రెండు రికార్డు కవి సమ్మేళనాలలో పాల్గొన్నసీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్
రెండు రికార్డు కవి సమ్మేళనాలలో పాల్గొన్నసీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్
తెలంగాణా రాష్ట్రం లో వరుసగా జరిగిన రెండు రికార్డు కవిసమ్మేళనాలలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్.
09-09-2017 శనివారం కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతి లో తెలంగాణా జాగృతి ఆద్వర్యంలో చేపట్టిన కవిసమ్మేళనం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన సంగతి తెలిసిందే.
ఈ కవిసమ్మేళనం గోగులపాటి కృష్ణమోహన్ జోహార్ జోహార్ కాళోజి సార్, అమరవీరుల సాక్షిగా, కళ్తి కళ్తి కళ్తీ, జర్నలిస్టు బ్రతుకునౌక అనే స్వీయ రచనలను ఐదునిముషాలపాటు చదివి రికార్డు కవిసమ్మేళనంలో తన ప్రతిభ చాటుకున్నారు.
అదేవిధంగా 10-09-2017 ఆదివారం కరీంనగర్‌లో రైతు హార్వెస్టర్ సంఘం ఆద్వర్యంలో వేయిమంది కవులతో చేపట్టిన కవిసమ్మేళనం బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు నమోదు చేసుకుంది.
ఈ కార్యక్రమంలో గోగులపాటి కృష్ణమోహన్ ఆడ జన్మకు గర్వకారణం అమ్మ అనే కవితను చదవడమే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకవుల సముదాయంతో కూడిన దాశరథి ప్రాంగణానికి సమన్వయకర్తగా భాద్యతలను నిర్వహించి కార్యక్రమాన్ని సజావుగా నడిపించి నిర్వాహకుల ప్రశంసలు పొందారు.
ఇప్పటికే ఎన్నో కవిసమ్మేళనాలలో పాల్గొన్న గోగులపాటి కృష్ణమోహన్ సహస్ర కవిమిత్ర, సహస్ర కవిరత్న, సహస్ర శతపద్యకంఠీరవ, తెలుగురక్ణణ వేదిక వారిచే జాతీయ స్థాయి బతుకమ్మ పురస్కారం మరెన్నో బిరుదులు పొందారు.
ఇలా వరుసుగా రెండు రోజుల్లో రెండు రికార్డు కవిసమ్మేళనాలు జరగడం, అందులో తాను పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని గోగులపాటి కృష్ణమోహన్ ఆనందం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment