Thursday, December 29, 2016

అవేరా తో గోగులపాటి కృష్ణమోహన్ ముఖాముఖి

*4. 'సహస్రకవి పరిచయాలు కార్యక్రమానికి'*
స్వాగతం

నేటి అథితి

 *'సహస్ర కవిరత్న, సహస్రవాణి శతపద్య కంఠీరవ sk101 అనుసూరి వెంకటేశ్వరరావు  గారిని* ఈ సారి పరిచయం చేయబడును. 

పరిచయం చేయువారు  *'సహస్ర  ప్రయోక్త 3' సహస్ర కవిరత్న, సహస్రవాణి శతపద్య కంఠీరవ sk326 గోగులపాటి క్రిష్ణమోహన్ గారు* 

ఈ పరిచయ కార్యక్రమం పూర్తిగా వాట్సప్ ను వేదికగా చేసి నిర్వహింబడును. మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
అందరకి నమస్కారం 🌺🙏🏽🌺
నేను మీకు పరిచయం చేస్తున్న కవి ఇందుగలడందులేడన్న సందేహం లేకుండా.... ఎందెందైనా కవితలు/పద్యాలు రాయగల సమర్ధుడు....

ఆట వెలది తోటి ఆటలాడేవేర
తేటగీతితోటి తేనె లొలికె
కందమందు తాను ఘనుడాయె మెండుగా?
జ్యోతి నవ్య కృష్ణ జుడుఁ మఖిల

ఆటవెలదితోటి ఆటలే ఆడావు
రెండు శతకములను నిండు జేసి
ఏవిరావుగారు అందుకో వందనం
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

ఇంకా చెప్పాలంటే ఇతను ఏ అంశాన్నీ వదిలిపెట్టడు... వస్తువు దొరకడమే ఆలస్యం.... కవిత అలా దావానలంలా వచ్చేస్తుంది.... అతనే మనమందరం ప్రేమగా ఏవీరావనీ.... అవేరన్నా అని పిలుచుకునే అనుసూరి వెంకటేశ్వరరావు గారు.

*గోగులపాటి క్రిష్ణమోహన్*

నమస్కారం అవేరా అనిపిలుచుకునే అనుసూరి వేంకటేశ్వర రావు గారూ

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నమస్కారం! గోగులపాటి కృష్ణమోహన్ గారూ!
నా పరిచయ కార్యక్రమానికి సహస్రప్రయోక్త గా
వ్యవహరిస్తున్నందుకు అభినందనలు...ధన్యవాదములు!

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ముందుగా మా సహస్రకవులకు మీ పరిచయం తరలియజేస్తారా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా పరిచయం సంక్షిప్తంగా....

సహస్రకవి  నం:101 
వృత్తి: సూపరింటెండెంట్ ఇంజనీరు (SE)
నీటిపారుదలశాఖ 
ప్రభుత్వ సర్వీసు:30 సం పైన
విధులు:కాల్వల నిర్మాణము, నిర్వహణ,
రిజర్వాయర్ల నిర్మాణము,నిర్వహణ,ఆఫీసు పరిపాలన
పుట్టిన ఊరు: ఖమ్మం 
పుట్టిన తేదీ 03/11/1961
తండ్రి:వెంకట రావు. Retdడిప్యూటీసూపరింటెండెంట్ పోలీస్(DSP)
తల్లి: సూర్యాకాంతం (గృహిణి)
భార్య: సూర్యవరలక్ష్మి 
పిల్లలు :ముగ్గురు
స్థిరనివాసము: హైదరాబాదు  
విద్యార్హత :బి.టెక్(సివిల్)జె.యన్.టి.యూ
సాహిత్య సేవ: 
ఇంటర్మీడియేట్ లో AIR యువవాణిలో "చైతన్య బాట"  కవిత 
కాలేజిలో వ్యాసరచనలో అన్నిపోటీలలో మొదటి బహుమతులు (సాహిత్యం పట్ల అభిరుచి పెరగటానికి స్ఫూర్తి)....మా గురువుగారు ఆచార్య తిరుమల గారి ద్వారా.
1990 -91లో ఆంధ్రభూమి వారపత్రికలో కవర్ పేజీ కామెంట్లకు చాలా వారాలు బహుమతి అందుకున్నా
(ఉద్యోగ భాద్యతల వల్ల రచనా వ్యాసంగానికి సాహిత్య సేవకు చాలాకాలం దూరమయ్యాను)
2010లో తెలుగు పీపుల్.కామ్ లో పబ్లిష్అయిన కొన్ని కవితలు
2015లో తెలుగు వేదిక.నెట్ లో పబ్లిష్ అయిన కవితలు
మరియు "గ్లోబల్ వార్మింగ్"వ్యాసము
అక్టోబరు 2015 అక్టోబరు15న  సహస్ర కవిగా చేరిక
సహస్ర కవిగా మొత్తం 900పైగా 450 వచన మరియు 450పైగా  పద్య కవితలు (నాలుగు చందస్సులతో)
ఆటవెలదులతో శతకము "జీవన సత్యాలు"
మరియు  కంద పద్యాల శతకము
కథలు...5(స్వచ్ఛపల్లె కథ తెలుగువేదికలో ప్రచురించబడినది)
నానీలు:30
పాటలు:15
అవేరా వ్యంగోక్తులు(జోక్స్)--12

మొత్తం:950 పైగా వివిధసాహితీ ప్రక్రియలు

తెలుగువేదిక.నెట్ ఇ మాగజైన్ సంపాదక సభ్యుడు

కలం పేరు: అవేరా
స్వంత బ్లాగ్(బ్లాగ్ చేసిచ్చినవారు కవిమిత్రులు గోగులపాటి కృష్ణమోహన్ గారు)
http://avraokavitalu.blogspot.in/?m=1
క్రీడారంగం:1.ఆల్ ఇండియా నేషనల్ లెవెల్ ఇంటర్ యూనివర్సిటీచదరంగం పోటీలలో జె.ఎన్.టి.యు(JNTU)కు ప్రాతినిధ్యము
అభిరుచులు:పుస్తకపఠనం,తెలుగు పద్య,వచన కవితలు ,వ్యాసాలు కథలు,పాటలు
ఆంగ్లకవితలు చదువుట ,వ్రాయుట
తెలిసిన భాషలు:తెలుగు ఆంగ్లం హిందీ

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీరు మొదటిసారిగా కవిత ఎప్పుడు రాసారు.... ఏ సందర్భం... మీ హృదయాన్ని కదిలింపజేసిందో తెలియ జేయగలరా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా మొదటి కవిత "ప్రగతిబాట" 
ఒక రోజు మా గురువు గారు ఆచార్యతిరుమల గారు
(ఇంటర్ లో) తెలుగు క్లాస్ పూర్తయ్యాక రేడియో కార్యక్రమం కోసం ఎవరైనా కవితలు పాటలు వ్రాసి లేదా పాడ గలిగిన వారు పేర్లు ఇవ్వండి రాసి రేపు ఇవ్వండి
అన్నారు..
అప్పుడే నాకు కవిత రాయాలనిపించింది
"ప్రగతిబాట"(యువతకు సందేశంతో) కవిత రాసి వివిధభారతి యువవాణి 
కార్యక్రమంలో చదివి వినిపించాను 1978లో.

