Monday, September 25, 2017

సహస్ర సాహితీ కేంద్రం


సాహితీ కేంద్రం - మారేడుపల్లి, సికింద్రాబాద్.
తేది : 24-09-2017

సాహితీ కేంద్రం ప్రారంభం

సికింద్రాబాద్ లో సహస్రకవుల సృష్టికర్త తెలుగుభోజుడు శ్రీ మేకరవీంద్ర  ఆద్వర్యంలో భాగ్యనగర సహస్ర సాహితీ కేంద్రం మారేడుపల్లిలో ఆదివారం ప్రారంభమయ్యింది.

ఈ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్టు సహస్ర కవిరత్న గోగులపాటి కృష్ణమోహన్ జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ మేకరవీంద్ర గారు సహస్ర సాహితీ కేంద్రాల స్థాపిస్తూ భావితరాలకు సాహిత్యవిలువలు నేర్పడం, కవులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు.

సాహిత్య సేవా బంధు, తెలుగు భోజుడు మేక రవీంద్ర మాట్లాడుతూ భావితరాలకు కవిత్వాభిలాష పెంపొందించాలనే ఉద్దేశంతో సాహితీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వీటిని తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  గోగులపాటి కృష్ణ మోహన్, సహస్రకవులు వీరా గుడిపల్లి, పెసర రవీంద్ర రెడ్డి, సంతోష్ శర్మ, హన్మంత్ నాయక్, ఉదయ్, శిఖా గణేష్, మల్లావజ్జుల చంద్రశేకర్ శర్మ,గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ  కవయిత్రులు  సిహెచ్ పద్మ, ఈప్సిత తదితరులు పాల్గొని వారికవితలను చదివి వినిపించారు.











Wednesday, September 20, 2017

రాదారి సోగ్గాడు - అవేరా

రాదారి సోగ్గాడు సోకిల్లా తిరుగుతాడు
రేయిరేడు పగటి వెలుగై వెతుకుతాడు
రామరాజ్యమాఇది రాక్షస బోజ్యమని
కలమెత్తి గళమెత్తి అలసి సొలసి
చేరె రాదారి పక్కలో తేనీటి తోట
అతగాడి ప్రతియడుగు కృష్ణమాయ
మాయగాళ్ళుకు అమాయకుండు
అమాయకుల ఘనజతగాడు
మోహనుడు మోతెక్కించు
మీడియాను మోహనంగ పంచు
తేనీటి సేవనమున సెగలు గక్కు
నీమాయ మాకేమెరుక జ్యోతి వెలుగున వెతుక్కోమా....మాయవిడగా...!
.......అవేరా
(అమరకుల గారి చిత్రానికి అతికించండి)

ఆత్మీయ పవనం *,గోగులపాటి*


ఆత్మీయ పవనం *,గోగులపాటి*
మనమధ్యన ఓ అ *సామాన్యు*డై అలరారె ఓ *జీవన సంఘర్షణ మకుటం*

*ఓ సిరాయుధుడు*
*స్థిరాభిప్రాయుండు*
*బ్రాహ్మడైయ్యూ తాను*
*బంధాల గుణ సంపన్ను*
*నేనెరిగిన వినూత్న యాత్రికు*
*సామాజిక కొలతల కొలమాని*
*క్షమాగుణాల ఘనాపాఠి*
*మన కవి గోగులపాటి*

*తెరిచి చదువ దగిన పుస్తకం*
*లోకమెరుగని అంతరంగం*
*జీవన నౌక కతడు ఓ చుక్కాని*

*మనుషుల బంధాల దర్పణం*

ఆ మితృనెరుక పరిచచిన *చిత్తలూరు చిత్తానికి వందనం*


             ₹₹₹₹₹₹₹₹₹₹₹₹
        సహస్ర దృశ్య కవిభూషణ
               Vlr అమరకుల
                1128/1125
               *కృష్ణం వందే*

రెండు రికార్డు కవి సమ్మేళనాలలో పాల్గొన్నసీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్

రెండు రికార్డు కవి సమ్మేళనాలలో పాల్గొన్నసీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్

తెలంగాణా రాష్ట్రం లో వరుసగా జరిగిన రెండు రికార్డు కవిసమ్మేళనాలలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్.

