Thursday, January 7, 2016

బాల్యాన్ని రక్షించండి


                     శీర్షిక : బాల్యాన్ని రక్షించండి

చిట్టిచేతుల చిన్నారులు ....
బాల కార్మికులైనారు....
ఆడిపాడాల్సిన బాల్యం... ఆగమైపోతుంది.
తల్లిదండ్రుల పేదరికం ఒకవైపు...
నిరక్షరాస్యత మరోవైపు...
వెరసి
స్వేచ్ఛా విహంగంలో ఆనందాలను అనుభవించాల్సిన బాల్యం ..
బందీ గా మారింది.
చెడు స్నేహాలు, చిల్లర అలవాట్లకు బలై
బాల నేరస్థులుగా బ్రతుకీడుస్తున్నారు మరికొందరు....
అమాయకపు మాటలు నమ్మి .... కన్యత్వాన్ని తాకట్టుపెట్టి....
సెక్స్వర్కర్లుగా మారుతున్నారు ఇంకొందరు...
ఇలానే కొనసాగితే
పేదరికం వలన బాల కార్మిక వ్యవస్థ,
బాల కార్మిక వ్యవస్థ వలన నిరక్షరాస్యత,
నిరక్షరాస్యత వలన పేదరికం .... వెనకబాటుతనం.....
అన్నీ చక్రబంధమై పెరుగకమానదు....
మన భావిభారతం తరగక మానదు....
కలం పట్టాల్సిన చేయి కత్తి పట్టొద్దు..
బడికి వెళ్ళాల్సిన బాల్యం బలైపోవద్దు...
ఆటపాటలతో పెరగాల్సిన పిల్లలు
పనులకు పోవద్దు...
అమ్మ ఆలన... అయ్య పాలన తెలియని పసిమొగ్గలు వీరు...
కంప్యూటర్ ఆటలు... హైటెక్ చదువులు తెలియని పేదరికం వీరిది...
చట్టాలు ఎన్నున్నా....
వీరిని మాత్రం అపలేకపోతున్నాయి...
అలోచించండి ఆదుకోండి ...
బాల్యాన్ని రక్షించండి...

No comments:

Post a Comment