కృష్ణమోహన్ గారూ
నేను 2015 లో నా చిరకాల మిత్రుడు B.Tech సహచరుడు మేక రవీంద్ర గారు కవుల గ్రూపు మొదలుపెడుతున్నాను  అన్నప్పుడు సాహిత్యం పై అభిలాష  తెలుగు భాషపై అభిమానం నన్ను సహస్ర కవుల గ్రూపులో చేర్పించాయి.
కానీ గ్రూపులోని సహచర కవుల కవితలు చూసి
స్పందనలను చూసి నాలోని కవి నిద్ర లేచాడనిపిస్తుంది
ఈరోజు నేను ఇన్ని కవితలు కథలు పాటలు పద్యాలు
వ్యాసాలు వ్రాసానంటే...ఆ ఘనత రవీంద్రగారికి
నన్ను అనుక్షణం భుజం తట్టి ప్రోత్సహించిన తోటి కవి మిత్రులు ఇందిర గారూ, వీరారెడ్డి గారూ,బండకాడి అంజయ్యగౌడ్ గారూ,విజయదుర్గ గారూ, అరాశగారు,
రామబుద్ధుడుగారూ,రాజావాసిరెడ్డిమల్లీశ్వరిగారూ,అంబటిభానుప్రకాష్ గారు,సీవి కుమార్ గారూ,కడబాల నాగేశ్వరరావుగారు,పిన్నకనాగేశ్వరరావుగారు,మన్నెలలితగారు,శ్రీదేవిరాపూర్ గారు,గుండు మధుసూధన్ గారూ మద్దా  సత్యనారాయణగారూ తరుణ్ గారు అరుణచామర్తిగారు, ఇంకా ఎందరో  సహస్రకవులది (స్థలాభావం వల్ల అందరిపేర్లూ రాయలేకపోతున్నా)
అందరికీ పేరుపేరున ధన్యవాదాలు .
అద్భుతస్పందనలతో నాలోస్ఫూర్తినింపి సాహిత్యాన్ని 
చదువుకుందామని సహస్రకవిగా చేరిన నన్ను సాహితీవేత్తగా, సహస్రకవిరత్నగా నిలిపిన ప్రతి కవిమిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా....
ప్రత్యేకించి మేకరవీంద్ర గారికి
నా కవితలకు అప్పుడప్పుడూ
మార్గదర్శిగా నిలిచిప్రోత్సహించిన మల్లేల విజయలక్ష్మిగారికీ....
నాకు పద్యరచనలో చందస్సు నేర్పి పద్యరచనలో
గురుతరభాద్యతను నిర్వహించి నా కవితలు సమాజానికి చేరేలా బ్లాగ్ ని ఏర్పరచిన మీకు నా
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా....

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఇప్పటివరకు మీరు ఎన్ని వచన/భావ కవితలు రాసారు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
సహస్ర కవిగా మొత్తం 900పైగా 450 వచన మరియు 450పైగా  పద్య కవితలు (నాలుగు చందస్సులతో)
ఆటవెలదులతో శతకము "జీవన సత్యాలు"
మరియు  కంద పద్యాల శతకము
కథలు...5(స్వచ్ఛపల్లె కథ తెలుగువేదికలో ప్రచురించబడినది)
నానీలు:30
పాటలు:15
అవేరా వ్యంగోక్తులు(జోక్స్)--12
మొత్తంగా 950 పైగా సాహితీ ప్రక్రియలు రాసాను

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీరు కొన్ని పాటలు కూడా రాసినట్టున్నారు కదా.... ఎందుకు మీకు పాటలు రాయాలనిపించింది?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
మొదట నాకు కవితలకంటే పాటలు రాయలన్న అభిలాష ఎక్కువగా వుండేది ఎందుకంటే ఈ రోజుల్లో
కవితలు చదివే పాఠకులకన్నా పాటలు వినే శ్రోతలు ఎక్కువ....జనంలోకి పాట త్వరగా చేరుతుంది.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
సినీమాల్లో రాయాలని కోరిక ఏమైనా ఉందా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా స్వీయ రచనలో ఆడియో లేదా వీడియో ఆల్బం చెయ్యాలనుకునే వాడిని.
అవకాశం వస్తే సినిమాలకు పాటలు రాయాలని వుంది.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీకు పద్యరచన చేయాలనే కోరిక ఎందుకు వచ్చింది?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
ఆరోజుల్లో అంబటి భానుగారు ,మీరు ,గుండు మధుసూధన్ గారు పద్యాలు రాయటం చూసి నాకూ రాయాలనిపించింది మీ దగ్గరే చందస్సు నోట్స్ తీసుకుని సులభంగా రాయగలిగే ఆటవెలదితో మొదలుపెట్టి కందంలోకి దూకాను.....అందుకే మీకు ప్రత్యేకధన్యవాదాలు తెలిపాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఇప్పటివరకూ ఎన్ని పద్యాలు రాశారు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
ఇప్పటివరకూ 450 పైగా పద్యాలు రాసాను నాలుగు చందస్సులలో

*గోగులపాటి క్రిష్ణమోహన్*
పద్య కవిత్వానికీ వచన/భావ కవిత్వానికి మధ్య తేడా ఏముంది? ఎందులో కవి తన భావాన్ని సులభంగా వ్యక్తపరచగలడు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
పద్యమైనా వచనమైనా కవిత్వానికి భావమే ప్రాణము.
తన భావాన్ని కవి పద్యంలో అయినా వచనంలో అయినా పాఠకుల హృదయాన్ని తాకేలా చెప్పవచ్చును
కానీ పద్యాలకంటే కూడా వచనంలో ఎక్కువమంది పాఠకులను చేరే అవకాశం వుంది ఎందుకంటే
పద్యపాఠకులకంటే వచనపాఠకుల సంఖ్య నిస్సందేహంగా అధికం.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
అటు ఇంజనీరుగా బిజీఉంటూ... కవనాలు రాయడానికి మీకు సమయం సరిపోతుందా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా ఉద్యోగ బాధ్యతలకు రోజూ 12 గంటల నుండి 14 గంటల సమయం పడుతుంది...సమస్యలు చాలా వున్నాయి.అయితే సహస్రకవి మిత్రులను మిస్ చేసుకోలేక రోజూ వీలయినప్పుడు ప్రయుతలో సహస్రవాణిలో పద్యాల సవ్వడిలో కవితలనాస్వాదించి స్పందించి నా కవితలను పోస్ట్ చేస్తున్నాను. కవితలు పద్యాలు రాసే సమయం చిక్కుటలేదు అందుకే నేను యు ఎస్ఏ లో రాసినంతగా కవితలు రాయలేక పోతున్నాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీ కవితలు / పద్యాలను సంపుటి రూపంలో వెలువరించే అవకాశం ఏమైనా ఉందా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అవకాశం వుంది... అది నా కల

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీ అభిరుచులు వివరిస్తారా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అభిరుచులు:స్నేహం,పుస్తకపఠనం,తెలుగు పద్య,వచన కవితలు ,వ్యాసాలు కథలు,పాటలు
ఆంగ్లకవితలు చదువుట ,వ్రాయుట
తెలిసిన భాషలు:తెలుగు ఆంగ్లం హిందీ
ఆటలు:చెస్ లో జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాను
క్రికెట్ క్రీడాకారుణ్ణికూడా
క్రికెట్ హాకీ టెన్నీస్ బాడ్మింటన్ ఇష్టపడతాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
తెలుగుకవిమిత్రుల
మోదాస్పదపదంగా
స్ఫూర్తిప్రదంగా మార్చుకున్న 
కవి అవేరా గారి  
కవితాభావాల
మేర  
ఆరా  
లోకమేరా సోదరా!!

అణువంతైనచీమ నోరే యైనా
విశ్వమంతా విహరిస్తున్న
కొత్తపోకిరీ పోకేమ్యానైనా
ఆయనకలపుటలం"కారపు"
విమర్శలసంకెళ్ళలంకెల్లోంచి
తప్పించుకోవటం అసాధ్యమే

చచ్చిపోతున్నపిచ్చుకల
ఆర్తనాదాల్ని 
అందుకుంటుందాయన కలంపౌనఃపున్యం
గుండెలోతుల్లోకాదు
*ఆత్మాంతరాధ్వనితాక్రోశాల్ని*
ఆకళింపుచేసుకుంటుందాయన
దృఙ్మానసనేత్రం
సమకాలీననైనందుకు గర్విస్తున్నా!!

🌹సందిత  బెంగుళూరు🌹

దీనిపై మీ అభిప్రాయం...