09-09-2017 శనివారం కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతి లో తెలంగాణా జాగృతి ఆద్వర్యంలో చేపట్టిన కవిసమ్మేళనం గిన్నీస్ బుక్  ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన సంగతి తెలిసిందే.


ఈ కవిసమ్మేళనం గోగులపాటి కృష్ణమోహన్ జోహార్ జోహార్ కాళోజి సార్, అమరవీరుల సాక్షిగా, కళ్తి కళ్తి కళ్తీ,  జర్నలిస్టు బ్రతుకునౌక అనే స్వీయ రచనలను ఐదునిముషాలపాటు చదివి రికార్డు కవిసమ్మేళనంలో తన ప్రతిభ చాటుకున్నారు.

అదేవిధంగా 10-09-2017 ఆదివారం కరీంనగర్‌లో రైతు హార్వెస్టర్ సంఘం ఆద్వర్యంలో వేయిమంది కవులతో చేపట్టిన కవిసమ్మేళనం బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు నమోదు చేసుకుంది.


ఈ కార్యక్రమంలో గోగులపాటి కృష్ణమోహన్ ఆడ జన్మకు గర్వకారణం అమ్మ అనే కవితను చదవడమే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకవుల సముదాయంతో కూడిన దాశరథి ప్రాంగణానికి సమన్వయకర్తగా భాద్యతలను నిర్వహించి కార్యక్రమాన్ని సజావుగా నడిపించి నిర్వాహకుల ప్రశంసలు పొందారు.

ఇప్పటికే ఎన్నో కవిసమ్మేళనాలలో పాల్గొన్న గోగులపాటి కృష్ణమోహన్ సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న, సహస్ర శతపద్యకంఠీరవ, తెలుగురక్ణణ వేదిక వారిచే జాతీయ స్థాయి బతుకమ్మ పురస్కారం మరెన్నో బిరుదులు పొందారు. 

ఇలా వరుసుగా రెండు రోజుల్లో రెండు రికార్డు కవిసమ్మేళనాలు జరగడం, అందులో తాను పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని గోగులపాటి కృష్ణమోహన్ ఆనందం వ్యక్తం చేశారు.

అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ

శీర్షిక :
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
అక్కచెల్లి కలిసి... తల్లికూతురు కలిసి
అత్త కోడళ్ళతో... ఆడబిడ్డలతో
ఇరుగుపొరుగు కలిసి... వీధివాడకలిసి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
తంగేడు పూలను... తెల్లనీ గునుగును...
ముత్యాల పూలనూ.. నేలచామంతినీ...
పల్లెములో పేర్చి... బతుకమ్మను కూర్చి...
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
పట్టుచీరలు కట్టి.. బంగారు నగలేసి
కాళ్ళకూ పట్టీలు.. నిండగాజులు తొడిగి..
నడుముకు నిండుగా వడ్డాలము తొడిగి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
నాటి రాజుల కథలు... పురాణ గాధలు
దేవుళ్ళ పాటలు... జానపద గీతాలు
పాటకు తగ్గట్టు చప్పట్లు కొట్టుతూ
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
అత్తింటి కష్టాలు.. అమ్మింటి ముచ్చట్లు
చిన్ననాటి చిలిపి చేతలు గుర్తులు
ముచ్చటించుకుంటు.. మురుపమెంతో పడుతు
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
పెత్తరమాసంతో ఎంగిళ్ళ పండుగ
సద్దులతో ముగియు బతుకమ్మ పండుగ
తొమ్మిది సద్దులు.. నైవేద్యమే పెట్టి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
చెరువు గట్టు కాడ... దేవునీ ముంగిట
వీధి కూడళ్ళలో... ఇంటి వాకిట్లలో
బతుకమ్మను ఆడి... చెరువులో వేయంగ
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
చెరువులో మురికిని... నీటిశుబ్రతకునూ
బతుకమ్మ పూవులు మేలెంతో చేయునూ
పకృతి మేలుకు, సంస్కృతి జాగృతికి
అతివలంతా చేరి ఆడుదురు బతుకమ్మ
మీ
సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007654

