Saturday, February 6, 2016

పూరణాలు - అభివర్ణనలు

పూరణాలు - అభివర్ణనలు
గోగులపాటి కృష్ణమోహన్ 

ఆవె
నీర నుండు చేప నేలకు చేరెనా
తీరమందుసేదతీర్చుకొనగ
మీన వేషమెంతొముద్దుగాయుండెనో
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

కోమటింటఁ దెగెను కుక్కుటములునెల్ల
కోసుకోనితినరుదాసుకొనగ
కోమటయ్యదాన్ని అమ్మిలాభపడెగా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల


కత్తి వదలి వచ్చెఁ గదనమునకు
సమస్యా పూరణము

యుద్దమందుచూసె రక్తపాతములను
కత్తి వదలి వచ్చెఁ గదనమునకు
వైరులంతగూడ ఔరాయనుచువెళ్ళె
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల



ఆడువారికెన్ని ఆభరణములున్న
పట్టుచీరలెన్నొ కట్టుకున్న
కొప్పు లోన పూలు గొప్పగా యుండుగా
జ్యోతి నవ్య కృష్ణుఁ జూడు మఖిల

కోతి వచ్చె కొట్టు కొట్టేయ కదలము
దానికొరకెయాడునాటకాలు
వానరానికేమివార్తలతోపని
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల






2 comments:

  1. మా...మార్గదర్శి ...
    స్నేహశీలి...
    మృదు స్వభావి...అయిన..
    మా..GKM...SIR..కు
    హృదయ పూర్వక...

    అభినందనల మందారమాలలు

    🙏🌹🙏🌹🙏🌹🙏

    భ్రమరాంభ
    తిరుపతి

    ReplyDelete
  2. మా...మార్గదర్శి ...
    స్నేహశీలి...
    మృదు స్వభావి...అయిన..
    మా..GKM...SIR..కు
    హృదయ పూర్వక...

    అభినందనల మందారమాలలు

    🙏🌹🙏🌹🙏🌹🙏

    భ్రమరాంభ
    తిరుపతి

    ReplyDelete