Thursday, July 21, 2016

లేడీ కండక్టర్


లేడీ కండక్టర్

బతకలేక బడిపంతులు అన్నారు నాడు...
ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు .
కానీ నేడు...
లేడీ కంటక్టర్ల పరిస్థితి మాత్రం అదేఅని చెప్పాలి...
సిటీ బస్సుల్లో 
కుప్పలు తెప్పలుగా జనాలెక్కే బస్సులో.... 
ఆ కొన నుండి ఈ కొనకు రావాలంటే...
మగవాళ్ళకే చాలా కష్టం....
దిగాల్సిన వారు...
ఓ స్టేజీ ముందేలేచి రావాల్సి ఉంటుంది...
కానీ అంతమంది జనాలలో....
స్టేజి స్టేజికి... అటు ఇటు....తిరిగేస్తూ.....
ఎన్ని తిప్పలో పడుతుంది...లేడీ కండక్టర్....
ఎందుకంటే....
అడుగుతీస్తే అడుగువేయలేని పరిస్థితి ....
అందులో మగాళ్ళలో 
రకరకాల మాగరాయుళ్ళు ఉంటారు.... 
ఒకడు తాగి బస్సెక్కి.... తందనాలాడుతాడు.... 
నోటి కొచ్చినట్టు వాగుతాడు....
వాడిని తిట్టినా తిట్టకున్నా ఒక్కటే...
ఇంకోకడు ఆడోళ్ళను చూస్తే సొల్లు కార్చే రకం...
కావాలని వారినీ అడ్డగిస్తూ....  ఇబ్బందికి గురిచేస్తాడు.....
మరొకడు పోకిరీ....
అమ్మాయిలను ఏడిపించడమే వీడికి సరదా.....
చిల్లర లేదంటూ పెద్ద నోటిచ్చి.... బాదపెడుతాడు.....
చెమట కంపుతో ఒకడు... సెంటు కంపుతో ఇంకొకడు...
పానేసి ఒకడు... సిగరెట్లు తాగి మరొకడు...
ఇలా ఒకటా రెండా.... ఒక్కట్రిప్పులో....
నరకం చవి చూస్తున్నారు... లేడీ కండక్టర్లు....
దీనికితోడు.... ట్రాఫిక్ ఇక్కట్లు....
కదలాల్సిన సమయానికి బస్సు కదిలినా....
చేరాల్సిన సమయానికి గమ్యం చేరదు....
దీంతో గంటల తరబడి ఆలస్యం....
రాత్రివేళలో ఇంటికి చేరుకోవడం చాలా కష్టం....
ఇక కొంతమంది డ్రైవర్లు చేసే పరాచకాలు...
పై అధికారుల వేదింపులు...
కాదంటే ఎక్కడో ఇరికించడాలు...
తప్పని డ్యూటీలు.... కాదంటే వేట్లు....
ఇంట్లో చెప్పుకోలేక.... ఎవ్వరినీ ఎమీ అనలేక.....
లౌఖ్యంతో... నేర్పుతో వృత్తిలో రాణిస్తూ....
నవ్వుతూ డ్యూటీలు చేస్తూ.... 
అందరికీ ఆదర్శంగా ఉంటున్న
లేడీ కండక్టర్ల కనిపించని వెతలు....
అందుకే.... ఆ
మెకు మనవంతు సహాయసహకారాలు అందిద్దాం....
మన తల్లిగానో.... చెల్లిగానో భావిద్దాం....

(ప్రత్యక్షంగా చూసి కొన్ని... తెలుసుకొని రాసిన భావ కవిత)
మీ
గోగులపాటి కృష్ణమోహన్
9700007653

3 comments:

  1. గురూజీ చాలా బావుంది.నిజమే ,ఎన్ని బాధలో పాపం.బాగా గమనించి రాశారు.మంచి సామాజికసమస్య

    ReplyDelete
  2. పట్నపు బస్సు ప్రయాణమ్ముజూడు
    పడుచు కంండక్టరమ్మ పాట్లుజూడు
    ముసలోడు ముట్టుకొను పడుసోడు పట్టుకొను
    పెసరు వారి మాట పెరుగు సద్ది మూట!

    ReplyDelete