*అనుసూరి వేంకటేశ్వరరావు*
సంధిత చెల్లెమ్మ నాకందించిన ప్రశంసను మీరు భద్రపరచటం మీ సహృదయతకు నిదర్శనం 
నేనుకూడా భద్రపరచుకున్నాను....నిజంగా చిన్న వయసులోనే అద్భుత విద్వత్ కలిగిన రేపటి అద్భుత 
కవయిత్రిలు మనలో వున్నారు...సంధిత మరియు ధరణి అని నా అంచనా....ఇదే వేగంతో ఇద్దరూ అప్రతిహతంగా ముందుకుపోవాలని ఆశీర్వదిస్తున్నాను
నా కవితలకు స్పందించి నన్ను ప్రోత్సహిస్తున్న ఇద్దరికీ
కృతజ్ఞతలు 
అయితే సంధిత గారు చెప్పినట్టు కవి  దృష్టికి అడ్డు
అంతూ వుండదు పిపీలికమైనా పిచ్చుకైనా వానపాము అయినా కొత్తపోకడలపోకేమాన్అయినా సెల్ఫీలయినా
సమాజంలోని మంచినైనా చెడునైనా ప్రకృతినైనా
అందమైన ఆకృతినైనా అందమైన మనోభావాలనయినా అధ్యాత్మికమైనా...కవితకు కాదేదీ అనర్హం......శ్రీశ్రీ గారు  కుక్కపిల్ల అగ్గిపుల్ల ఇంకా ఏవైతే కవితకనర్హం కాదని  చెప్పారో....అన్నింటి పైనా నేను కవితలు రాసాను... నఖం పైన రాసినా మకం పైనరాసినా ముఖంపైన రాసినా సుఖంపైనరాసినా 
 దేనిమీదరాసినా కవి అక్షరసందేశం ఇవ్వాలి
సమాజంలో చెడును కుళ్ళును టార్గెట్ చెయ్యాలి
మంచి సందేశాన్ని జతచెయ్యాలి....ఒకోసారి 
కవిత ధార కోసం సందేశం సాద్యంకాదు
అలాంటప్పుడు సందేశాన్ని మరోకవితలో చెప్పవచ్చు


*గోగులపాటి క్రిష్ణమోహన్*
కవనరంగంలో మీ భవిష్యత్తు ప్రణాలికలేమైనా ఉన్నాయా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నేను ప్రొఫెషనల్ కవిని కాదు
భాషపై అభిమానంతో రాసుకుంటూ పోతున్నానుఅయినప్పటికీ 
ప్రణాలికలు వున్నాయి..
నా  రచనలన్నింటికి పుస్తక రూపం ఇవ్వాలి
పద్యరచనలో మళ్ళీ వేగం పెంచాలి
కనీసం ఐదుశతకాలను తెలుగు సాహిత్యానికి అందించాలనుకుంటున్నాను కష్టమే ఐనా
చిత్రరంగానికి పాటలు కథలు అందించాలనుకుంటున్నా
ప్రణాళికల వత్తిడిలో మాత్రం కవితలు రాయను.
2017 లో మొదటివిడతగా 3లేదా 4 పుస్తకాలను
ప్రచురించాలనుకుంటున్నా...


*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఇక మన సహస్రకవుల కుటుంబసభ్యునిగా మీ అనుభూతులు మాతో పంచుకుంటారా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
మన  సహస్రకవుల కుటుంబసభ్యునిగా నేనుపొందిన అనుభూతిని ఇంతకుముందే తెలియజేశాను...కవిగా
నా విజయాలన్నింటికి నా సహ సహస్రకవిమిత్రుల ప్రోత్సాహమే స్ఫూర్తి...అందరికీ కృతజ్ఞతలు.


*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీకు ఈ రంగంలో స్పూర్తి ఎవరు? ఎవరు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
తెలుగు భాషకు నేనుసైతం అక్షరయజ్ఞం చేయలన్న ఆశయమే నా స్ఫూర్తి .చరిత్రలో మనమద్యలో ఎందరో మహాకవులున్నారు..ఒకరి స్ఫూర్తితో గీతగీసుకోలేను అంతటి పెద్దలపేర్లను స్ఫూర్తిగా
చెప్పటానికి ధైర్యం చాలదు నాకు....

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఎవరి సాహిత్యాన్ని మీరు ఎక్కువగా ఇష్టపడుతారు?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అధునిక కవుల సాహిత్యాన్ని ఇష్టపడతాను
చలంగారు శ్రీశ్రీ గారు దాశరథిగారూ కృష్ణశాస్త్రి గారూ
వేటూరిగారూ సినారె గారూ సిరివెన్నెల గారూ సుద్దాలగారూ గోరెటివెంకన్నగారూ.....ఎవరి శైలివారిది
నవలలు మాత్రం యండమూరిగారిశైలి నచ్చుతుంది
ఇంకాచాలామందివున్నారు...సినిమాబాగుంటే
ఏమీచూడకూడదు సినిమానేచూడాలి
కవిత్వం బాగుంటే కవిత్వాన్నే ఆస్వాదించాలి
ఎవరురాసారో అన్నది ఆస్వాదించాక తెలుసుకోవాలి.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఇక కవిగా మీరు సాధించిన అవార్డులు/పురస్కారాల గురించి వివరించండి.

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నేను మొదటగా మన సహస్రకవుల నిర్వాహకులు
తెలుగుకవితావైభవంఅద్యక్షులు మేకరవీంద్రగారి 
ద్వారా "సహస్రకవిమిత్ర"సహస్రకవిరత్న"బిరుదులు
పొందటం జరిగింది ఆతరువాత "గురజాడఫౌండేషన్
పురస్కారం"పొందటం జరిగింది.తెలుగురక్షణవేదిక
"బతుకమ్మ పురస్కారం"తో సన్మానించారు.
అన్నింటినీ మించిన సన్మానం,పురస్కారం "మీ అందరి అభిమానం పొందటం"

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మొత్తంగా మీ కవిప్రయాణం ఏ విధంగా సాగుతుంది?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
ఇప్పటి వరకూ నా కవిప్రయాణం బాగానేసాగింది ప్రస్తుతం సమయాభావం వత్తిడిలో నలిగిపోతున్నా
ఇప్పుడేనాఅసలుప్రయాణంమొదలవుతుందనిపిస్తుంది
ఈ  సంవత్సరం కొత్తమలుపులుంటాయేమో ప్రయాణంలో.


*గోగులపాటి క్రిష్ణమోహన్*
సహస్రకవి కి ముందు తరువాత తేడా ఏమైనా ఉందా?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
వుంది...సహస్రకవికి ముందు కలంతో కాగితంపైన రాసుకున్నా
సహస్రకవినైనాక కీబోర్డుతో సెల్ లో రాస్తున్నా.

సహస్రకవికిముందు కుందేలంత వుండేది  సహస్రకవినైనాక ఆత్మవిశ్వాసం కొండంతైంది.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
తెలుగుబాష బతుకాలంటే మీరిచ్చే సూచనలు సలహాలు ఏంటి?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
పాఠశాలలో బాలలకు తెలుగుపై మక్కువ పెంచాలి
పాఠ్యపుస్తకాలతో పాటు బొమ్మల తో తెలుగు కథలు
చక్కని తెలుగుపాటలు నేర్పాలి అక్షరాలను పదాలను
చదవటం చదివించటం సరిపోదు వల్లెవేయించాలి
చక్కటి ఉచ్ఛారణనేర్పాలి సాధారణంగా సైన్స్ మాథ్స్
పట్లఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అదిసరికాదు భాషా విషయాలకు కూడా శ్రద్ధ కనపరచాలి
పైవిధంగా చేయలేకపోవటం చేత నేడు మన చుట్టూ
చదువుకున్న పిల్లలు తెలుగును ధారాళంగా చదువలేకున్నారు.
గ్రంధాలయాలు పునరుద్ధరింపబడాలి 
పుస్తకపఠనం హాబీగా మారాలి యువతలో
సెల్ఫోను వాడకం లాభంలేనిచాటింగులు తగ్గించుకోవాలి నేటి యువత ఆసమయాన్ని
తెలుగుపుస్తకాలు చదవటానికి ఉపయోగించుకోవచ్చు
తెలుగు కవులకు ప్రభుత్వాలు సమాజం మంచిగుర్తింపును హోదాను ప్రకటించాలి
మీడియాద్వారా తెలుగు భాషోద్దరణకు పూనుకోవాలి.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
రేపటి తరం తెలుగుసాహిత్యాభిలాషులు కావాలంటే ఏంచేయాలి? యువకవులకు మీరిచ్చే సలహా సూచనలేంటి?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
యువతరంలో తెలుగు సాహిత్యాభిలాష పెరగాలంటే
ఇందాక నేను చెప్పినట్లు బాల్యదశలోనే భాషపట్ల మక్కువ కలిగేలా శిక్షణనివ్వాలి
యువకవులకు సూచనలు:
1.మీకుతోచిందిరాయండి
2.మీకునచ్చినట్లు రాయండి
3.అవగాహన లేకుంటే ఆత్మవిశ్వాసం లేదు
4.ఆత్మవిశ్వాసంలేని రాత గ్రహణకాలంలోని సూర్యుడిలా వెలుగునివ్వలేదు
5ఆత్మవిశ్వాసం కలగాలంటే రాసే విషయాన్ని పరిశీలించండి పరిశోధించండి లోతుల్లోకి వెళ్ళండి
6.అనుకరించకండి అనుసరించకండి
7.మీదైనశైలిలోరాయండి
8.మంచి పుస్తకాలను చదవండి విశ్లేషించండి
9.పద్యం వచనం రెండూ రాయండి పద్యధార 
వచనంలో వచన బాష(సరళం)పద్యంలోకి వస్తే
ప్రజలు పద్యాలను కూడా ఇష్టంగా చదువుతారు
10.మంచిపుస్తకాలను కవితలను ఒకటికి రెండుసార్లు 
చదవండి కొంతమందికవులు లోతైన అర్థాలతోరాస్తారు
అవికూడా అర్థంఅవుతాయి.

