Thursday, July 21, 2016

లేడీ కండక్టర్


లేడీ కండక్టర్

బతకలేక బడిపంతులు అన్నారు నాడు...
ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు .
కానీ నేడు...
లేడీ కంటక్టర్ల పరిస్థితి మాత్రం అదేఅని చెప్పాలి...
సిటీ బస్సుల్లో 
కుప్పలు తెప్పలుగా జనాలెక్కే బస్సులో.... 
ఆ కొన నుండి ఈ కొనకు రావాలంటే...
మగవాళ్ళకే చాలా కష్టం....
దిగాల్సిన వారు...
ఓ స్టేజీ ముందేలేచి రావాల్సి ఉంటుంది...
కానీ అంతమంది జనాలలో....
స్టేజి స్టేజికి... అటు ఇటు....తిరిగేస్తూ.....
ఎన్ని తిప్పలో పడుతుంది...లేడీ కండక్టర్....
ఎందుకంటే....
అడుగుతీస్తే అడుగువేయలేని పరిస్థితి ....
అందులో మగాళ్ళలో 
రకరకాల మాగరాయుళ్ళు ఉంటారు.... 
ఒకడు తాగి బస్సెక్కి.... తందనాలాడుతాడు.... 
నోటి కొచ్చినట్టు వాగుతాడు....
వాడిని తిట్టినా తిట్టకున్నా ఒక్కటే...
ఇంకోకడు ఆడోళ్ళను చూస్తే సొల్లు కార్చే రకం...
కావాలని వారినీ అడ్డగిస్తూ....  ఇబ్బందికి గురిచేస్తాడు.....
మరొకడు పోకిరీ....
అమ్మాయిలను ఏడిపించడమే వీడికి సరదా.....
చిల్లర లేదంటూ పెద్ద నోటిచ్చి.... బాదపెడుతాడు.....
చెమట కంపుతో ఒకడు... సెంటు కంపుతో ఇంకొకడు...
పానేసి ఒకడు... సిగరెట్లు తాగి మరొకడు...
ఇలా ఒకటా రెండా.... ఒక్కట్రిప్పులో....
నరకం చవి చూస్తున్నారు... లేడీ కండక్టర్లు....
దీనికితోడు.... ట్రాఫిక్ ఇక్కట్లు....
కదలాల్సిన సమయానికి బస్సు కదిలినా....
చేరాల్సిన సమయానికి గమ్యం చేరదు....
దీంతో గంటల తరబడి ఆలస్యం....
రాత్రివేళలో ఇంటికి చేరుకోవడం చాలా కష్టం....
ఇక కొంతమంది డ్రైవర్లు చేసే పరాచకాలు...
పై అధికారుల వేదింపులు...
కాదంటే ఎక్కడో ఇరికించడాలు...
తప్పని డ్యూటీలు.... కాదంటే వేట్లు....
ఇంట్లో చెప్పుకోలేక.... ఎవ్వరినీ ఎమీ అనలేక.....
లౌఖ్యంతో... నేర్పుతో వృత్తిలో రాణిస్తూ....
నవ్వుతూ డ్యూటీలు చేస్తూ.... 
అందరికీ ఆదర్శంగా ఉంటున్న
లేడీ కండక్టర్ల కనిపించని వెతలు....
అందుకే.... ఆ
మెకు మనవంతు సహాయసహకారాలు అందిద్దాం....
మన తల్లిగానో.... చెల్లిగానో భావిద్దాం....

(ప్రత్యక్షంగా చూసి కొన్ని... తెలుసుకొని రాసిన భావ కవిత)
మీ
గోగులపాటి కృష్ణమోహన్
9700007653

Sunday, July 17, 2016

వృక్షో రక్షతి రక్షతః

వృక్షో రక్షతి రక్షతః
మొక్కలు నాటండి

చెట్లను నరకకండి

మొక్కలు నాటండి... చెట్లను నరకకండి....

