Wednesday, September 20, 2017

రాక్షస రజాకార్లు



శీర్షిక : రాక్షస రజాకర్లు
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు
మొఘలాయుల పాలనలో
మోసపోయినారు ప్రజలు
ఆంగ్లేయుల పాలనలో
అణిగిమనిగి బతికినారు
నైజాముల రాజ్యంలో
రంకు రజాకర్ల హుకుం
కంటికి కనిపించింది
కళ్ళముందె క్రూరంగా
కసితీరా అనుభవించి
కాటికి పంపారుగా
పిల్లాతల్లని చూడక
కామాందుల ఘఢీలలో
బందీలై పోయారు
తెలంగాణ వనితలు
రజాకార్ల దాడికి
గుబురులే గుడిసెలాయె
చెల్కలే ఊరాయె
ఊర్లేమో ఎడారాయె
పంద్రాగష్టురోజు
దేశానికి స్వాతంత్ర్యం
వచ్చిందని వినడమే
నైజాముల పాలనలో
లేదుమనకు స్వాతంత్ర్యం
ఉక్కు మనిషి వల్లభాయ్
సలాం సలాం నీకు భాయ్
సర్ధార్జీ సాహసంతొ
హైదరాబాద్ దక్కినాది
ముష్కరులను పారద్రోల
లష్కర్లో సిపాయి దింపి
సవాలే విసిరావు
సావే దిక్కన్నావు
నైజామే దిగివచ్చి
నీకు సలాం పెట్టాడు
హైదరబాదు నీకు
హస్తగతం అయ్యింది
సెప్టెంబర్ పదిహేడున
తెలంగాణా దక్కింది
అదే మనకు స్వాతంత్ర్యం
అదే మనకు స్వతంత్రం
తెలంగాణా విమోచనా దినోత్సవ శుభాకాంక్షలతో

మీ
సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007653

No comments:

Post a Comment