కేబుల్ రంగంలో అడుగిడి
ఇరువై యేళ్ళు పూర్తి చేసుకున్న
గోగులపాటి కృష్ణమోహన్....
(జన్మదిన ప్రత్యేకం)
1996 డిసెంబర్ లో సౌజన్య శాటిలైట్ నెట్వర్క్ లో రూపొందించిన వెల్కమ్ టు 97 కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమై... ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.
కేబుల్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన గోగులపాటి కృష్ణమోహన్ కేబుల్ రంగంలో అడుగిడి ఇరువై వసంతాలను పూర్తిచేసుకున్నాడు.
జీడిమెట్ల సిటీకేబుల్ లో, మార్కెటింగ్
మేనేజర్ గా, ప్రోగ్రామ్ ఇంచార్జ్ గా, న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, న్యూస్ ఇంచార్జ్ గా పలు విభాగాలలో రాణించి సుమారు యాబైకి పైగా కార్యక్రమాలను రూపొందించి అందరిమెప్పు పొందాడు.
శుభోదయ కమ్యూనికేషన్ లో ఆపరేషన్ ఇంచార్జ్ గా మెదక్ జిల్లాలో పనిచేశాడు, హిందుజా హిట్స్ లో మెదక్, రంగారెడ్డి జిల్లాల టెరిటరీ మేనేజర్ గా కూడా పనిచేశాడు. గతంలో మరియు ప్రస్తుతం డిజీకేబుల్ లో బిజినెస్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.
తనకు హాబీలైన వ్యాసాలు, కవితలు, పద్యాలు రెండు శతకాలు రాసి తెలుగువేదిక ఆధ్వర్యంలో 2016 లో "సహస్ర కవిమిత్ర" బిరుదును కూడా పొందాడు.
వీటితో పాటు సురారం కాలనీ లోని శ్రీ నల్లపోచమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సమాజసేవ లో సైతం తనవంతు పాత్రను పోషించాడు.
మరోవైపు తనకిష్టమైన వార్తా రంగంలో స్టింగర్ గా కూడా పనిచేస్తూ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్, అల్వాల్ శాఖకు అడ్వైజర్ గా తన సేవలందిస్తున్నారు.
ప్రస్తుతం బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా బ్రాహ్మణ కమ్యూనిటీ అభివృద్ది కోసం తనవంతు భాద్యతగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఈ సందర్భంగా కృష్ణమోహన్ కేబుల్ సమాచార్ తో తన అభిప్రాయం తెలియజేస్తూ
కేబుల్ రంగానికి పరిచయం చేసి తనకు సమాజంలో మరో జన్మను ప్రసాదించిన తెలంగాణ ఎఫ్. టి. ఎమ్. అధ్యక్షుడు శ్రీ సుభాష్ రెడ్డికి తనెంతో ఋణపడి ఉంటానని తెలిపాడు.
కేబుల్ టీవీ రంగంలో సీనియర్లైన శ్రీకుమార్, ఇంతియాజ్ అహ్మద్, ఆర్కే సింగ్, మనీష్ మాథూర్, సత్య, కిషోర్, వికాస్ కన్వర్, ప్రతాప్ రెడ్డి లాంటి వారితో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాని... వారి నుండి కేబుల్ ఇండస్ట్రీకి సంబందించిన ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాని పేర్కొన్నాడు.
ఇంతకాలం తనకు అన్నివిధాల సహాయ సహకారాలందించిన కేబుల్ ఆపరేటర్లకు
తోటి సిబ్బందికి దన్యవాదాలు తెలియజేశాడు.
ఇలా విభిన్న రంగాలలో పనిచేస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న గోగులపాటి కృష్ణమోహన్ ఈ ఆగస్టు 13న తన జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
కృష్ణ మోహన్ గారికి జన్మదిన శుభాకంక్షలతొ
ReplyDeleteవిమల మైనట్టి కవితలు విశ్వ మందు
వ్రాయు చున్నట్టి గోగుల వారికెపుడు
నాయు రారోగ్య భాగ్యమ్ములందజేయ
వేంక టేశునిగోరెద వేడ్కదీర
నిండు నూరేండ్లు మీరింక నిఖిలమందు
కావ్య రచనలు జేయుచు భవ్య మైన
ఖ్యాతి నొందగ గోరుచు కాంక్షదీర
యందజేతుసుభాకాంక్షలందుకొనుడు
మీ డా సముద్రాల శ్రీనివాసాచార్య