"కడుపు నింపే కూడు నేనే.. నీడనిచ్చే గూడు నేనే.. నువ్వు కట్టే బట్ట నేనే.. ఆయువు నేనే.. ప్రాణవాయువు నేనే.. కాడి నేనే.. పాడే నేనే.. నిన్ను కాల్చే కట్టె నేనే.. నేను తరువుని.. బతుకుదెరువుని.. కన్ను విప్పి కాంచరా.. ఒక్క మొక్కైనా పెంచరా.. - ఓ చెట్టు తన అంతరంగం ఇది"

హరితవనం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో మంచిది....
కానీ అవి నాటే ప్రదేశాలను విశదంగా పరిశీలించాలి...
ఒక మొక్క పెరిగి వృక్షంగా మారడానికి ఎంత కాలం పడుతుందో అందరికి తెలుసు....
ఎందుకంటే దూరదృష్టి లేకుండా చెట్లను నాటడం వలన....
అవి అభివృద్దికి ఆటంకాలని కూల్చిన సందర్భాలు కోకొల్లలు ...
వంద మొక్కలు నాటినదానికన్నా వచ్చే నష్టం....
ఒక వృక్షం కూల్చితే మనకు ఎంతో నష్టం వాటిల్లుతుంది ....
రోడ్ల ప్రక్కన మొక్కలు నాటడం....
రోడ్ల విస్తరణ అంటూ చెట్లను నరకడం.... మామూలే అయ్యింది....
వీటికి తోడు 
యజ్ఙాలనుండి మొదలు...గృహ నిర్మాణాలు, వస్తు తయారీలు చివరికి చావుకు కూడా కర్ర ఎంతో అవసరం....
ఈ అవసరాలకు అవసరమైన వృక్ష సంపద మనకు కరువైందనే చెప్పవచ్చు...
భవిష్యత్తు అవసరాల కోసం వృక్షసంపద మనకు ఎంతో అవసరం....
నగరప్రాంతాలలో కనీసం కార్బన్‌డైఆక్సైడ్‌ పీల్చుకొని ఆక్సీజన్ ఇవ్వడానికి కూడా చెట్లు కరువయ్యావంటే అతిశయోక్తి కాదు....
అందుకే  రోజుకో రోగంతో జనాలు అవస్థలు పడుతున్నారు ....
ఇప్పటికైనా మేల్కొందాం...
అవసరమైతేనే తప్ప చెట్లను నరకడం ఆపేద్దాం....
అవసరమైతే ట్రీ అట్రాసిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కుడా ఈ ప్రభుత్వాల మీద ఉంది....
మొక్కలు నాటగానే సరిపోదు.... 
చెట్లను నరకకుండా ఆపండి...
అదే మనకు పదివేలు....
వృక్షో...రక్షితో....రక్షితః
వృక్షాలను రక్షిస్దాం....అవిమనల్ని కాపాడుతాయి....

మీ
గోగులపాటి కృష్ణమోహన్

వృక్షో రక్షతి రక్షతః

వృక్షో రక్షతి రక్షతః

మొక్కలు నాటండి

చెట్లను నరకకండి



మొక్కలు నాటండి... చెట్లను నరకకండి....

"కడుపు నింపే కూడు నేనే.. నీడనిచ్చే గూడు నేనే.. నువ్వు కట్టే బట్ట నేనే.. ఆయువు నేనే.. ప్రాణవాయువు నేనే.. కాడి నేనే.. పాడే నేనే.. నిన్ను కాల్చే కట్టె నేనే.. నేను తరువుని.. బతుకుదెరువుని.. కన్ను విప్పి కాంచరా.. ఒక్క మొక్కైనా పెంచరా.. - ఓ చెట్టు తన అంతరంగం ఇది"