ఇవేయువకవులకు నా 10కమాండ్ మెంట్స్.

నేటి సమాజంలో వస్త్రాపహరణంలో ద్రౌపదిలాఎన్నో సమస్యలు అర్తనాధంచేస్తున్నాయ్ మానాభిమానాలు కాపాడమని వాటికి అందించే చీరెలా కవి కవిత వుండాలి
నేటిసమాజం గజేంద్రమోక్షంలో గజేంద్రునిలా చెడుఅనే మొసలి నోటచిక్కి విలవిలలాడుతుంది ఈసమాజాన్ని కాపాడే సుదర్శనం కావాలి కవి కవిత
కవి సమాజాన్ని సంస్కరించాలి సంరక్షంచాలి చెడునిశిక్షించాలి అని చెప్పటమే నా ఉద్దేశ్యం

*గోగులపాటి క్రిష్ణమోహన్*
సహస్రకవులతో మీ అభిప్రాయం పంచుకునేముందు అయిత/ప్రయిత కవితా యజ్ఙం పై మీ అభిప్రాయం?

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అయుతలో కవితల టార్గెట్ల కోసం సమయం కేటాయించి కవితలు రాసారందరూ 
యజ్ఞంలో అందరూ పాల్గొని విజయవంతంచేశారు
నా కవితలకు కూడా అయుతకవితాయజ్ఞం స్ఫూర్తిని నింపింది....మంచి ప్రయత్నం రవీంద్రగారికి అభినందనలు
ప్రయుతకు తేదీ డెడ్లైన్ లేనట్లుంది అందుకే కొందరుకవులు కవితలుపద్యాలు పోస్ట్ చెయ్యట్లేదు
వచనాలలో లక్ష్మణ్ రావు గారు విజయదుర్గ(వినీల)
నేను దండ్రెరాజమౌళిగారు మాత్రమే పోస్ట్ చేస్తున్నాము
అలాగే పద్యాలు కూడా కొందరు కవులు మాత్రమే పోస్ట్ చేస్తున్నారు.రవీంద్రగారు ప్రయుతకు బూస్టింగ్ డోస్ ఇవ్వవలసియున్నదనిపిస్తుంది...
ఏదేమైనా కవితా యజ్ఞాలు అద్భుతఫలితాలనూ ఫలాలనూ అందించాయి..ముఖ్యంగా ఎందరో కవులను సహస్ర కవుల గ్రూపులో చేర్చి తెలుగుభాషాభివృద్ధికి తోడ్పడ్డాయి.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
ధన్యవాదాలు అవేరా గారూ....
మీ అమూల్యమైన సమయాన్ని మా సహస్రకవులకోసం వెచ్చించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు.

*అనుసూరి వేంకటేశ్వరరావు*
అది నా భాగ్యంగా భావిస్తున్నాను.

*గోగులపాటి క్రిష్ణమోహన్*
మీ లాంటి బహుముఖ ప్రజ్ఙాశాలిని నా సహస్రకవిమిత్రులకు పరిచయం చేసే భాగ్యం కలిగించిన సమూహ సూత్రధారి శ్రీ మేకరవీంద్ర గారికి, మీకు మరియు మన పరిచయాన్ని శ్రద్దగా ఆసక్తితో చదివిన మన కవిమిత్రులందరికి నా హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేస్తూ.... సెలవు తీసుకుంటున్నాను....

*అనుసూరి వేంకటేశ్వరరావు*
నా ఆశలకు మీ ఆశయానికి 
ఆచదువుల తల్లి ఆశీస్సులుండాలని ప్రార్థిస్తూ....
ఈకార్యక్రమ రూపశిల్పి మేకరవీంద్ర గారికీ ధన్యవాదాలు....అలాగే
మీ విలువైన సమయం నాతో పంచుకున్నందుకు
ధన్యవాదాలు...నా పరిచయ కార్యక్రమాన్ని
తమ విలువైన సమయం కేటాయించి చదివిన మన కవిమిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు🙏🙏


*గోగులపాటి క్రిష్ణమోహన్*
ఈ సందర్భంగా మీరు కవనరంగంలో మరెన్నో విజయాలను సాధించి అత్యున్నత శిఖరాలను అఅధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు 
🌺🙏🏽🌺

*అనుసూరి వేంకటేశ్వరరావు*
ధన్యవాదాలు

ఇట్లు
*మేక రవీంద్ర*
సహస్ర కవిరత్న అనుసూరి వేంకటేశ్వరరావు పరిచయం కార్యక్రమంలో పాల్గొని చాలా వివరాలు తెలిపినందుకు

సహస్ర ప్రయోక్త,  సహస్ర కవిరత్న Sk326 గోగులపాటి క్రిష్ణమోహన్ గారికి చక్కటి ప్రశ్నలను వేసి ఈ పరిచయకార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు.

ఈ పరిచయాన్ని పూర్తిగా చదివిన వారందరికి
ధన్యవాదాలు

😊 🙏🏼🙏🏼
*మేక రవీంద్ర*

Friday, December 2, 2016

నీకేం తెలుసు?

గోగులపాటి కృష్ణమోహన్
స. క. సంఖ్య 326

నీకేం తెలుసు?

నీకేం తెలుసు? కష్టం.... నష్టం అంటే?
కష్టపడ్డవాడిని... నష్టపోయినవాడిని
అడుగు ....
కష్టనష్టాలు అంటే ఏంటో చెబుతాడు....

నీకేం తెలుసు? కష్టం అంటే?
నిలువెత్తు గొయ్యలో.... మొరంగడ్డను గడ్డపారతో పెకిలిస్తూ... పారతో తట్టనిండానింపి... రెండుచేతులతో నిటారుగా పైకిలేపి గడ్డమీద పోసే దినసరి కూలీని అడుగు....
కష్టం అంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు? నష్టం అంటే ?
వ్యయసాయంకోసం అప్పులు తెచ్చి ఆరుగాలం కష్టపడ్డా.... చేతికొచ్చిన పంట ఇంటికి రాని రైతన్నను అడుగు....
నష్టమంటే ఏంటో చెబుతాడు....

నీకేం తెలుసు? బరువుమోసేవాడిబాదేంటో?
గోదాముల్లో వందకిలోల సంచిని బుజంపై పెట్టుకొని లారీల్లో లోడుచేసే హమాలీని అడుగు....
బరువుమోస్తే బాదేంటో చెబుతాడు....

నీకేం తెలుసు?
బక్కచిక్కిన ప్రాణంతో బతుకుబండి ఈడ్చడానికి రిక్షానిండాబరువేసుకొని తోసుకుంటూ గడ్డెక్కించే రిక్షావాడిని అడుగు....
కష్టం అంటే ఏంటో చెబుతాడు....

నీకేం తెలుసు?
దినసరి అప్పులుదెచ్చి రోజువారి దందాచేసుకుంటూ.... రాత్రివరకూ సరుకులు అమ్ముడుకాకుండా... అప్పులోడికి అసలు కూడా కట్టలేని అబాగ్యున్ని అడుగు....
నష్టమంటే ఏంటో చెబుతాడు....

నీకేం తెలుసు?
రైల్వే స్టేషన్లో.... బస్సు స్టేషన్లలో నెత్తిమీద స్థాయికి మించి బరువులు పెట్టుకొని మెట్లెక్కే కూలీలను అడుగు.....
బరువంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు?
మనం అసహ్యించుకునే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో తలలోతు మునిగి మురుగుకాలువలను శుబ్రం చేసే పనివాడినడుగు....
కష్టం అంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు?
ఆస్తులమ్ముకొని వ్యాపారం చేసి....
ఆగమై అడుక్కుతింటున్న అమాయకుణ్ణి అడుగు...
నష్టమంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు? బతుకు భారమంటే...
ఒంటి జీతంతో జీవితం నడుపుతూ...
తల్లిదండ్రులకు వైద్యఖర్చులు...
పిల్లలకు ఫీజులు.... ఆడపిల్లలకు అల్లుళ్ళకు మర్యాదలు చేస్తూ అప్పుల ఊబీలో పడుతున్న మద్యతరగతి వాడినడుగు....
బతుకు బారమంటే ఏంటో చెబుతాడు...

