Monday, October 30, 2017

అమ్మలార.. అయ్యలార .. ఆలోచించండి జర



అమ్మలార అయ్యలార
ఆలోచించండి.. జర

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

అమ్మలార... అయ్యలార
ఆలోచించండి జర
మీ బిడ్డల భవిష్యత్తు
మీ చేతుల్లోనే ఉంది.
అనవసరపు ఆశలతో
ఆసక్తులు లేపకండి..
ఇరుగు పొరుగు పిల్లలతో
పోటీలు పెట్టకండి
ఇంజనీర్లు డాక్టర్లే
అవ్వాలని అనకండి
ర్యాంకులు రాలేదంటూ
రాద్దాంతం చేయకండి
లక్షల్లో పిల్లలుంటె
వేలల్లవకాశాలు
ఎంతచదివితేముంది
అందని ద్రాక్షనిపండ్లు
వారిలోని ఆసక్తిని
గ్రహించాలి మీరంతా
ఎందులొ నైపుణ్యముంటె
అందులోనే రాణించ
వారిలో ఉత్సాహాన్ని
నింపాలి మీరంతా
చదవలేక... చెప్పలేక
చచ్చిపోయె దానికన్న
బతికి సాదించండని
బాగుగా బతుకండని
మీ పిల్లలకు మీరె
భరోసా ఇవ్వండి
మీ పిల్లల్లోన మీరె
ధైర్యాన్ని నింపండి..‌
భావితరాలను మనం
బతికించుకోవాలి
బంగారు భవితను
వారికందించాలి


మీ
సహస్రకవిరత్న
కవి ప్రవీణ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు
9700007653

విద్యార్థుల ఆత్మహత్యలు ఆపండి



ఆత్మహత్యలు ఆపండి
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు

విద్యార్థుల ఆత్మహత్యలపై..
మానసిక వేదనతో 

తల్లడిల్లే పిల్లలారా
చదువుకొరకు చిదపకండి
మీ లేత జీవితం‌..
చదువన్నది ఒక్కటే
జీవితం కాదండీ.
చదువు లేని వారెందరో
బాగుపడ్డ వారున్నరు..
చదువన్నది ఒక్కటే
శాశ్వతం కాదండీ
చదువులేకున్న కూడ
శాశ్వతంగా బతకవచ్చు
చదువు కొరకు ప్రాణాలను
అర్పించే ముందు మీరు
మీ తల్లి తండ్రులను
గుర్తెరిగి మలుచుకోండి
చదువుకున్న వారికంటే
చదువు లేనివారెందరొ
తెలివిని ఉపయోగించి
ప్రయోజకులు అవుతున్నరు
ఇంజనీర్లు డాక్టర్లే
ఇంటింటికీ కావాలా?
ఇతరులు ఎవ్వరు మనకు
అవసరమే లేరా?.
చదువన్నది సంస్కారం
చదువన్నది మేదస్సు
చదువన్నది విజ్ఙానం
కా కూడదది అజ్ఙానం
చావకండి చావకండి
విద్యార్ధిని విద్యార్థులారా
సాధించే దేమిలేదు
సచ్చినాక మీరింకా
బతుకండి బతుకండి
నీవారికోసం... నీ ఊరికోసం
బతకండి బతకండి
బతికి సాదించండి

మీ
సహస్రకవిరత్న
ప్రతిలిపి-కవిప్రవీణ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు
9700007653

