సాహితీ కేంద్రం - మారేడుపల్లి, సికింద్రాబాద్.
తేది : 24-09-2017
సాహితీ కేంద్రం ప్రారంభం
సికింద్రాబాద్ లో సహస్రకవుల సృష్టికర్త తెలుగుభోజుడు శ్రీ మేకరవీంద్ర ఆద్వర్యంలో భాగ్యనగర సహస్ర సాహితీ కేంద్రం మారేడుపల్లిలో ఆదివారం ప్రారంభమయ్యింది.
ఈ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్టు సహస్ర కవిరత్న గోగులపాటి కృష్ణమోహన్ జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ మేకరవీంద్ర గారు సహస్ర సాహితీ కేంద్రాల స్థాపిస్తూ భావితరాలకు సాహిత్యవిలువలు నేర్పడం, కవులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు.
సాహిత్య సేవా బంధు, తెలుగు భోజుడు మేక రవీంద్ర మాట్లాడుతూ భావితరాలకు కవిత్వాభిలాష పెంపొందించాలనే ఉద్దేశంతో సాహితీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వీటిని తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోగులపాటి కృష్ణ మోహన్, సహస్రకవులు వీరా గుడిపల్లి, పెసర రవీంద్ర రెడ్డి, సంతోష్ శర్మ, హన్మంత్ నాయక్, ఉదయ్, శిఖా గణేష్, మల్లావజ్జుల చంద్రశేకర్ శర్మ,గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ కవయిత్రులు సిహెచ్ పద్మ, ఈప్సిత తదితరులు పాల్గొని వారికవితలను చదివి వినిపించారు.
No comments:
Post a Comment