నీకేం తెలుసు?
గరీబోడి కష్టం.... అమీరోనికి....

నీకేం తెలుసు?
గుడిసెవాడి కష్టం.... బంగులోడికి

నీకేం తెలుసు?
బాలకార్మికుని బాధ....

నీకేం తెలుసు?
అర్ధాకలితో అలమటిస్తున్నవాడి బాధ...

నీకేం తెలుసు?
బిడ్డలకోసం కన్నతల్లి పడే వేదన

నీకేం తెలుసు?
నీ కోసం నీ అంతరాత్మ పడే ఆవేదన....

నీకేం తెలుసు....?
నీకేం తెలుసు...?

కష్ట నష్టాలనే ఇష్టాలుగా....
బరువులు భారాలనే భాద్యతలుగా....
అలవాటు చేసుకొని....
హాయిగా జీవిస్తున్న...
అభాగ్యుల జీవితాల గాధలు....
నీకేం తెలుసు?.... నీకేం తెలుసు?


మీ

(సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న, శతపధ్యకంఠీరవ, తెలుగు రక్షణవేదిక జాతీయ బతుకమ్మ పురస్కార గ్రహీత...)

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
9700007653
సూరారం కాలని, హైదరాబాదు.

Sunday, November 6, 2016

అవసరం...

గోగులపాటి కృష్ణమోహన్

శీర్షిక: అవసరం...

అవసరం...
మనిషిని దిగదారుస్తుంది.
అవసరం...
వసుదేవున్నే గాడదికాళ్ళు పట్టించింది.
అవసరం...
ఆస్తులు అమ్మిస్తుంది.
అవసరం...
మనిషిని ఎక్కడికో నడిపిస్తుంది.
అవసరం...
మనిషిని చేయరాని పనులు చేయిస్తుంది.
అవసరం...
అడ్డదారులు తొక్కిస్తుంది.
అవసరం...
నిజాయతీ పరున్ని అబద్దాలు ఆడిస్తుంది.
అవసరం...
అడ్డమైన చాకిరీ చేయిస్తుంది.
అవసరం...
ఎవరెన్ని మాటలన్నా పడమంటుంది.
అవసరం...
నేరాలు చేయిస్తుంది.
అవసరం...
అమాయకుణ్ణి హంతకుడిగా మారుస్తుంది.
అవసరం...
అభిమానాన్ని చంపేస్తుంది.
అవసరం...
అన్యాయాన్ని ఎదిరిస్తుంది.
అవసరం...
అందలం ఎక్కిస్తుంది.
అవసరం...
మనిషిని అప్పుల పాలుజేస్తుంది.
అవసరం...
మనిషికి ప్రాణాంతకమై కూర్చుంటుంది.
అవసరం...
తనవారిని దూరం చేస్తుంది.
అవసరం...
అవతలివాడి అవసరాలను తీరుస్తుంది.


మీ
సహస్రకవిమిత్ర
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్‌ జర్నలిస్టు.
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653

Tuesday, November 1, 2016

నా నానోలు... నా ఇష్టం..... గోగులపాటి కృష్ణమోహన్

నానోలు

నా
నానోలు
నా
యిష్టం.... గోగులపాటి కృష్ణమోహన్

1)
విఘ్నాలు
తొలగించ
విఘ్నేషుని
పూజించు

2)
మాతృమూర్తి
మాతృభూమి
మాతృభాష
చాలాగొప్పవి

3)
చెబితే
విననివాడు
చెడిపోక
మానడు

4)
వైఫ్
లేకున్నా...
వైఫై
ఉంటేచాలు

5)
తినకముందు
ఫలం
తిన్నాక
మలం

6)
వ్యక్తుల
కన్నా
వస్తువులే
మిన్ననేడు

7)
పదవున్నప్పుడే
పదివెనుకేసుకో
పదవిపోయాక
పనుండదునీతో

8)
ఇళ్ళుకట్టిచూడు
పెళ్ళిజేసిచూడు
జూదమాడిచూడు
అప్పుచేయకుండ

9)
సముద్రమైనా
ఈదవచ్చట
సంసారం
కష్టమట

10)
నవ్వు
యోగమట
నవ్వకపోవడం
రోగమట

11)
బార్యను
ఒప్పించైనా
అమ్మను
ప్రేమించు

12)
ధనము
కన్నా
తెలివి
మిన్న

13)
ఎవరినీ
అతిగా
నమ్మి
మోసపోకు

14)
ప్రేమించు
జయించు
విజయం
సాధించు

15)
ఇళ్ళు
ఇల్లాలు
ఇతరులతో
పోల్చొద్దు

16)
సుఖం
సంతోషం
ఒకటి
కాదు

17)
సుఖం
శారీరకం
సంతోషం
మానసికం

18)
కష్టపడగా
వచ్చింది
కడదాకా
ఉంటుంది

19)
ఇష్టమైన
పని
కష్ట
మవ్వదు

20)
మద్యం
సేవించి
వాహనం
నడపకు

21)
శృంగారం
గదిలో
అనురాగం
ఎదలో

22)
ప్రేమకు
హద్దు
పెళ్లి
ముద్దు

23)
కోపాలు
వద్దు
ప్రేమలే
ముద్దు

24)
సరిహద్దున
శబ్ధం
సైనికునికి
అలారం

25)
ప్రేమలూ
ఆప్యాయతలూ
అనురాగాలే
కుటుంబం

26)
గతం
వర్తమానం
భవిష్యత్తు
జీవితం

27)
వేషం
నటన
వాస్తవం
జీవితం

28)
అప్పు
ఇవ్వకు
అరువు
అడుగకు

29)
నుదుట
సింధూరం
స్త్రీకి
సింగారం

30)
చేనుకు
చెదలు
రైతుకు
దిగులు

అయ్యప్ప భక్తులకు
31)
మాల
ధారణ
మహిమ
అధ్భుతం

32)
మండల
దీక్ష
స్వామి
నియమం

33)
ఏక
భుక్తం
ఒంటికి
మంచిది

34)
పాద
రక్షలు
లేకే
పయనం

35)
భూతల
శయనం
శీతల
స్నానం

36)
మద్యం
మగువ
మాంసం
దూరం

37)
అందరి
లోను
స్వామి
దర్శనం

38)
మహిళలు
అంతా
మాతృ
సమానం

39)
పంపా
స్నానం
పరమ
పవిత్రం

40)
ఇరుముడి
అర్పణ
దీక్ష
విరమణ

బతుకమ్మ పురస్కారం




జాతీయ తెలుగు కవుల సమ్మేళనం లో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ కు బతుకమ్మ పురస్కారం


 "సహస్రకవిమిత్ర" గోగులపాటి కృష్ణమోహన్ తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో  నిర్వహించిన "జాతీయ తెలుగు కవుల సమ్మేళనం" లో పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం తెలిపే కవిత చదివి బతుకమ్మ కవితోత్సవం మరియు పురస్కారాన్ని అందుకున్నారు.

అక్టోబర్ 23, 2016 ఆదివారం నాడు కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ భవన్ లో
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో  "జాతీయ తెలుగు కవుల సమ్మేళనం" జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జరిగిన ఈ జాతీయ తెలుగు కవి సమ్మేళనంలో దేశం నలుమూలల నుండి నవ,యువ,మహా కవులు రచయితలు పెద్దసంఖ్యలో పాల్గొని  బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపేలా, మన  సంస్కృతి సంప్రదాయాల గురించి మరియు తెలుగు భాష, యాస, వ్యవహారికాలకు సంబంధించిన కవితలు, గేయాలు, జానపదాలు తదితర రచనలను కవులు తమ కవనాల ద్వారా తెలియజేశారు.

ఈ సంధర్భంగా పాల్గొన్న కవులందరిని నిర్వాహకులు శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ సమాజంలో అన్ని అంశాలపై స్పందించే వారు కవులని, నేటి తరం కూడా సాహిత్యం పై మక్కువ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ,    తెలుగు రక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొడ్డు మహేందర్,  పలువురు కవులు పాల్గొన్నారు.



Sunday, October 30, 2016

ఓ యువతా మేలుకో



గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.

