*సహస్ర కవితా సౌరభం*
*ఆహ్వానం*
*తెలుగు కవితా వైభవం* వ్యవస్థాపకులు సాహితీ సేవాబంధు శ్రీ మేక రవీంద్ర గారి ఆద్వర్యంలో....
ఇప్పటివరకు వాట్సప్ ద్వారా 18 నవంబర్ 2015 న ఒకేరోజు వేయిమంది కవులతో సహస్ర కవి సమ్మేళనం నిర్వహించింది.
2016 ఉగాదికి అయుత కవితా యజ్ఞం నిర్వహించి 15742 కవితలతో పూర్తి చేసింది
2017 ఉగాదికి ప్రయుత కవితా యజ్ఞం* నిర్వహించి 154098 సాహితీ సమిధలతో పూర్తి చేసి సాహితీ రంగంలో కొత్త ఒరవడికి నాంది పలికింది.
ఈ సందర్భాలలో మొదటిసారి 2016 లో 49మంది కవులను 69 బిరుదులతో...
2017 లో 143 మంది కవులను 323 బిరుదులతో సమ్మానించడమైనది.
కవులు, కవిత్వం ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు *సహస్రకవుల సత్రయాగం* నిర్వహిస్తున్నది.
ఇందులో భాగంగా *సహస్ర కవితా సౌరభం* అను పేర *1008 మంది కవుల పరిచయం మరియు కవితలతో* *ఒక మహా కవితా సంకలనం తీసుకురాబోతుంది.*
ఈ *సహస్ర కవితా సౌరభం* సంకలనంలో పాల్గొనాలని ఇరు తెలుగు రాష్ట్రాలలో, తెలుగేతర రాష్ట్రాలలో, విదేశాలలో నివసించు తెలుగు కవులకు స్వాగతం పలుకుతూ ఆహ్వానంపలుకుతున్నాము.
కేవలం సహస్రకవులకు మాత్రమే ఈ సంకలనంలో పాల్గొనడానికి అవకాశం కలదు కనుక ముందుగా *సహస్రకవి* గా పేరు నమోదు చేసుకోవాలి.
ఆసక్తి కలవారు తమ పేరు, చిరునామా, వచనమా, పద్యామా, రెండూనా ఏ విభాగమో తెలుపుతూ *+91 9177059331* కు వాట్సప్ ద్వారా సంక్షిప్త సమాచారం పంపి పేరు *సహస్ర కవి* గా నమోదు చేసుకోగలరు. *పేరు నమోదుకు ఎటువంటి రుసుము లేదు*.
మొదట మిమ్ములను *సహస్ర కవి* గుర్తించి ఒక ఐడి. నెంబరు కేటాయించబడును. అటు తరువాత మీరు *తెలుగు కవితా వైభవం* నిర్వహించే వివిధ కార్యక్రమంలో పాల్గొనుటకు వీలు అగును.
తరువాత మిమ్ములను ప్రస్తుతము నిర్వహింపడుతున్న *సహస్ర కవుల సత్రయాగం* గ్రూప్ లో చేర్చబడును. అక్కడ దేశంలోని వివిధ ప్రదేశాలలో నివసిచే కవులను మీరు పోస్టు చేసి కవితలకు పాఠకులుగా పొందవచ్చు, మరియు మీ ప్రతిభ అనుసారము తగిన గుర్తింపు,బిరుదులు పొందే అవకాశం కలదు. *ఇప్పటి వరకు ఎంతో మంది కవులు ఈ వేదిక ద్వారా తెలుగు విశాల ప్రపంచానికి పరిచయమై పేరు మన్ననలు గడించారు.*
తరువాత *సహస్ర కవితా సౌరభం* సంకలనంలో ప్రచురించడానికి *మీ పరిచయాన్ని మరియు కవితలను పంపడానికి ఒక సంపాదకునికి మిమ్ములను కేటాయించబడును. ఆ సంపాదకునికి మీ పరిచయాన్ని, కవితను పంపవలసి వుంటుంది.* ఎలా పంపాలి, ఏ నమూనా లో పంపాలి, హామీ పత్రం ఎలా వుండాలి అన్న వివరాలు పేరు నమోదు చేసుకున్న తరువాత మీకు వివరంగా పంపబడును.
*కవిత ఎంపిక అయిన ప్రతి కవి ప్రచురించబోయే *సహస్ర కవితా సౌరభం* యొక్క మూడు ప్రతులు ముద్రణకు ముందుగానే కొనవాలెను. అట్లు కొన్నవారి కవితలు మాత్రమే ఈ తొలి 1008 కవుల సంకలనం లో ప్రచురింపబడును.* ఈ విధంగా మీ పరిచయం కనీసం 1008 కవుల గృహ గ్రంథాలయాలలో చోటు సంపాదించుకుంటుంది. మరియు ఎంతో మంది సాహితీ వేత్తల దృష్టిలో పడితుంది.
ఈ ప్రచురణలో మీ కవిత వుండేలా చూసుకొని సాహితీ లోకంలో మీ పేరు బహుకాలం నిలిచిపోయేలా చూసుకొనగలరు.
ఆసక్తిగల కవులు పేరు నమోదుకు మరియు ఇతర వివరాలకు *+91 9177059331* కు వాట్సప్ ద్వారా మీ పేరు చిరునామ పంపగలరు
ధన్యవాదాలు
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త,
సహ-సంపాదకులు...
సహస్రకవితా సౌరభం (సంకలనం)
తెలుగు కవితా వైభవం
హైదరాబాదు
9700007653
No comments:
Post a Comment