Thursday, September 22, 2016

వీర జవానుకు జోహార్లు


వీరజవాన్...జై జవాన్

రాక్షసులు ఎలా ఉంటారంటే...
ఇదిగో ఇలా ఉంటారని చూపించు....
దుర్మార్గులు ఎవరని అడిగితే...
ఇదిగో వీరే అని చూపించు....
పిరికిపందలకు ఉదాహరణగా...
ఈ పందులను చూపించు....
ఇంతకు ఎవరిని చూపించేది....
ఇంకెవరిని....
నిద్రాణం లో ఉన్న వీర జవాన్లను.....
అమానుషంగా రాత్రివేళలో...
బలి తీసుకున్న పాకిస్తాన్‌ రాబందులను....
ఎదురుగా వచ్చి ఢీకొనే దైర్యం లేని ...
పిరికి పందులు (పందలు) వీరు....
దేశరక్షణ కోసం విధుల్లో చేరేటప్పుడే....
ప్రాణాలకు సైతం పోరాడుతామని చేరుతారు...
కానీ ఇలా పడుకున్న సమయంలోప్రాణాలు కోల్పోయినందుకేబాధ.
ఎందుకంటే
బతికుండగా జరిగుంటే....
కనీసం ఒక్కో సైనికుడు వందమందినైనా బలితీసుకొని అమరుడయ్యేవాడు....
అందుకే వారి ఆత్మలు కూడా శాంతించడం లేదనుకుంటాను....
అమ్మనాన్నలనువదిలి
ఆలిబిడ్డలను వదిలి....
ఊరువాడనొదిలి...
ఉన్నవారినొదిలి.....
బంధుమిత్రుల నంత....
బారంగవదిలేసి....
దేశరక్షణకొరకు దీక్ష పట్టి....
సరిహద్దులో మనవాడు...
నిద్రాహారాలు లేకుండ...
పండుగ పబ్బాలు లేకుండ....
పొద్దనక, పగలనక....
రాత్రనక, రప్పనక...
చెట్టనక, పుట్టనక....
ఎండనక, వాననక,
చలినిసైతం లెక్కచేయక....
విధులముందు... నిధులెంతని...
దేశరక్షణే ధ్యేయంగా....
తనవారికోసం....
తనువునే అణువుగా....
ప్రాణాలను ఫణంగాపెట్టే....
ఓ వీర సైనికులారా....
ఏమని చెప్పను మీ త్యాగం....
ఏలని తెలపను మీ ఫలితం....
అందుకోండి అందుకోండి....
పాదాభివందనం....
ఓ అమరులారా....
వీర జవానులారా....
అందుకోండి.... అందుకోండి...
జోహార్లు... మా జోహారులు...

గోగులపాటి కృష్ణమోహన్....

(దేశరక్షణకోసం పోరాడుతున్న...
పోరాటంలో వీరమరణం పొందిన
వీరజవానులకు అంకితం)

No comments:

Post a Comment