శీర్షిక : యువత - భవిత

ఓయువతా మేలుకో
నీ భవిత తెలుసుకో.... (2)

మన తండ్రులు, మన తాతలు
ప్రాణాలకు తెగించారు.... (2)
పోరాటం  చేశారు..
స్వాతంత్ర్యం తెచ్చారు.... ఓ యువతాII

తెల్లదొరలు వెళ్ళినారు...
నల్ల దొరలు వచ్చినారు...(2)
రాజులంత సచ్చినారు...
రౌడీలు బతికినారు.... ఓ యువతాII

బూములు ఖబ్జాలు జేస్తు
భవంతులే నిర్మిస్తూ... (2)
పేదొడి పొట్టగొట్టి
పొలిమెర దాటిస్తుండ్రు... ఓ యువతాIl

కాంట్రాక్టుల పేరుతోటి
కోట్లు కొల్లగొడుతుండ్రు... (2)
నాణ్యతలే లేకుండా
కట్టడాలు కడుతుండ్రు.... ఓ యువతll

కల్తీ సొమ్ములు జేస్తూ
ఖార్ఖానాల్ నడుపుతుండ్రు (2)
కల్తీ నోట్లు అమ్ముతు
కోట్లకు పడిగెడుతుండ్రు.... ఓ యువతll

యువత నేడు నిద్దురతొ
మొద్దుబారి పోయింది... (2)
సోపతి ఎక్కువయ్యింది
సోమరిలా అయ్యింది.... ఓ యువతాll

మద్యమంటు... మగువంటూ
మానవత్వమే మరిచి... (2)
పబ్బులెంట, పార్కులెంట
పరుగెడుతూ వెలుతుంది... ఓ యువతll

రాజకీయ రాక్షసేమో
జనులపీక కోస్తుంటే... (2)
పదవీ వ్యామోహాలు..
పట్టపగలె దోచుకుంటే... ఓ యువతాll

నీ తండ్రుల, నీతాతల
పౌరుషాన్ని దెచ్చుకోరా.. (2)
అన్యాయం ఎదురించు
అక్రమాన్ని తరిమికొట్టు... ఓ యువతll

కల్తీలను నివారించు
నిజాయితీ నిలబెట్టు.. (2)
ఖబ్జాలను కాపాడు...
పేదోడికి అండగుండు... ఓ యువతll

అమరుల ఆశయాలు
నెరవేర్చే వీరుడవై...(2)
వీర జవానులకు నీవు
వారసుడవై నిలిచిపో... ఓ యువతాll

ఓ యువతా మేలుకో
నీ భవిత మార్చుకో...(2)
నీ భాద్యత తెలుసుకో...
భాద్యతెరిగి మలుసుకో.... ఓ యువతll

యువతకు అంకితమిస్తూ....

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
9700007653

Tuesday, October 25, 2016

నెట్టమ్మా... నెట్టమ్మా...


గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు

శీర్షిక : నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా....


నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా మమ్మువిడిచి పోవమ్నా...

నువ్వుంటే మా వారు కంప్యూటర్ వదలరు
నువ్వుంటే మా పిల్లలు ల్యాప్టాప్ వదలరు.
నువ్వుంటే జనమంతా సెల్లు లోనె సొల్లంతా...
నువ్వుంటే నేనుకూడా ఇల్లుమరిచి పోతుంటా...

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా మమ్మువిడిచి పోవమ్నా...

ఫేసుబుక్కు తెరుచుకుంటు....
లైకులెన్నొ చూసుకుంటూ....
వాట్సప్పు ను చూసుకొంటు...
పోస్టులన్ని చదువుకుంటూ...
ఐ ఎం ఓ, స్కైప్‌లతో....
వీడియోలు మాట్లాడుతు...
పనిపాట వదులుకుంటు...
రోజంతా గడుపుడాయె...

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా  మమ్మువిడిచి పోవమ్నా...

మిస్సైన సీరియల్లు....
కావాల్సిన వంటవార్పు....
పాతకొత్త సినిమాలు...
పనికిరాని ప్రోగ్రాంలు ...
చదువు సంద్య పాఠాలు....
సంగీత, నాట్యాలు..
యూ ట్యూబులొ చూసుకుంటు...
రోజంతా గడుపుడాయె...

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా  మమ్మువిడిచి పోవమ్నా...

ఇంటికొచ్చినోళ్ళంతా బాగోగులు మరిచిండ్రు...
రాగానే వైఫైది పాసువర్డు అడుగుతుండ్రు...
ఇంట్లోనే అందరున్న ఆదమరిచి ఉంటుండ్రు
నెట్టు ఆన్ చేసుకొంటు సెల్లుతోనె గడుపుతుండ్రు...

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా  మమ్మువిడిచి పోవమ్నా...

ఒక్కరోజు లేకుంటే....
అందరు కలిసుంటారు...
మనసువిప్పి ఒకరినొకరు
మాట్లాడుకుంటారు...
ఇంటిలోన బాదలను
అడిగితెలుసు కుంటారు
ఇంటిల్లిపాదంతా...
హాయిగా గడుపుతారు....

నెట్టమ్మా.. నెట్టమ్మా... నెట్టమ్మా.... నెట్టమ్మా....
ఒక్కరోజు లేకుండా  మమ్మువిడిచి పోవమ్నా...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653

Thursday, September 22, 2016

వీర జవానుకు జోహార్లు


వీరజవాన్...జై జవాన్

రాక్షసులు ఎలా ఉంటారంటే...
ఇదిగో ఇలా ఉంటారని చూపించు....
దుర్మార్గులు ఎవరని అడిగితే...
ఇదిగో వీరే అని చూపించు....
పిరికిపందలకు ఉదాహరణగా...
ఈ పందులను చూపించు....
ఇంతకు ఎవరిని చూపించేది....
ఇంకెవరిని....
నిద్రాణం లో ఉన్న వీర జవాన్లను.....
అమానుషంగా రాత్రివేళలో...
బలి తీసుకున్న పాకిస్తాన్‌ రాబందులను....
ఎదురుగా వచ్చి ఢీకొనే దైర్యం లేని ...
పిరికి పందులు (పందలు) వీరు....
దేశరక్షణ కోసం విధుల్లో చేరేటప్పుడే....
ప్రాణాలకు సైతం పోరాడుతామని చేరుతారు...
కానీ ఇలా పడుకున్న సమయంలోప్రాణాలు కోల్పోయినందుకేబాధ.
ఎందుకంటే
బతికుండగా జరిగుంటే....
కనీసం ఒక్కో సైనికుడు వందమందినైనా బలితీసుకొని అమరుడయ్యేవాడు....
అందుకే వారి ఆత్మలు కూడా శాంతించడం లేదనుకుంటాను....
అమ్మనాన్నలనువదిలి
ఆలిబిడ్డలను వదిలి....
ఊరువాడనొదిలి...
ఉన్నవారినొదిలి.....
బంధుమిత్రుల నంత....
బారంగవదిలేసి....
దేశరక్షణకొరకు దీక్ష పట్టి....
సరిహద్దులో మనవాడు...
నిద్రాహారాలు లేకుండ...
పండుగ పబ్బాలు లేకుండ....
పొద్దనక, పగలనక....
రాత్రనక, రప్పనక...
చెట్టనక, పుట్టనక....
ఎండనక, వాననక,
చలినిసైతం లెక్కచేయక....
విధులముందు... నిధులెంతని...
దేశరక్షణే ధ్యేయంగా....
తనవారికోసం....
తనువునే అణువుగా....
ప్రాణాలను ఫణంగాపెట్టే....
ఓ వీర సైనికులారా....
ఏమని చెప్పను మీ త్యాగం....
ఏలని తెలపను మీ ఫలితం....
అందుకోండి అందుకోండి....
పాదాభివందనం....
ఓ అమరులారా....
వీర జవానులారా....
అందుకోండి.... అందుకోండి...
జోహార్లు... మా జోహారులు...

గోగులపాటి కృష్ణమోహన్....

(దేశరక్షణకోసం పోరాడుతున్న...
పోరాటంలో వీరమరణం పొందిన
వీరజవానులకు అంకితం)

Tuesday, September 13, 2016

నేటి గణపతి

నేటి గణపతి

నేటి గణపతి.....


నాడు నలుగురిని ఎకం చేసేందుకు రోడెక్కాడు గణపతి...
కానీ నేడు అదికాస్తా....
వీదికో గణపతి,
వాడకో గణపతి,
కులానికో గణపతి,
పార్టీకో గణపతి,
పోటీగా గణపతి....
ఇలా ఎక్కడపడితే అక్కడ...
మండపాలు వెలుస్తున్నాయి...

భక్తితో కొందరు....
రక్తికోసం కొందరు....
పేరుకోసం కొందరు....
పరువుకోసం మరికొందరు....
ఓట్లకోసం కొందరు...
రాజకీయం కోసం ఇంకొందరు....
ఇలా గణేషుణ్ణి వీధిలో పెట్టి...
కొలుస్తున్నారు....

