Friday, March 24, 2017

బతుకమ్మ పండుగ


బతుకమ్మ పండుగ

ఈ ప్రపంచ చరిత్రలో బతుకమ్మ అంతటి గొప్ప పండగ మరోచోట లేదంటే అతిశయోక్తి కాదు.


తంగెడు, ముత్యాల, గునుగు పూవులుతెచ్చి
పళ్ళెంలొ అందంగ బతుకమ్మని పేర్చి..
కొత్త చీరలుకట్టి, మెండుగా ఆభరణాలువేసి..
అమ్మలక్కలంత.... ఆడపడుచులంత
ఒక్కచోట చేరి ముచ్చటించుతారు....
కొత్త పాత తరము ఒక్కటవ్వుతారు.
జ్ఙాపకాలనెన్నొ నెమరువేసుకుంటు...
పాట పాటుకుంటు.... ఆటలాడుకుంటు...
బతుకమ్మ పండుగను బహుబాగ జరుపుతూ....

చెరువులోన నీరు కలుషితం కాకుండ...
పూలు చేసు ఎంతో మేలు చెరువుకంటు...
బతుకమ్మలన్నియు నీటవదులుతారు...
ఊరుబాగుకోరు చెరువులోన..

ఎంగిలి పూలు మొదలు
సద్దుల బతుకమ్మ
తొమ్మది రోజులు గౌరికి పూజేసి
సౌభాగ్యమిమ్మని వేడుకొంటారు.
తొమ్మది రకముల సద్దులనే జేసి
సద్దుల బతుకమ్న జరుపుకుంటారు...

తొమ్మిది వేలకు పైగ పడుచులంతాకలిసి
రాజధానిలోన బతుకమ్మ ఆడారు...
రికార్డు చేశారు... గిన్నీసుకెక్కారు...
తెలంగాణ ఖ్యాతిని దునియాకు చాటారు...

బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ...
బతకనీయవమ్మ పాడిపంటలనెల్ల
బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ...
చల్లగా చూడమ్మ ఇంటిల్లిపాదిని
బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ...
మాయమ్మ నువ్వమ్మ... మమ్మేలు మాయమ్మ....


మీ అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో

మీ గోగులపాటి కృష్ణమోహన్ మరియు కుటుంబ సభ్యులు

No comments:

Post a Comment