రాక్షస రజాకార్లు



శీర్షిక : రాక్షస రజాకర్లు
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు
మొఘలాయుల పాలనలో
మోసపోయినారు ప్రజలు
ఆంగ్లేయుల పాలనలో
అణిగిమనిగి బతికినారు
నైజాముల రాజ్యంలో
రంకు రజాకర్ల హుకుం
కంటికి కనిపించింది
కళ్ళముందె క్రూరంగా
కసితీరా అనుభవించి
కాటికి పంపారుగా
పిల్లాతల్లని చూడక
కామాందుల ఘఢీలలో
బందీలై పోయారు
తెలంగాణ వనితలు
రజాకార్ల దాడికి
గుబురులే గుడిసెలాయె
చెల్కలే ఊరాయె
ఊర్లేమో ఎడారాయె
పంద్రాగష్టురోజు
దేశానికి స్వాతంత్ర్యం
వచ్చిందని వినడమే
నైజాముల పాలనలో
లేదుమనకు స్వాతంత్ర్యం
ఉక్కు మనిషి వల్లభాయ్
సలాం సలాం నీకు భాయ్
సర్ధార్జీ సాహసంతొ
హైదరాబాద్ దక్కినాది
ముష్కరులను పారద్రోల
లష్కర్లో సిపాయి దింపి
సవాలే విసిరావు
సావే దిక్కన్నావు
నైజామే దిగివచ్చి
నీకు సలాం పెట్టాడు
హైదరబాదు నీకు
హస్తగతం అయ్యింది
సెప్టెంబర్ పదిహేడున
తెలంగాణా దక్కింది
అదే మనకు స్వాతంత్ర్యం
అదే మనకు స్వతంత్రం
తెలంగాణా విమోచనా దినోత్సవ శుభాకాంక్షలతో

మీ
సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
కవి, జర్నలిస్టు
9700007653

సహస్ర సాహితీ కేంద్రము - వరంగల్

సహస్ర సాహితీ కేంద్రం - గోపాలపురం, వరంగల్










వరంగల్ పట్టణం గోపాలపురం లో శ్రీమతి మల్లెల విజయలక్ష్మి గారి ఆద్వర్యంలో జరిగిన సహస్ర కవుల సాహితీ కేంద్రం మొదటి సమావేశం ఆదివారం వారి నివాసంలో  జరిగింది.

సాహిత్య సేవా బంధు, తెలుగు భోజుడు శ్రీ మేక రవీంద్ర గారి అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రేపటితరానికి కవిత్వాభిలాష పెంపొందించాలనే ఉద్దేశంతో సాహితీ కేంద్రాలు ఏర్పాటు చేయదలిచినట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో సహస్రకవులు అవేరా, వీరా గుడిపల్లి, గోగులపాటి కృష్ణమోహన్, అమరకుల, వరుకోలు కళాచందర్, వడ్త్యా నారాయణ, గుండు మధుసూదన్, దండ్రె రాజమౌళి, బ్రహ్మచారి, అన్వర్, సుధాకర్, చేపూరి శ్రీరాం

కవయిత్రులు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, అరుణా ఛామర్తి,  పాలబోయిన రమాదేవి, ఉదయశ్రీ, రామా రత్నమాల
తదితరులు పాల్గొని సహస్రకవుల సమూహంతో వారికున్న అనుభవాలను పంచుకొని వారికవితలను చదివి వినిపించారు.