చెరువులో పూడిక మట్టితో చేయాల్సిన గణపతులు....
రకరకాల మిశ్రమాలతో   తయారవుతున్నాడు....

ప్రకృతి అందించిన రంగులను అద్దాల్సింది బదులు....
అడ్డమైన విషకాలుష్య రంగులను అద్దుతున్నారు....

వీటివలన వాయు కాలుష్యం,
జలకాలుష్యం....
అయినా పట్టదు ఎవరికీ....

ఇక మడపాలవద్ద....
భక్తిభావన కనిపించదు....
పాశ్చాత్య సంగీతం....
విచ్చలవిడి నృత్యాలు....
మధ్యం సేవించడం....
మగువలను ఏడిపించడాలు....

భక్తితోపాటు ఐఖమత్యాన్ని చాటే పండుగలివి...
అంతరించిపోతున్న దేశీయ కళలను కాపాడుకోవాలి ....
కనిపించకుండా పోతున్న సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలి...

అందుకే ఈ దేవీ... గణపతుల నవరాత్రులు...
అలాంటి పండుగలకోసం ఎదురుచూస్తున్నా....
మీ
గోగులపాటి కృష్ణమోహన్

Saturday, September 10, 2016

ప్రజాకవి కాళోజీకి అక్షర నీరాజనాలు

ప్రజాకవి కాళోజీకి అక్షర నీరాజనం


ఆడ యీడ యంటె యవమానపరిచిండ్రు
పుంటికూరయంటె పెదవివిరిసె
తెల్గుబాషయంటె తెలగాణ భాషరా
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

****************************

జోహారు జోహార్లు కాళోజి సారూ
***************************
నాభాషనుజూసి నలుగురు నవ్విండ్రు
నా యాసను జూసి నారాజు జేసిండ్రు
నా యాస బాసనే నక్షత్రమయ్యింది
నాబాషకూ యొక్క పండుగేవచ్చింది
కాళోజీ పుణ్యమా కదిలింది ప్రభుత
తెలగాణ భాషకు దినమునే ప్రకటించె
కాళోజీ సారుకూ నివాళి యర్పించె
జోహారు జోహార్లు కాళోజి సారూ
అందుకోండి ఈ కవి నీరాజనాలు
🌺🙏🏼🌺

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్‌ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.
9700007653

Sunday, September 4, 2016

వినాయకవ్రతం - పత్రిపూజ విశేషం

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. 1. మాచీ పత్రం/మాచ పత్రి, 2. దూర్వా పత్రం/గరిక, 3. అపామార్గ పత్రం/ఉత్తరేణి 4. బృహతీ పత్రం/ములక 5. దత్తూర పత్రం/ఉమ్మెత్త 6. తులసీ పత్రం/తులసి 7. బిల్వ పత్రం/మారేడు 8. బదరీ పత్రం/రేగు 9. చూత పత్రం/మామిడి 10. కరవీర పత్రం/గన్నేరు 11. మరువక పత్రం/ధవనం , మరువం 12. శమీ పత్రం/జమ్మి 13. విష్ణుక్రాంత పత్రం/ 14. సింధువార పత్రం/వావిలి 15. అశ్వత్థ పత్రం/రావి 16. దాడిమీ పత్రం/దానిమ్మ 17. జాజి పత్రం/జాజిమల్లి 18. అర్జున పత్రం/మద్ది 19.దేవదారు పత్రం 20. గండలీ పత్రం/లతాదూర్వా 21. అర్క పత్రం/జిల్లేడు

వాటి ఉపయోగాలు తెలుసుకుందాం

1. మాచీ పత్రం: 🌿

ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి 
ఈ ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర రోగాలు నయం అవుతాయి. అలాగే చర్మ వ్యాదులకి కూడా అద్భత మందుగా పనిచేస్తుంది. ఆ ఆకుల్ని పసుపు, నువ్వుల నూనెతో కలిపి ముద్దగా నూరి చర్మ వ్యాదులకి రోజూ పూస్తే తొందర్లోనే నయమవుతాయి. అలాగే రక్తపు వాంతులకు, ముక్కునుంచి రక్తం కారడం వంటివి కూడా అరికట్టవచ్చునట. దీనిద్వారా ఆస్తమా నియంత్రించబడుతుంది 🌿
  
  
2. బృహతీ పత్రం: 🌱
 ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి! బృహతీ పత్రాన్ని వాకుడాకు, నేలమునగాకు అంటారు. దీనిలోనూ ఎన్నో వ్యాధులను తగ్గించగల ఔషదీయ గుణాలున్నాయి, కంఠ రోగాలు, శరీర నొప్పులు, ఎక్కిళ్ళు, కఫ, వాత దోషాలు, అస్తమా, దగ్గు, సైనసైటిస్ తగ్గించడంలో, అరుగుదలకు, గుండె పనితీరు మెరుగుపరిచేందుకు, ఈ చూర్ణం దురదలు, నొప్పి నివారిణిగా, ఈ కషాయంతో నోటి దుర్వాసన, మరియు రక్త శుధ్ధి ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి 🌱
   
 3. బిల్వ పత్రం: 🍁
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి   బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. *మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి.
బిల్వపత్రం అనగా మారేడు. ఈ మారేడు వృక్షాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. *ఇది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన పత్రం. ఈ పత్రానికి నిర్మాల్య దోషం లేదు. *ఈ పత్రాన్ని ఆ పరమేశ్వరునికి సమర్పించిన రోజే కాక మరున్నాడు కుడా ఉపయోగించవచ్చు. ఆరోగ్యరీత్యా కూడా ఇది ఎంతోఉపయోగపడుతుంది.  మధుమేహం కలవారు రోజు రెండు ఆకులను నెమ్మదిగా నములుతూ ఆ రసాన్ని మింగితే  దివ్యౌషధంగా పనిచేస్తుంది 🍁


4. దూర్వ పత్రం: 🌾
'  ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం '  సమర్పయామి 
దూర్వాయుగ్మం అనగా గరిక. అనగా రెండు కొసలు కలిగిఉన్న జంటగరికను దూర్వాయుగ్మం అని అంటారు. గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఈ గరిక అతి ముఖ్యమైనది.ఒక్క గరికెపోచ సమర్పిస్తే మహాదానందపడిపోతాడు మహాగణపతి. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. హిస్టీరియా ఉన్నవారికి దివ్య ఔషధం ఈ గరిక. పైత్యపు తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ గరికను మెత్తగా రుబ్బి నుదిటిమీద లెపనమ్లా వేసుకొంటారు.గరికను పచ్చడిగా చేసుకొని తింటే మూత్రసంబందిత వ్యాధులు తగ్గుతాయి. రక్త, చర్మ సంబంధిత వ్యాధులను, ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. 


 5. దత్తుర పత్రం: ☘
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి   దత్తూర పత్రం ను మనం  ఉమ్మెత్త అని కూడా అంటూ ఉంటాము.. మానసిక వ్యాధిని నివారించాడంలోను, జ్వరాలు, చర్మరోగాలు, అల్సర్లు, చుండ్రు నివారణలోనూ దివ్యౌషధంగా పని చేస్తుంది. కీళ్ళ రోగాలను నయం చేస్తూ నరాలకు గట్టిదనాన్ని ఇస్తుంది ☘

   
6. బదరీ:  🍃
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి
 బదరీపత్రం అనగా రేగు ఆకు. ఈ చెట్టును సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని  స్వరూపంగా భావిస్తారు. సంక్రాంతి సందర్భంలో చిన్నపిల్లలకు పోసే భోగిపళ్ల కార్యక్రమంలో ఈ రేగుపళ్ళు అతి ముఖ్యమైనవి. జుట్టు ఆరోగ్యంగా పెరగటంలో రేగు ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.  🍃
   
7.  అపామార్గ పత్రం :  🍀
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి.
అపామార్గ పత్రం అనగా ఉత్తరేణి. దీని ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు నశించి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయానికి, పైల్స్ కు, వంతులకు మంచి ఔషదంగా పనిచేస్తాయి .దీని ఆకులు నూరి రసం గాయాలకు రాస్తే రక్తం కారడాన్ని అరికడుతుంది. యజ్ఞ యాగాలలో ఈ చెట్టు పుల్లలు  వేస్తారు దీని పొగ పీల్చడం వలన శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి..

