వృక్షో రక్షతి రక్షతః
మొక్కలు నాటండి
చెట్లను నరకకండి
మొక్కలు నాటండి... చెట్లను నరకకండి....
"కడుపు నింపే కూడు నేనే.. నీడనిచ్చే గూడు నేనే.. నువ్వు కట్టే బట్ట నేనే.. ఆయువు నేనే.. ప్రాణవాయువు నేనే.. కాడి నేనే.. పాడే నేనే.. నిన్ను కాల్చే కట్టె నేనే.. నేను తరువుని.. బతుకుదెరువుని.. కన్ను విప్పి కాంచరా.. ఒక్క మొక్కైనా పెంచరా.. - ఓ చెట్టు తన అంతరంగం ఇది"
హరితవనం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో మంచిది....
కానీ అవి నాటే ప్రదేశాలను విశదంగా పరిశీలించాలి...
ఒక మొక్క పెరిగి వృక్షంగా మారడానికి ఎంత కాలం పడుతుందో అందరికి తెలుసు....
ఎందుకంటే దూరదృష్టి లేకుండా చెట్లను నాటడం వలన....
అవి అభివృద్దికి ఆటంకాలని కూల్చిన సందర్భాలు కోకొల్లలు ...
వంద మొక్కలు నాటినదానికన్నా వచ్చే నష్టం....
ఒక వృక్షం కూల్చితే మనకు ఎంతో నష్టం వాటిల్లుతుంది ....
రోడ్ల ప్రక్కన మొక్కలు నాటడం....
రోడ్ల విస్తరణ అంటూ చెట్లను నరకడం.... మామూలే అయ్యింది....
వీటికి తోడు
యజ్ఙాలనుండి మొదలు...గృహ నిర్మాణాలు, వస్తు తయారీలు చివరికి చావుకు కూడా కర్ర ఎంతో అవసరం....
ఈ అవసరాలకు అవసరమైన వృక్ష సంపద మనకు కరువైందనే చెప్పవచ్చు...
భవిష్యత్తు అవసరాల కోసం వృక్షసంపద మనకు ఎంతో అవసరం....
నగరప్రాంతాలలో కనీసం కార్బన్‌డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సీజన్ ఇవ్వడానికి కూడా చెట్లు కరువయ్యావంటే అతిశయోక్తి కాదు....
అందుకే రోజుకో రోగంతో జనాలు అవస్థలు పడుతున్నారు ....
ఇప్పటికైనా మేల్కొందాం...
అవసరమైతేనే తప్ప చెట్లను నరకడం ఆపేద్దాం....
అవసరమైతే ట్రీ అట్రాసిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కుడా ఈ ప్రభుత్వాల మీద ఉంది....
మొక్కలు నాటగానే సరిపోదు....
చెట్లను నరకకుండా ఆపండి...
అదే మనకు పదివేలు....
వృక్షో...రక్షితో....రక్షితః
వృక్షాలను రక్షిస్దాం....అవిమనల్ని కాపాడుతాయి....
మీ
గోగులపాటి కృష్ణమోహన్
No comments:
Post a Comment