Monday, October 9, 2017

ప్రతిలిపి కవి ప్రవీణ


                                         ప్రతిలిపి కవి ప్రవీణ పురస్కారం అందుకున్న గోగులపాటి కృష్ణమోహన్






ప్రతిలిపి కవి ప్రవీణ పురస్కారం అందుకున్న గోగులపాటి కృష్ణమోహన్
------------------------------------------------------
కవి, సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ కు ప్రతిలిపి సంస్థ ప్రతిలిపి కవి ప్రవీణ, ప్రతిలిపి కథాభారతి బిరుదులను అందజేశారు
దేశంలోని వివిధ బాషలలో సాహిత్య సేవలందిస్తూ ఎంతో మందికవులకు సోషల్ మీడియా ద్వారా వేదికగా నిలిచిన ప్రతిలిపి సంస్థ తమ సంస్థతో అనుసంధానం అయిన కవులు/రచయుతల పట్టాభిషేకంలో బాగంగా విశేష ప్రతిభ కనబరిచి మరియు తెలుగు సాహిత్యానికి కృషి చేస్తున్నందుకు గాను విజయవాడలోని ఐ ఎమ్ ఏ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కవులకు పురస్కారాలను అందజేసింది.
ఇందులో బాగంగా 200 లకు పైగా పద్యాలు, కవితలు, కార్డు కతలు అందించిన గోగులపాటి కృష్ణమోహన్ సాహితీ సేవలను గుర్తించి ప్రతిలిపి కవిప్రవీణ, ప్రతిలిపి కథా భారతి అనే బిరులను ప్రధానంచేసింది.
ఇప్పటికే సహస్ర కవిరత్న, సహస్ర కవిమిత్ర బిరుదులు పొందడంతో పాటు రెండు రికార్డు కవిసమ్మేళనాలలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు గోగులపాటి కృష్ణమోహన్.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా, తెలుగు రక్షణ వేదక అద్యక్షులు పొట్లూరి హరికృష్ణ, దూరదర్శన్ వాఖ్యాత విజయదుర్గ, ఆం. ప్ర. మహిళా కమీషన్ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి, ప్రముఖ కవయిత్రి అత్తలూరి విజయలక్ష్మి, కళ్యాణ్ కృష్ణ కరణం, ప్రతిలిపి తెలుగువిభాగం ఇంచార్జ్ జానీ తక్కెడశిల, భువనవిజయం వ్యవస్థాపకులు వంకాయలపాటి చంద్రశేఖర్, చిత్రకారుడు కుంచె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Monday, September 25, 2017

సహస్ర సాహితీ కేంద్రం


సాహితీ కేంద్రం - మారేడుపల్లి, సికింద్రాబాద్.
తేది : 24-09-2017

సాహితీ కేంద్రం ప్రారంభం

సికింద్రాబాద్ లో సహస్రకవుల సృష్టికర్త తెలుగుభోజుడు శ్రీ మేకరవీంద్ర  ఆద్వర్యంలో భాగ్యనగర సహస్ర సాహితీ కేంద్రం మారేడుపల్లిలో ఆదివారం ప్రారంభమయ్యింది.

ఈ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్టు సహస్ర కవిరత్న గోగులపాటి కృష్ణమోహన్ జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ మేకరవీంద్ర గారు సహస్ర సాహితీ కేంద్రాల స్థాపిస్తూ భావితరాలకు సాహిత్యవిలువలు నేర్పడం, కవులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు.

సాహిత్య సేవా బంధు, తెలుగు భోజుడు మేక రవీంద్ర మాట్లాడుతూ భావితరాలకు కవిత్వాభిలాష పెంపొందించాలనే ఉద్దేశంతో సాహితీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వీటిని తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  గోగులపాటి కృష్ణ మోహన్, సహస్రకవులు వీరా గుడిపల్లి, పెసర రవీంద్ర రెడ్డి, సంతోష్ శర్మ, హన్మంత్ నాయక్, ఉదయ్, శిఖా గణేష్, మల్లావజ్జుల చంద్రశేకర్ శర్మ,గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ  కవయిత్రులు  సిహెచ్ పద్మ, ఈప్సిత తదితరులు పాల్గొని వారికవితలను చదివి వినిపించారు.