8. తులసి: 🍃
ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి
విష్ణుమూర్తికి ప్రీతికరమైనది, శ్రీ మహా లక్ష్మీస్వరూపం.తులసి ఆకులు,కొమ్మలు, వేర్లు అన్నింటిలోను ఎన్నో ఔషధ గుణాలున్నాయి. చర్మరోగాలను నయం చేస్తుంది. రోజు తులసిఆకులు నమలడం వలన పంటి చిగుళ్ళకున్న  రోగాలు తగ్గి అరుగుదాలను, ఆకలిని పెంచుతాయి. తులసిరాసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవలన కఫం వలన వచ్చే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.  ఈమధ్య జగిన పరిశోధనలలో రోజుకు 22 గంటలు ప్రాణ వాయువు నిచ్చే చెట్టు తులసిమాత్రమే అని తేలింది.ఇంతగొప్ప లక్షణం మరే ఇతర మొక్కలకు లేదు. ఉత్తప్పుడు ఎప్పుడూ తులసితో గనేశుని పూజించరాదు. పురాణాల ఆధారంగా ఒక్క వినాయక చవితిరోజునే మనం తులసీదళాలతో ఆ స్వామిని పూజించాలి 🍃

9. మామిడి ఆకు: 🌿
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి.
చూతపత్రం అనగా మామిడి ఆకు.దీనిని దేవతా వృక్షం అనికూడా అంటారు.. లేత ఆకులను పెరుగుతో కలిపి మెత్తగా నూరి తింటే అతిసారం తగ్గుతుంది. మామిడి లేత చిగుళ్ళను తింటే చిగుళ్ళ వాపు సమస్య తగ్గుతుంది . మామిడి జిగురులో ఉప్పు వేసి వేడిచేసి కాళ్ళ పగుళ్ళకు, చర్మవ్యాధులకు  పూస్తే తగ్గుముఖం పడతాయి. చెట్టునుంచి కోసిన కొన్ని గంటల వరకు ప్రాణవాయువు ను విడుదలచేస్తాయి 🌿


10. గన్నేరు: 🍂
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి 

  కరవీరపత్రం అనగా గన్నేరు. ఏదైనా పువ్వులు కోస్తుంటే అవి క్రింద పడితే పూజకు పనికి రావు కాని గన్నేరు పువ్వులు కోసే సమయంలో క్రింద  పడితే పరవాలేదు వాటిపై నీళ్ళు చల్లి సమర్పించవచ్చు.గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా అది అనేక రోగాలు దూరం  చేస్తుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు గన్నేరుఆకులు కోసి పాలు కారడం తగ్గాక తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. 🍂

11. విష్ణుక్రాంత: 🍀 
ఓం భిన్నదంతాయ నమః  విష్ణుక్రాంత పత్రం పూజయామి
 ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది

12. దానిమ్మ:  🍁
 ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి

దానిమ్మ పత్రాన్ని దాడిమీ పత్రం అంటారుదానిమ్మ ఆకు తింటే చర్మం కాంతి వంతమవుతుంది.  దానిమ్మరసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు. కీటకాలు కుట్టడంవలన వచ్చిన దద్దుర్లూఅవి తగ్గుతాయి. దానిమ్మపండు ఆకలిని పెంచి అరుగుదలను ఇస్తుంది.విరోచనాలను తగ్గిస్తుంది.దీని ఆకులకు నూనె రాసి కల్లవాపులు  ఉన్నచోట కడితే తగ్గుతాయి. దానిమ్మ ఆకులు దంచి కషాయం చేసుకుని అందులో పంచదార తగినంత వేసి తాగితే దగ్గు, నీరసం,ఉబ్బసం,అజీర్తి వంటి రోగాలనుంది ఉపసమనం లభిస్తుంది. 



13. దేవదారు:  ☘
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి 
  దేవతలకు  అత్యంత ఇష్టమైన పత్రం దేవదారు.. పార్వతీ దేవికి అత్యంత ఇష్టమైనది. దీని మానుతో చెక్కే విగ్రహాలకు సహజత్వం వుంటుంది.ఆరోగ్యరీత్యా చూస్తే... ఇది అజీర్తి, చర్మసంబంధ వ్యాధులు తగ్గిస్తుంది.ఈ చెట్టు ఆకులను ఆరబెట్టి, ఆరిన ఆకులను కొబ్బరి నూనెలో వేసి కాచి చల్లార్చి ఆ నూనెను తలకి రాసుకుంటే మెదడు చల్లబడి కంటి సంబంధ రోగాలు దరిచేరవు. ఈ చెట్టు మానునుంచి తీసిన నూనె చుక్కలు వేడినీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి☘

14. మరువక పత్రం: 🌾
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి
మరువక పత్రం అనగా మరువము. దీనిని మనం ధవనము అని పిలుస్తుంటాము    ఇది మంచి సువాసన కలిగి వుంటుంది. మనం నిత్యం దీనిని పువ్వుల దండలలో వాడటం చూస్తాము.శరీరం దుర్వాసన వస్తుంటే వేడినీళ్ళలో మరువం వేసుకుని స్నానం చేస్తే ఆ దుర్వాసన తొలగిపోతుంది. 🌾

 15. సింధువార పత్రం: 🍁 
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
సింధువార పత్రం అనగా వావిలి ఆకు. వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు. దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు మరియు గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాల రసంలో *అల్లరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు. 🍁

16. జాజి పత్రం: 🌿
ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
ఇది జాజి అనే  మల్లిజాతి మొక్క. ఇది అన్ని చోట్లా దొరుకుతాయి. ఇందులో 
సన్నజాజి, విరజాజి రెండు రకాలు కలవు. వీటి పువ్వుల నుంచి సుగంధతైలం తీస్తారు.జాజి చర్మరోగాలనివారణకుమంచిదివ్యఔషదం.జాజిమొగ్గలతోనేత్రవ్యాదులునయంచేస్తారు. జాజి కషాయాన్ని 
రోజు తీసుకోవడంవలన క్యాన్సర్ నివారణ అవుతుందని చెపుతున్నారు. 🌿

 17. గండకీ పత్రం: ☘
ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి
గండకీపత్రం అనగా దేవకాంచనం. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ వ్యాధికి చక్కని ఔషధం ఈ గండకీ  పత్రం. దీని ఆకులు మొండి,దీర్ఘవ్యధులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. దగ్గు, జలుబులను తగ్గిస్తుంది.☘ 
   
18. శమీ పత్రం  : 🍂
ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి 
శమీపత్రం అనగా జమ్మి ఆకు. తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా లకు మందుగా పనిచేస్తుంది  🍃

 19. : అశ్వత్థ పత్రం  🍀
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి 
అశ్వత్థ పత్రం  అనగా రావిఆకు.  రావి  సాక్షాత్  శ్రీమహావిష్ణువు స్వరూపం. తులసిలేని ఇల్లు వేపలేని వీధి,రావిచెట్టులేని ఊరు ఉండదన్నది మన పెద్దల మాట. రావి ఆకులు హృదయసంబంధమైన రోగాలకు ఉపయోగిస్తారు.ఎండిన రావిపుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి దానిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాస సంబంధవ్యాదులు నివారణ అవుతాయి.జీర్ణశక్తిని జ్ఞాపకశక్తిని పెపోదించే గుణం గల ఆకులు రావిఆకులు. 🍀

 20. అర్జున పత్రం: ☘
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
అర్జున పత్రం అనగా తెల్లమద్ది.మద్ది చెట్టు హృదయసంబంధిత  రోగాలకు దివ్య ఔషదం.ఇది శరీరానికి చలువ చేస్తుంది. రక్తనాళాలను గట్టి పరుస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. ఈ అర్జునపత్ర బెరడు రుబ్బి ఎముకలు విరిగినచోట పెడితే తొందరగా నయం అవుతుంది. కీళ్ళనొప్పులు, మలాశయ దోషాల నివారణలో బాగా ఉపయోగపడుతుంది.🍀
.
21. అర్కపత్రం: 🌿
ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి.
ఆర్కపత్రం అనగా జిల్లేడు. ఈ చెట్టు  గణపతి స్వరూపం.రథసప్తమి రోజు జిల్లేడు పత్రాలు ధరించి నదీస్నానము చేస్తే చాలా పుణ్యమని హిందువుల నమ్మకం. పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెంపొందుతుంది.లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి.చర్మ సమస్యలను తగ్గిస్తుంది. శరీర సమస్యలకు ఉపయోగపదుతుంది. కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది. జిల్లెడుతో చేసిన నునె చేవుడుకు ఔషధం గా ఉపయోగపడుతుంది.ఇది రక్త శుద్ధిని చేస్తుంది. 🌿

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు