Monday, September 4, 2017

నా ఇల్లు బాగుండాలి

శీర్షిక : నా ఇల్లు బాగుండాలి
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు


నా ఇల్లు బాగుండాలి
అవును ...
ప్రతి ఒక్కరూ అనుకునేది ఇదే
నా ఇల్లు బాగుండాలి అని..
అవును మన ఇల్లు బాగుండాలి అనుకోవడంలో తప్పులేదు..
బాగుండాలి కూడా..
మరి బాగుండాలి అంటే ఏం చేయాలి?

మన ఇల్లు బాగుండాలి అంటే
మన ఇంటి సభ్యులు అందరూ బాగుండాలి
మన ఇంటి సభ్యులు బాగుండాలి అంటే
మన ఇరుగుపొరుగు బాగుండాలి
మన ఇరుగుపొరుగు బాగుండాలి అంటే
మన ఊరు వాడ బాగుండాలి
మన ఊరు వాడ బాగుండాలి అంటే
ప్రతి ఒక్క రిలో సభ్యత ఉండాలి
కానీ అదే కరువయ్యింది ఈ సభ్యసమాజంలో..

ఆడమగ తేడాలేదు...
ఇరుగుపొరుగుతో సంబందం లేదు
ఎంగిలి మంగలం లేదు, అంటు ముట్టూ లేదు,
చిన్న పెద్దా లేదు, భయం భక్తి లేదు
వాయివరుసా లేదు, ఇంటా బయటా లేదు

ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు
ఏదితోస్తే అది, ఎలాపడితే అలా
ఎవరితోపడితే వారితో, ఏం చేస్తున్నారోకూడా
తెలియని పరిస్థితి.., కాదు కాదు దుస్థితి..

కారణం
భయం భక్తి లేకపోవడం
గౌరవం తెలియకపోవడం
విద్యాబుద్దులు నేర్వకపోవడం
సంస్కృతి సాంప్రదాయాల పట్ల చిన్నచూపు

ఇంకాచెప్పాలంటే
పంతుళ్ళు కొట్టకుండా పాఠాలు నేర్పాలి
చదువురాకున్నా మార్కులేయాలి
అర్హతలేకున్నా పదవులు కావాలి
అన్నటికీ లంచం కావాలి
మంచిచెబితే ఎదురు తిరగాలి

వీటికితోడు
అర్ధం పర్ధం లేని రియాల్టీ షోలు
బూతుసినిమాలు.., అంతం కానీ టీవీ సీరియల్లు
చేతినిండా సెల్లు..సెల్లునిండా కుళ్ళు
ఇంటర్నెట్ మాయలో ఊగుతున్న జనాలు
ఫేసుబుక్కులు.. వాట్సప్పులు
యూట్యూబులు... గూగుల్ సెర్చ్ లు
అడ్డమైన బ్లాగులు... పనికిరాని పోర్న్ లు
చాటింగ్ ల పేరుతో చీటింగులు

ఇన్నిరకాల సభ్యసమాజంలో
మనం బాగుండాలనుకున్నా
ఉండలేని పరిస్థితి... కాదు కాదు దుస్థితి...

అయినా
నా ఇల్లు బాగుండాలి..
నా ఇంటి సభ్యులు బాగుండాలి

మీ
సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007653

No comments:

Post a Comment