శీర్షిక : బాల్యం ఒక మధురం
చిలిపి చేష్టలు, కోతి గంతులు...
రంగుల ప్రపంచం లో...
స్వేచ్ఛా విహంగం....
తెలిసీ తెలియని వయస్సులో....
మిత్రులతో తగాదాలు....
అమ్మా నాన్నలకు శికాయిదీలు..
తెల్లారేసరికి మళ్లీ మిత్రులతో చెట్టపట్టాలు....
కోతి కొమ్మలు, చిర్ర గోనెలు,
బొంగారాల గిరగిరలు..
ఉప్పు బందరు, చార్ పత్తా..
దొంగబంతి, దాగుడు మూతలు....
గుడు గుడు గుంజం, గుండే రాగం...
వీరీ వీరీ గుమ్మడి పండు....
చెట్ల కింద అమ్మా నాన్నల ఆటలు, అష్టాచెమ్మలు, ఓనగుంతలు,
అచ్చన గుళ్ళు, అలెంకీలంక, చెడుగుడు చెడుగుడు,
పలిజూదం, దాడులు ఆడతూ. శివరాత్రికి పచ్చీసులు, మూడు ముక్కలు.... తొక్కుడు బిల్లలు...
బాగోతాలు, బొమ్మలాటలు...
ఇలా రోజులు ఎలా గడిచావో ఆనందంగా... హాయిగా....
బడికెళ్ళి వస్తూ రేగుపండ్లకై ఫైట్లు... చేతి నిండా గాట్లు....
మేడిపండుకోసం పాట్లు..
చీమలతో కాట్లు....
ఈత నేర్వడం కోసం లొట్టలకై పాట్లు... బాయిలో వేస్తే మునుగుతూ అగచాట్లు....
దరిచేరటం కోసం నానా పాట్లు... చేతినిండా మొరం గాట్లు....
అన్నం కలుపుతుంటే వేడి కారం మంటలు....
అమ్మ కలిపి పెడుతుంటే మమకారపు జల్లులు...
మల్లీ ఎప్పుడొస్తుందా బాల్యం ...
అని ఎదురు చూపులు...
రాదని తెలిసి నిస్పృహలు....
ఏది ఏమైనా బాల్యం ఓ మధురం...
మల్లీ రాని మధుర జ్ఙాపకం....
No comments:
Post a Comment