్యఖర్చులకు కూడా ధనం కూడబెట్టుకోలేని అనాధలు వారు...
పోలీసులకు పట్టుబడి బయటకు కూడా రాలేని దుస్థితి మరికొందరిది....
సమాజంలో  ఛీత్కారం....
వాడుకున్న వాడు కూడా ఛీ కొట్టడం....
చివరికి పిల్లలదృష్టిలో చిన్నచూపు...
ఇదీ వారి జీవనపయనం ...
అవసరమా ఈ జన్మ అనుకుంటూ.... జీవిస్తున్న దౌర్భాగ్యపు బతుకు వారిది....

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని. హైదరాబాద్.
9700007653

Monday, April 11, 2016

మళ్లీ వచ్చింది మరో ఉగాది


గోగులపాటి కృష్ణమోహన్
08-04-2016


మళ్లీ వచ్చింది మరో ఉగాది

కొత్త ఆశలతో... క్రొంగొత్త ఆశయాలతో....
తెచ్చింది తెచ్చింది మరెన్నో ఆశలకు, ఆశయాలకు కొత్త పునాది..
ఉగాదులు మారుతున్న ప్రతిసారీ....
ఆకులు రాలుతున్నాయి...
కొత్తగా చిగురిస్తున్నాయి.... కానీ
ఎండిపోయిన జీవితాలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు.
సగటు పేద, మద్యతరగతుల జీవితాలలో మాత్రం  కొత్త చిగురు ఊసే లేదు....
నెలాఖరు రాగానే.... మొదలవుతుంది నెలజీతగాని జీవితం....
పాలవాన్ని చూస్తే భయం,
పేపరోన్ని చూస్తే భయం...
చిట్టీలోన్ని, కొట్టోన్ని, అప్పులోన్ని,...
పిల్లల చదువులు, పెద్దల మందులు...
పండుగలు, పబ్బాలు...
పెళ్ళీలు, పేరంటాళ్ళు....
చావులు, తద్దినాలు.....
బట్టలు, బంగారాలు....
ఇలా ..... అన్నీ ఖర్చులే....

ప్రతి ఉగాది నాడు ఆదాయ వ్యయాలకు, రాజ పూజ్యాలు చూసుకొని మురవడమే తప్ప....
అసలుకు పోలిక ఉండదు....
ఈ ఏడాదైనా ఉంటుందనే ఆశతో
మరో ఉగాదికి ఆశతో స్వాగతం పలుకుతూ..... గోగులపాటి కృష్ణమోహన్