Monday, April 11, 2016

మళ్లీ వచ్చింది మరో ఉగాది


గోగులపాటి కృష్ణమోహన్
08-04-2016


మళ్లీ వచ్చింది మరో ఉగాది

కొత్త ఆశలతో... క్రొంగొత్త ఆశయాలతో....
తెచ్చింది తెచ్చింది మరెన్నో ఆశలకు, ఆశయాలకు కొత్త పునాది..
ఉగాదులు మారుతున్న ప్రతిసారీ....
ఆకులు రాలుతున్నాయి...
కొత్తగా చిగురిస్తున్నాయి.... కానీ
ఎండిపోయిన జీవితాలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు.
సగటు పేద, మద్యతరగతుల జీవితాలలో మాత్రం  కొత్త చిగురు ఊసే లేదు....
నెలాఖరు రాగానే.... మొదలవుతుంది నెలజీతగాని జీవితం....
పాలవాన్ని చూస్తే భయం,
పేపరోన్ని చూస్తే భయం...
చిట్టీలోన్ని, కొట్టోన్ని, అప్పులోన్ని,...
పిల్లల చదువులు, పెద్దల మందులు...
పండుగలు, పబ్బాలు...
పెళ్ళీలు, పేరంటాళ్ళు....
చావులు, తద్దినాలు.....
బట్టలు, బంగారాలు....
ఇలా ..... అన్నీ ఖర్చులే....

ప్రతి ఉగాది నాడు ఆదాయ వ్యయాలకు, రాజ పూజ్యాలు చూసుకొని మురవడమే తప్ప....
అసలుకు పోలిక ఉండదు....
ఈ ఏడాదైనా ఉంటుందనే ఆశతో
మరో ఉగాదికి ఆశతో స్వాగతం పలుకుతూ..... గోగులపాటి కృష్ణమోహన్

No comments:

Post a Comment