ప్రేమ - పెళ్ళి
అరకత్తెరలో పోకచెక్క....
తనని ప్రేమించాను...
ఇతనిని పెళ్ళి చేసుకున్నాను
తను మంచోడు....
ఇతను ఇంకా చాలా మంచోడు....
తను నేనేదడుగుతే అదిప్పించేవాడు...
ఇతను నేనేది అడగకుండానే అన్ని ఇప్పిస్తున్నాడు....
ఇతను నాకిష్టమని బుల్లెట్ కొంటే....
అతను నే నడగకుండానే కారుకొన్నాడు....
ఇతను నాకోసం ఇళ్ళుకట్టిస్తే....
అతను నాకోసం డూప్లెక్సు కొన్నాడు...
తను నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు...
ఇతను నాకు బాధ అంటే ఏంటో యెలియనివ్వడం లేదు...
తను నా కంట్లో నీరొస్తే తట్టుకునేవాడు కాదు....
ఇతను నా కంట్లో నీరే రాకుండా చూసుకుంటున్నాడు....
తనకు ఎన్నో ఆశలు పెట్టాను....
ఇతను నా ఆశలు అడియాశలు చేశాడు...
తనని ఏనాడూ వద్దనుకోలేదు....
ఇతను నన్నే కావాలనుకున్నాడు...
తనని ఇంట్లో ఎవరూ అంగీకరించలేదు...
ఇతని అందరూ కావాలనుకున్నారు....
అతనికోసం నా వాళ్ళను వదులుకోలేను ...
ఇతనికోసం అతన్ని వదులుకున్నాను....
మూన్నాళ్ళ తిరుగుడు ముచ్చట గొలిపింది...
మూడుముళ్ళ బంధం నన్ను బందీని చేసింది....
ప్రేమించి పెళ్ళిచేసుకున్నాను.... కానీ....
ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోలేదు....
ప్రేమించిన వాణ్ణి పెళ్ళి చేసుకోలేదు కానీ....
పెళ్ళి చేసుకున్నవాణ్ణి ప్రేమించే ప్రయత్నం చేస్తున్నాను....
ఎందుకంటే.... నాకందరూ కావాలి...
అందుకే....
అందరి ప్రేమను పంచుకోవడం కోసం...
ఒక ప్రేమను తుంచుకున్నా.... కాదు... చంపుకున్నా....
ఎందుకంటే ....
తనను మరవలేను....
ఇతనిని విడువలేను....
కానీ
గతస్మృతులను మరిచే ప్రయత్నం చేస్తూ...
కొత్త జీవితాన్ని ప్రారంబించే యత్నం చేస్తున్నాను....
కానీ రేపు నిజం తెలిస్తే....
ఇతనితో కాపురం చేయలేను...
అతనితో కలిసి వెళ్ళలేను....
అందుకే ఆడదాన్ని జీవితం అరకత్తెరలో పోకచెక్కలాంటిది అంటాను....
ఇట్లు
ప్రేమలో ఓడిపోయిన ప్రేయసి ఆవేదన.....
మీ
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653

BAGUNDI SIR
ReplyDelete