అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలతో..
శీర్షిక : అక్షరమే ఆయుధం
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
తేది: 08-09-2017
అక్షరమే ఆయుధం
అక్షరమే అభివృద్ది
అక్షరమే పోరాటం
అక్షరమే సర్వస్వం
అక్షరమే రాకుంటే
అక్షర జ్ఙానమే లేకుంటే
జరిగిన/జరిగే నష్టాన్ని
అక్షరాల్లో చెప్పలేం
ఆస్తులు కోల్పోయారు
హక్కులు కోల్పోయారు
బానిసలుగ బతికారు
అప్పుల పాలయ్యారు
అక్షర జ్ఙానం ఉంటే
ఆస్తులతో పనిలేదు
అధికారం నీసొత్తు
పోరాటం నీ హక్కు
అక్షరం ఒక వెలుగు
అక్షరం ఒక జిలుగు
అక్షరం ఒక మలుపు
అక్షరం ఒక గెలుపు
అక్షరమంటే చదవడం,
అక్షరమంటే వ్రాయడం,
అక్షరమంటే వినడం
అక్షరమంటే మాట్లాడటం
అక్షరమంటే సృష్టించడం
అక్షరమంటే గుర్తించడం
అక్షరమంటే లెక్కించడం
అక్షరమంటే విజ్ఙానం
అందుకే
అక్షర విలువ తెలుసుకో
అక్షర జ్ఞానం పెంచుకో
అక్షరాలు నేర్వడమే కాదు
నేర్పించడమూ తెలుసుకో
అప్పుడే నిరక్షరాస్యతను
సమూలంగా నిర్మూలించగలం
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలతో...
మీ
సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007653
Very nice poetry
ReplyDeleteHeart touching
మంచి ప్రయత్నం
ReplyDeleteమనోల్లాసభరితం
మీ మాతృభాషాభిమానం
👍
-మావిశ్రీ మాణిక్యం
మాతృభాషా పరిరక్షణ సమితి
7893930104