Friday, January 22, 2016

రాక్షస రాజకీయం

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు,
సూరారం కాలని, హైదరాబాద్.

శీర్షిక : రాక్షస రాజకీయాలు

అసలు కుల, మత, గోత్రాలు ఎలా పుట్టాయి

నమ్మకాలే మన మతాలు
రక్తసంబందాల కోసం గోత్రాలు
చేతి వృత్తుల ఆధారంగా కులాలు
ఉద్భవించావన్నది ముమ్మాటికి నిజాలు..

కానీ....నేటి కుళ్ళు రాజకీయాలకు
కుల, మతాలే ఆయుధాలయ్యాయి...
మారణహోమాలకు కారణాలయ్యాయి...

అంతరిక్షానికి వెలుతున్న తరుణంలోనూ
అసమానతలు... అంటరాని తనాలు...

ఓట్లకోసం రాజకీయాలను కుళ్ళు చేస్తున్నారు మన నాయకులు ....

ఆదిపత్యం కోసం ఒకడు
పదవీ వ్యామోహం కోసం ఇంకొకడు
అఙ్ఞానంతో ఒకడు... విజ్ఞానంతో ఇంకొకడు
ఇలా ఎవడికి వాడు
యమునాతీరుగా.....
వాస్తవాలను మరిచి వీధికెక్కుతున్నారు
వీధి కుక్కల్లా వాగుతున్నారు....

ఒకప్పుడు దారిద్ర్యము తో అలమటించే వాన్ని"దళితులు" గా పేర్కొంటే
నేడు ఆ పదానికి విలువ లేకుండా చేస్తున్నారు నేటి బడా బాబులు...

దళిత బోర్డుతో కొందరు కార్లలో ....
మరికొందరు బహుళ అంతస్తుల భవనాలలో బతుకీడుస్తున్నారు....
దళితులంటే వీరా?
అని ప్రశ్నించే విధంగా ప్రవర్తిస్తున్నారు...

కాని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారి బతుకులలో మాత్రం మార్పు లేదు... రాదు...
ఎందుకంటే వారిలో మార్పువస్తే ఇక ఈ  నాయకులకు పనిఉండదు కదా...

అందుకే...అందుకే చెబుతున్నా....

"దరిద్రులంతా.... దళితులు కారు....
దళితులంతా... దరిద్రులు కాదు...." అని.

నేడు దారిద్ర్యము అనుభవిస్తున్న వారిలో
చాతుర్వర్ణస్తులు ఉన్నారు....
అన్ని మతస్తులు ఉన్నారు....
పండితులు ఉన్నారు....
పామరులు ఉన్నారు....
చేతి వృత్తులవారు ఉన్నారు....
కుల వృత్తుల వారు ఉన్నారు....
రైతులు ఉన్నారు.....
రోజు కూలీలు ఉన్నారు....
రాజకీయ నాయకులున్నారు....
రౌడీలు ఉన్నారు...

ఇలా ఎందరో నేడు దారిద్ర్యం అనుభవిస్తున్నారు....

దళితనాయకులమని చెప్పుకునే నాయకులారా....
నిజంగా దళితోద్దరణే మీ నినాదమైతే...
దారిద్ర్యం అనుభవిస్తున్న అందరినీ దరికి చేర్చండి....
కుల గోత్రాలు అడగకండి....

కులం పేరుతో రాజకీయాలు చేస్తున్న నాయకులారా..... నిజంగా కులోద్దారనే మీ కల అయితే.....
కులవృత్తులనే నమ్ముకొని కూటికోసం తపిస్తున్నవారిని ఆదుకోండి....
అగ్రకులాలని చూడకండి....

మతం పేరుతో మారణహోమానికి పాల్పడుతున్న మతోన్మాద నాయకులారా...
మతోద్దారనే మీ అభిమతమైతే....
మతంలోని మంచితనాన్ని చాటండి.....
మారణహోమాల్ని మత మార్పిడిలను ఆపండి....

ఇకనైనా మెల్కొనండి
కులం పేరుతో... మతం పేరుతో...
రాజకీయాలు మానండి.....
అసమానతలు, అంటరాని తనాలు లేకుండా చేయండి....

ఈ జగతిలో రెండుకులాలే అని నమ్మండి.... అవి
ఒకటి  ధనికులమైతే...
రెండు పేదకులం....

పేదల కోసం పాటుపడండి
నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఎలుగెత్తి చాటండి....

రాక్షస రాజకీయానికి తెర దింపండి
నిస్వార్ధ రాజకీయానికి తెర లేపండి

మన రాజ్యాంగ నిర్మాతల కలలు
సాకారం చేయండి....
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి....

