Friday, January 1, 2016

మళ్లీ వచ్చింది మరొ ఏడాది

మళ్లీ వచ్చింది మరో ఏడాది

అగో... మళ్ళొచ్చింది మరో ఏడాది...
సంబరాలు చేసుకుంటున్నారు... మా వూరి జనం...
రావుగారబ్బాయి.. పదివేల టపాకాయలు తెచ్చాడు..
సుబ్బిగాడేమో.... ఐదువేలుపెట్టి మందు పార్టి ఇస్తుండు....
మల్లిగాడు మటన్ తస్తా అన్నాడు....
ఇంకేముంది... పోయినేడాది లెక్కనే ఈ ఏడాది కూడా ఫుల్లు ఏర్పాట్లు....
తాగినోడికి తాగినంత... తిన్నోడికి తిన్నంత...
తెల్లారే... పొద్దుగూకె...రోజట్లాగే...
తెల్లారితే దిగినాక తెలిసింది...
చేసిన ఖర్చు.... తెచ్చిన అప్పు....
మారింది పది రూపాయల క్యాలెండరే...
అదీ ఓ సంవత్సరం మారిందంతే...
కాని
అప్పుల తిప్పలు, ఆలి అలకలు, ఇంటి మరకలు, ఉద్యోగ బాద్యతలు, పిల్లల ఫీజులు, పాలోడి బిల్లు,  నల్లా బిల్లు, పేపర్ బిల్లు, కిరాణ బిల్లు, నెట్ బిల్లు, కేబుల్ బిల్లు, ఇ ఎమ్ ఐ లు, అన్నీ అలాగానే ఉన్నాయి... ఎందులో ఏవీ మారలే....
మరెందుకు నిన్న అంత ఖర్చు చేసా అని అప్పుడాలోచిస్తున్నారు మనోళ్ళు....
ఈ పైసలైనా ఉంటే ఏదో ఓ అప్పు తీరేదిగా అని....
ఇలా ఏడాదికోమారు క్యాలెండరు మారుతునేఉంటది.... మన బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మాదిర.... అక్కడే ఉంటది....
అందుకే క్యాలెండర్ లో గీతలు మారినంత మాత్రాన తల రాతలు మారుతాయనుకుంటే అది మన పిచ్చే...
అందుకె పోయేదాన్ని సాగనంపుదాము...వచ్చేదాన్ని అహ్వానిద్దాం...
అందుకు రూపాయి ఖర్చు లేదు....ఏమంటారు....

No comments:

Post a Comment