హరితవనం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో మంచిది....
కానీ అవి నాటే ప్రదేశాలను విశదంగా పరిశీలించాలి...
ఒక మొక్క పెరిగి వృక్షంగా మారడానికి ఎంత కాలం పడుతుందో అందరికి తెలుసు....
ఎందుకంటే దూరదృష్టి లేకుండా చెట్లను నాటడం వలన....
అవి అభివృద్దికి ఆటంకాలని కూల్చిన సందర్భాలు కోకొల్లలు ...
వంద మొక్కలు నాటినదానికన్నా వచ్చే నష్టం....
ఒక వృక్షం కూల్చితే మనకు ఎంతో నష్టం వాటిల్లుతుంది ....
రోడ్ల ప్రక్కన మొక్కలు నాటడం....
రోడ్ల విస్తరణ అంటూ చెట్లను నరకడం.... మామూలే అయ్యింది....
వీటికి తోడు 
యజ్ఙాలనుండి మొదలు...గృహ నిర్మాణాలు, వస్తు తయారీలు చివరికి చావుకు కూడా కర్ర ఎంతో అవసరం....
ఈ అవసరాలకు అవసరమైన వృక్ష సంపద మనకు కరువైందనే చెప్పవచ్చు...
భవిష్యత్తు అవసరాల కోసం వృక్షసంపద మనకు ఎంతో అవసరం....
నగరప్రాంతాలలో కనీసం కార్బన్‌డైఆక్సైడ్‌ పీల్చుకొని ఆక్సీజన్ ఇవ్వడానికి కూడా చెట్లు కరువయ్యావంటే అతిశయోక్తి కాదు....
అందుకే  రోజుకో రోగంతో జనాలు అవస్థలు పడుతున్నారు ....
ఇప్పటికైనా మేల్కొందాం...
అవసరమైతేనే తప్ప చెట్లను నరకడం ఆపేద్దాం....
అవసరమైతే ట్రీ అట్రాసిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కుడా ఈ ప్రభుత్వాల మీద ఉంది....
మొక్కలు నాటగానే సరిపోదు.... 
చెట్లను నరకకుండా ఆపండి...
అదే మనకు పదివేలు....
వృక్షో...రక్షితో....రక్షితః
వృక్షాలను రక్షిస్దాం....అవిమనల్ని కాపాడుతాయి....

మీ
గోగులపాటి కృష్ణమోహన్

Monday, July 11, 2016

కవుల వనం

సహస్ర కవులకు వందనం....

మేక రవీంద్రుని కవన వనం లో కవికుసుమాలు ఎన్నో... ఎన్నెన్నో.
సుకవి గుండు మధుసూదనుడు...
ఆరేకాలాలు చదివిన అంజన్న...
వేలపద్యాల వీరుడు వీరన్న....
పద్య, వచన కవన దిట్ట అవేరా....
కళాధరుడు మన కళాచంద్రన్న...
రసిక రచనా శర్మలు అరాశ, మాడుగుల...
అందె వేసిన చేయి మద్దా వారు....
భావజాలాలున్న దండ్రె రాజమౌళి...
వాస్తు తెలిసిన పెద్దన్న లచ్చిరెడ్డన్న...
పచ్చి నిజములు చెప్పె పెసరు లింగన్న...
రోజుముచ్చట్లతో దేశపతి కృష్ణన్న...
పద్య కవితలందు అడుగులే వేసాడు
నాదు పేరు ఉన్న పూదత్తు కృష్ణన్న
పెద్దవారు మనకు కంది, పిన్నక గార్లు....
మన్నెవీరుడు కడబాల నాగన్న....
అయ్యవారి మురళి అరుదైన పద్యాలు....
మజ్జూరికేశవులు, పుల్ల రామాంజులు....
వృక్షప్రేమికుండు పార్ధసారధి గారు...
అశువులలో దిట్ట అంబటి భానుడు....
సాహితిసవ్వడి చేయు సంటి అనిలు....
ఎన్వీఎన్ చార్యులు,బొడ్డు శంకరన్న....
సిస్ట్లా శర్మ, శేశుకుమారులు,
చేకూరి, పోకూరి క్రొవ్విడి కవనాలు...
విశాక వీరుడు గధాధరుడు
కవిరాజులెందరో కవనకుసుమాలు...

అమ్మ ఉమాదేవి అందెవేసిన చేయి...
మన్నె లలితమ్మ మేరు కవితల్...
బిరుదుల మారాణి మల్లీశ్వరమ్మ...
కవన గానములుజేయు ఇందిరమ్మ....
అబినందనలు తెలుపె చామర్తి అరుణమ్మ...
కవితకు దాసోహమౌ దాసోజు పద్మమ్మ....
కంటకవుల ఇంపు పుష్ప జగన్నాధ్ లు...
ధడధడ లాడించు ధరణి, సందితలు....
చక్కటి కవనాల విజయ వినీలమ్మ...
అందరిని మెచ్చేటి అనురాధ శివపురపు....
కవన వనములోన కవయిత్రి లెందరో

ఒక్కరా ఇద్దరా వేలవులకిది...
వేదికై నిలిచింది కవిత యజ్ఙం...
కవన సుగంధాలు వెదజల్లుచుండగా....
వేదికై నిలిచింది ప్రయుత యజ్ఙం....