11 comments:

  1. 🌷🌳🌅🌳🌷
    శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు
    వర్తమానాన్నిి చేరువగా చదివి నిశితంగా పరిశీలనజేసి రైపటి
    దృష్టి తో ఆలోచించి ఈ దినము
    "రాక్షస రాజకీయాలగురించి"
    చిత్రీకరించారు.
    మన కవన సహస్రమంతా
    తరతమ బేధములు లేకుండా కళాత్మకంగా
    మానవీయమైన సామాజిక కోణములు గల దృష్టి తోనే కవితలు
    వ్రాయుచుండుట అత్యంత ముదావహము.
    శ్రీ గోగులపాటి కృష్ణమోహవ్ గారికి
    మరియు
    సహస్ర రవిమిత్రులందరికీ
    అభివందనములు
    ధన్యవాదములు
    అభినందనలు
    🙏🌅🙏
    పార్థసారథి నాయుడు దగ్గుపాటి

    ReplyDelete
  2. కృష్ణమోహన్గారు రాక్షసులు పురాణాల్లో ఉండేవారని విన్నాను
    కానీ ఇప్పుడు చూస్తున్నాము కాకుంటే ఆకారాల్లోనే తేడా......
    కవిత బాగుంది
    మీ
    అంజయ్య గౌడ్,

    ReplyDelete
  3. అన్ని సమస్యలు విశ్లేషించారు కవితలో.🙏
    ఇందిరా వెల్ది

    ReplyDelete
  4. 🌺🌺🌺🌺

    కృష్ణ మోహన్ గారూ

    మీ సుదీర్ఘ ఆవేదన అర్ధవంతంగా ఉంది
    విపులంగా ఉంది
    సమసమాజ నిర్మాణం కోసం చేసే యజ్ఞం లో కొన్ని లోపాలుంటాయి
    అంతమాత్రాన అన్నీ తప్పన లేము

    దళిత భావన పేదరికానికి మాత్రమే సంబంధించినది కాదు...

    అసమానతలనేవి...ఆర్ధిక సంబందమైనవే కాదు...అనేక కోణాలు ఉంటాయి...ఉన్నాయి
    మీ విశ్లేషణ లో కులమూలాల ని స్పర్శించే ప్రయత్నం బాగుంది

    మీ కవిత మూలాల లోతులు చేరే ప్రయత్నం చేయడం బాగుంది

    మీకు ధన్యవాదాలు

    కృష్ణ మోహన్ గారూ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు

    🌷🌷🌷🌷
    వీరా గుడిపల్లి

    ReplyDelete
  5. 🌺🌺🌺🌺

    కృష్ణ మోహన్ గారూ

    మీ సుదీర్ఘ ఆవేదన అర్ధవంతంగా ఉంది
    విపులంగా ఉంది
    సమసమాజ నిర్మాణం కోసం చేసే యజ్ఞం లో కొన్ని లోపాలుంటాయి
    అంతమాత్రాన అన్నీ తప్పన లేము

    దళిత భావన పేదరికానికి మాత్రమే సంబంధించినది కాదు...

    అసమానతలనేవి...ఆర్ధిక సంబందమైనవే కాదు...అనేక కోణాలు ఉంటాయి...ఉన్నాయి
    మీ విశ్లేషణ లో కులమూలాల ని స్పర్శించే ప్రయత్నం బాగుంది

    మీ కవిత మూలాల లోతులు చేరే ప్రయత్నం చేయడం బాగుంది

    మీకు ధన్యవాదాలు

    కృష్ణ మోహన్ గారూ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు

    🌷🌷🌷🌷
    వీరా గుడిపల్లి

    ReplyDelete
  6. గోగులపాటి కృష్ణమోహన్ గారి "రాక్షస రాజకీయాలు"దళితుల ఆవిర్భావం మొదలగు విషయాలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. 👏👏
    మీ
    కడబాల నాగేశ్వరరావు-

    ReplyDelete

  7. కృష్ణ మోహన్ గారి రాక్షస. రాజకీయాలు నైస్ సార్
    ... మాదవీలత

    ReplyDelete

  8. కృష్ణ మోహన్ గారి రాక్షస. రాజకీయాలు నైస్ సార్
    ... మాదవీలత

    ReplyDelete
  9. రాక్షస రాజకీయాలు సూపర్ గా కడిగేశారు 🙏🙏కృష్ణమోహన్ గారూ
    అవేరా

    ReplyDelete
  10. కృష్ణ మోహన్ గారు మ రాక్షస రాజకీయాలు కవిత నేటి వ్యవస్థకు దర్పణం.
    నాహరాజు, కర్నూలు

    ReplyDelete
  11. కృష్ణ మోహన్ గారు మ రాక్షస రాజకీయాలు కవిత నేటి వ్యవస్థకు దర్పణం.
    నాహరాజు, కర్నూలు

    ReplyDelete