Saturday, March 11, 2017

హేవళంబి - ఉగాది

గోగులపాటి కృష్ణమోహన్

ముందస్తుగా....
హేవలంబి నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు

ప్రతియేడు
శిశిరం లో ఆకు రాలిన చెట్లన్నీ
చైత్రం లో చిగురిస్తున్నాయి... కానీ...

ఇంతవరకు
మోడు బారిన జీవితాలలో మాత్రం
పెట్టుకున్న ఆశలు ఇంకా చిగురించడం లేదు...

అరువై తెలుగు వత్సరాలు
ఒక దాని వెనుక ఒకటి
వస్తున్నాయి వెల్తున్నాయి

ప్రతి ఉగాదికి షడ్రుచుల పచ్చడి
తింటున్నాము కానీ...
మాకు మాత్రం అందులో చేదే మిగులుతుంది..

ఇక తీపి విషయానికి వస్తే...
అది నోటికి అంటకుండా...
ఒంటికి వచ్చి చేరింది...

ఇక ఉప్పు కారాలు...
కుటుంబమన్నాక షరా మామూలే...

పులుపు వగరు లు...
గెలుపులో మలుపులు లాంటివి...

ఏది ఏమైనా మరో ఉగాది కోసం
మళ్ళీ మళ్ళీ వేయి కళ్ళతో వేచి చూస్తున్నాము...


ఈ యేడైనా మా జీవితాలలో ...
కొత్త ఆశలు చిగురిస్తాయనీ...
ఆశతో... ఆకాంక్షతో...
మరో ఉగాది... తెలుగు వత్సరాది...
హేవలంబి నామ సంవత్సర....
ఉగాదికి స్వాగతం పలుకుతున్న...
శుభాకాంక్షలు తెలుపుతున్నా...


మీ
గోగులపాటి కృష్ణమోహన్
(సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న, శతపద్యకంఠీరవ మరియు బతుకమ్మ జాతీయ పురస్కార గ్రహీత)u

No comments:

Post a Comment