Monday, July 11, 2016

కవుల వనం

సహస్ర కవులకు వందనం....

మేక రవీంద్రుని కవన వనం లో కవికుసుమాలు ఎన్నో... ఎన్నెన్నో.
సుకవి గుండు మధుసూదనుడు...
ఆరేకాలాలు చదివిన అంజన్న...
వేలపద్యాల వీరుడు వీరన్న....
పద్య, వచన కవన దిట్ట అవేరా....
కళాధరుడు మన కళాచంద్రన్న...
రసిక రచనా శర్మలు అరాశ, మాడుగుల...
అందె వేసిన చేయి మద్దా వారు....
భావజాలాలున్న దండ్రె రాజమౌళి...
వాస్తు తెలిసిన పెద్దన్న లచ్చిరెడ్డన్న...
పచ్చి నిజములు చెప్పె పెసరు లింగన్న...
రోజుముచ్చట్లతో దేశపతి కృష్ణన్న...
పద్య కవితలందు అడుగులే వేసాడు
నాదు పేరు ఉన్న పూదత్తు కృష్ణన్న
పెద్దవారు మనకు కంది, పిన్నక గార్లు....
మన్నెవీరుడు కడబాల నాగన్న....
అయ్యవారి మురళి అరుదైన పద్యాలు....
మజ్జూరికేశవులు, పుల్ల రామాంజులు....
వృక్షప్రేమికుండు పార్ధసారధి గారు...
అశువులలో దిట్ట అంబటి భానుడు....
సాహితిసవ్వడి చేయు సంటి అనిలు....
ఎన్వీఎన్ చార్యులు,బొడ్డు శంకరన్న....
సిస్ట్లా శర్మ, శేశుకుమారులు,
చేకూరి, పోకూరి క్రొవ్విడి కవనాలు...
విశాక వీరుడు గధాధరుడు
కవిరాజులెందరో కవనకుసుమాలు...

అమ్మ ఉమాదేవి అందెవేసిన చేయి...
మన్నె లలితమ్మ మేరు కవితల్...
బిరుదుల మారాణి మల్లీశ్వరమ్మ...
కవన గానములుజేయు ఇందిరమ్మ....
అబినందనలు తెలుపె చామర్తి అరుణమ్మ...
కవితకు దాసోహమౌ దాసోజు పద్మమ్మ....
కంటకవుల ఇంపు పుష్ప జగన్నాధ్ లు...
ధడధడ లాడించు ధరణి, సందితలు....
చక్కటి కవనాల విజయ వినీలమ్మ...
అందరిని మెచ్చేటి అనురాధ శివపురపు....
కవన వనములోన కవయిత్రి లెందరో

ఒక్కరా ఇద్దరా వేలవులకిది...
వేదికై నిలిచింది కవిత యజ్ఙం...
కవన సుగంధాలు వెదజల్లుచుండగా....
వేదికై నిలిచింది ప్రయుత యజ్ఙం....

అందరికి వందనాలతో....
మీ సహస్రకవిమిత్ర
గోగులపాటి కృష్ణమోహన్

(ఎవరినైనా మరిచియుంటే మన్నించి గుర్తుచేయండి)

9 comments:

  1. 🌹ప్రయుతకవితాయజ్ఞం🌹
    SK2020 క.సం.187
    ఉ|
    చక్కనిసంప్రదాయముల
    సంస్కృతులన్ దెలియంగజేయగా
    మక్కువమీరమెచ్చుకొనఁ
    మంచికవిత్వములెక్కడున్న!తాన్
    మిక్కిలిపాండితీవిభవ
    మేర్పడసత్కవి!గర్వదూరుడౌ
    నొక్కడెకానవచ్చుకనుంగొనఁగోగులకృష్ణమోహనే!
    🌹సందిత బెంగుళూరు🌹

    ReplyDelete
  2. కవన 🌸మోహనుడు (కృష్ణన్న )కు కవితా🔴జలి 🙏🏼బెంగుళూరు పద్య *భారతి* సందిత గారికి
    సవినయతో మనస్కారములు
    🌴〰🌴➖🌴〰🌴
    *దేశపతి*👏🏼👏🏼

    ReplyDelete
  3. మనసు దోచిన posting

    వీరా గుడిపల్లి

    ReplyDelete
  4. 🌺💐👏👍👌🌹✋🌷✅ఉన్నదున్నదున్నట్టు చెప్పేటి కృష్ణన్నా..,వందనాలు.!!
    పెసరు లింగారెడ్డి

    ReplyDelete
  5. 🌺🙏 🌺
    🌸🌸🌸🌼🌸🌸🌸

    *******అంబటి భానుప్రకాశ్.***********
    🔹🔹🔹🔹🔹🔹🔹🔹

    తే**

    తలపు గలిగిన చాలును తరలు నెపుడు
    తప్ప కుండగ పనులను తాను జేసి
    మెప్పు నొందెడి మిత్రుల మేటి యితడె
    "కృష్ణ మోహన"మిత్రుండు గలడు మాకు.

    ************************************
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    అంబటి భానుప్రకాశ్.
    🍀🍀🍀🍀🍀🍀🍀🍀

    ReplyDelete
  6. కృష్ణ. మోహను ప్రేమతో కీర్తి పెంచె
    తృష్ణ. సాహిత్య. గోష్ఠితో తెలుగు రచన
    విష్ణు. నామమ్ము స్తోత్రమై వెలిగె కవిత
    అందరిమనసులకుతృప్తి అందె నిపుడు
    మాడుగుల. నారాయణ. మూర్తి

    ReplyDelete
  7. కృష్ణ. మోహను ప్రేమతో కీర్తి పెంచె
    తృష్ణ. సాహిత్య. గోష్ఠితో తెలుగు రచన
    విష్ణు. నామమ్ము స్తోత్రమై వెలిగె కవిత
    అందరిమనసులకుతృప్తి అందె నిపుడు
    మాడుగుల. నారాయణ. మూర్తి

    ReplyDelete
  8. 🌺🙏 🌺
    🌸🌸🌸🌼🌸🌸🌸

    *******అంబటి భానుప్రకాశ్.***********
    🔹🔹🔹🔹🔹🔹🔹🔹

    తే**

    తలపు గలిగిన చాలును తరలు నెపుడు
    తప్ప కుండగ పనులను తాను జేసి
    మెప్పు నొందెడి మిత్రుల మేటి యితడె
    "కృష్ణ మోహన"మిత్రుండు గలడు మాకు.

    ************************************
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    అంబటి భానుప్రకాశ్.
    🍀🍀🍀🍀🍀🍀🍀🍀

    ReplyDelete
  9. 🌺💐👏👍👌🌹✋🌷✅ఉన్నదున్నదున్నట్టు చెప్పేటి కృష్ణన్నా..,వందనాలు.!!
    పెసరు లింగారెడ్డి

    ReplyDelete