అందరికి వందనాలతో....
మీ సహస్రకవిమిత్ర
గోగులపాటి కృష్ణమోహన్

(ఎవరినైనా మరిచియుంటే మన్నించి గుర్తుచేయండి)

Thursday, June 30, 2016

వసుదైక కుటుంబం


                           వసుదైక కుటుంబం

ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్య అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....
మీ
గోగులపాటి కృష్ణమోహన్

Thursday, May 26, 2016

అవయవదానం .... మహాదానం

గోగులపాటి కృష్ణమోహన్
సహస్రకవిమిత్ర,
సీనియర్ జర్నలిస్టు,
మొబైల్. 9700007653

అన్నిదానాలకంటే.... అవయవదానం గొప్ప....


మనిషి చనిపోయాక తగలబెట్టటమో....
బొందపెట్టడమో చేస్తున్నాము.....
అంతేకాని....
ఏ కంపెనీలో తయారుకాని అవయవాలు....
ఎవ్వరూ తయారు చేయలేని అవయవాలు...
ఎంత వెలపెట్టినా దొరకని అవయవాలను....
మనం ఊరికే మట్టిపాలు చేస్తున్నాం....
ఎలాగూ మనం పోయాక ఏమీ ఉండదు....
కనీసం మనం మరొకరికి జ్ఙాపకంగా ఉందాం...
అన్నీ అవయవాలు ఉండి మనం చస్తున్నాం....
కొన్ని అవయవాలు లేక కొందరు బతుకుతున్నారు.....
అందుకే....
చచ్చి పడున్న మన అవయవాలను బతికిద్దాం....
మరొకరికి బతుకునిద్దాం.....
మనం చచ్చాక మన అస్థికలను గంగలో కలిపితే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు కానీ....
మనం చేసే అవయవ దానం వలన మాత్రం.... తప్పక పుణ్యం వస్తుంది....
చచ్చినోళ్ళందరూ.... కీర్తిశేషులు కారు....
ఎందుకంటే వారు ఏ కీర్తి మూటగట్టుకున్నారో ఎవరికి తెలియదు....
కాని
అవయవదానం చేసిన ప్రతి ఒక్కరూ కీర్తిశేషులే.....
వీరి కీర్తిని అ లబ్ది పొందిన కుటుంబం ఎన్నటికీ మరవదు..... తరతరాలు గుర్తుంచుకుంటుంది....
ఇంతకంటే మనం సచ్చి ఏం సాదించగలం?
అందుకే.....
మన కళ్ళు, లివరు, హార్టు, కిడ్నీ లు ఇలా ఏది అవసరమైతే అది ఇచ్చేద్దాం.... ఇంకో ప్రాణాన్ని బతికిద్దాం.....
నేను సిద్దం..... మీరు సిద్దం కండి...
మీ
గోగులపాటి కృష్ణమోహన్
సహస్రకవిమిత్ర,
సీనియర్ జర్నలిస్టు,
మొబైల్. 9700007653

Saturday, May 21, 2016

నాకేంటి.... నాకేంటి?



నాకేంటి.... నాకేంటి...
`````````````````````````

నాకేంటి... నాకేంటి....
ఎవడెటుబోతె నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
రోడ్డుపై ఎవడో పడిజస్తె నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
ఎవడొ తాగి తిరుగుతే నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
గల్లీలో గుద్దుకొని చస్తే నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
అప్పులతో రైతన్న చస్తే నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
చేనేతన్న ఆకలితో పోతే నాకేంటి?

నాకేంటి... నాకేంటి
రాజకీయం నాటకీయమైతే నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
చదువులమ్మ అమ్ముడుపోతె నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
వైద్యానికి రోగం వస్తే నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
ఆడపిల్లల ఆర్తనాదాలతో నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
విజ్ఙునికి విలువలేకుంటే నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
కులమతదాడులతో నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
కల్తీ రాజ్యమేలితే నాకేంటి?

నాకేంటి.... నాకేంటి...
ఎవరెటు పోతె నాకేంటి?

నాకేంటి... నాకేంటి?
నా బతుకు నాకుంటే....

నాకేంటి.... నాకేంటి...
నీ బతుకుతో పనేంటి?

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సహస్రకవిమిత్ర