Wednesday, September 20, 2017

రాదారి సోగ్గాడు - అవేరా

రాదారి సోగ్గాడు సోకిల్లా తిరుగుతాడు
రేయిరేడు పగటి వెలుగై వెతుకుతాడు
రామరాజ్యమాఇది రాక్షస బోజ్యమని
కలమెత్తి గళమెత్తి అలసి సొలసి
చేరె రాదారి పక్కలో తేనీటి తోట
అతగాడి ప్రతియడుగు కృష్ణమాయ
మాయగాళ్ళుకు అమాయకుండు
అమాయకుల ఘనజతగాడు
మోహనుడు మోతెక్కించు
మీడియాను మోహనంగ పంచు
తేనీటి సేవనమున సెగలు గక్కు
నీమాయ మాకేమెరుక జ్యోతి వెలుగున వెతుక్కోమా....మాయవిడగా...!
.......అవేరా
(అమరకుల గారి చిత్రానికి అతికించండి)

ఆత్మీయ పవనం *,గోగులపాటి*


ఆత్మీయ పవనం *,గోగులపాటి*
మనమధ్యన ఓ అ *సామాన్యు*డై అలరారె ఓ *జీవన సంఘర్షణ మకుటం*

*ఓ సిరాయుధుడు*
*స్థిరాభిప్రాయుండు*
*బ్రాహ్మడైయ్యూ తాను*
*బంధాల గుణ సంపన్ను*
*నేనెరిగిన వినూత్న యాత్రికు*
*సామాజిక కొలతల కొలమాని*
*క్షమాగుణాల ఘనాపాఠి*
*మన కవి గోగులపాటి*

*తెరిచి చదువ దగిన పుస్తకం*
*లోకమెరుగని అంతరంగం*
*జీవన నౌక కతడు ఓ చుక్కాని*

*మనుషుల బంధాల దర్పణం*

ఆ మితృనెరుక పరిచచిన *చిత్తలూరు చిత్తానికి వందనం*


             ₹₹₹₹₹₹₹₹₹₹₹₹
        సహస్ర దృశ్య కవిభూషణ
               Vlr అమరకుల
                1128/1125
               *కృష్ణం వందే*

రెండు రికార్డు కవి సమ్మేళనాలలో పాల్గొన్నసీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్

రెండు రికార్డు కవి సమ్మేళనాలలో పాల్గొన్నసీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్

తెలంగాణా రాష్ట్రం లో వరుసగా జరిగిన రెండు రికార్డు కవిసమ్మేళనాలలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్.

09-09-2017 శనివారం కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతి లో తెలంగాణా జాగృతి ఆద్వర్యంలో చేపట్టిన కవిసమ్మేళనం గిన్నీస్ బుక్  ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన సంగతి తెలిసిందే.


ఈ కవిసమ్మేళనం గోగులపాటి కృష్ణమోహన్ జోహార్ జోహార్ కాళోజి సార్, అమరవీరుల సాక్షిగా, కళ్తి కళ్తి కళ్తీ,  జర్నలిస్టు బ్రతుకునౌక అనే స్వీయ రచనలను ఐదునిముషాలపాటు చదివి రికార్డు కవిసమ్మేళనంలో తన ప్రతిభ చాటుకున్నారు.

అదేవిధంగా 10-09-2017 ఆదివారం కరీంనగర్‌లో రైతు హార్వెస్టర్ సంఘం ఆద్వర్యంలో వేయిమంది కవులతో చేపట్టిన కవిసమ్మేళనం బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు నమోదు చేసుకుంది.


ఈ కార్యక్రమంలో గోగులపాటి కృష్ణమోహన్ ఆడ జన్మకు గర్వకారణం అమ్మ అనే కవితను చదవడమే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకవుల సముదాయంతో కూడిన దాశరథి ప్రాంగణానికి సమన్వయకర్తగా భాద్యతలను నిర్వహించి కార్యక్రమాన్ని సజావుగా నడిపించి నిర్వాహకుల ప్రశంసలు పొందారు.

ఇప్పటికే ఎన్నో కవిసమ్మేళనాలలో పాల్గొన్న గోగులపాటి కృష్ణమోహన్ సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న, సహస్ర శతపద్యకంఠీరవ, తెలుగురక్ణణ వేదిక వారిచే జాతీయ స్థాయి బతుకమ్మ పురస్కారం మరెన్నో బిరుదులు పొందారు. 

ఇలా వరుసుగా రెండు రోజుల్లో రెండు రికార్డు కవిసమ్మేళనాలు జరగడం, అందులో తాను పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని గోగులపాటి కృష్ణమోహన్ ఆనందం వ్యక్తం చేశారు.