Sunday, January 24, 2016

కృష్ణ కందాల శతక మాల


గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాద్,


తేది : 24 జనవరి 2016
1)
తనుమనమున నీనామము
అనుదినమునునేను దలతు నయ్యా సాయీ!
కనికరమును జూపుమెపుడు
ఘననవ్యజ్యోతి కాంతి కందము కృష్ణా!

2) కం
సాయేకద మనకురక్ష
సాయేకద సర్వజనుల సకలంబాయే
సాయే తలచిన బ్రోవును
సాయేమరి భక్తజనుల సర్వము కృష్ణా

3)
రమణుని శిశ్యుం డీతడు
కమనీయ పదములతోడ కవితలు రాసెన్
రమణీయమైన గణితము
కమనీయముగా రచించె కవితలు వీరా

4)
వీరా చెప్పడు తప్పులు
వీరా రాసెను కవితలు వీరా శతకం
ఔరా అనిపించెకదర
వీరా తన గణితశాస్త్ర విజ్ఙత తోడన్

5)
రాయాలని ఉంది కవిత
తీయాలని ఉందినాకు తీయని కావ్యం
చేయాలని ఉంది రచన
గాయాలనుమానిపించ గతమును కృష్ణా

6)
వీరా బ్లాగులో కవితలు 
వీరోచితముగ మనలకు వివరించెకదా
వీరా రాసెను శంభో
వీరేకద గణితమున కవితలను యల్లెన్

7)
తలిచెద నేమణికంఠుని
తలిచెద నేశభరిగిరుని తలిచిన యంతన్
తలిచిన తలపులు తీర్చగ
కలియుగమునతనువెలసెనుకదరా కృష్ణా

8)
అంబటి భానుడి కవితలు
అంబరమును తాకెనుగద అబ్బుర రీతిన్
అందంగా శతకవితలు
అందించెను నేడు మనకు ఆనందించన్

9)
మాలాధారణచేసిన
మాలేకద మాకురక్ష మమురక్షించా
మాలతొ కదరా మనలకు
మాలామృత మహిమ తెలిసె మహిలో కృష్ణా

10)
వేసితి మాలను నేనూ
లేసితి నలుబది దినములు వేకువ జామున్
చేసితి షోడష పూజలు
చూసితి షణ్ముఖునిమాయ చూడగ తరమా!

తేది:  25 జనవరి 2016
11) 
శివశవయని పలికినచో
శివుడే  నిలుచును ఎదురుగ సత్యము యిళలో
శివుడే అభయుడు మనలకు
శివనామమె స్మరయించు శుభమౌ  కృష్ణా

12)
అదిగోవచ్చెనుఎన్నిక
ఇదిగిదిగోజనముచేరె ఇరుకున కొట్లో
అదియేకదమన ఓటరు
ముదమున తనవోటునమ్ము మనజుడు కృష్ణా

13)
ఒక్కరెకద వోటేయును
ఒక్కరెగద గెలిచి నీకు బొక్కలు చూపున్
ఒక్కరెకద సీటెక్కగ
లెక్కలు సక్కగ తెలపక వెలుదురు కృష్ణా

14)
నీతే దప్పిన నీకును
రాతే రాసెను కదలక రాయై బ్రహ్మా
రీతిగ బతుకుము ఇకపై
నీతిగ నలుగురిని మెప్పి నిలువుము కృష్ణా 

15)
అమ్మే గదరా మనకున్
కమ్మని పలుకుతొ మనమున కొలువై నిలిచెన్ 
అమ్మేకద మనకఖిలము
అమ్మే దైవము మనకిక యిళలొ కృష్ణా

16)
శ్రీ గుడిపల్లి వీరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో... 
చిరు కంద కానుక...

వీరుడు పుట్టిన రోజిది
వీరా తలచిన తలపులు విజయము గాంచున్
ఆరోగ్యము లందించగ
రారా కాపాడగ నువు రమణుని కృష్ణా

17)
తనయులు పుట్టిన చాలదు
వినయముతోపెరగవలెనువిజయము కొరకై
కన్నందుకుతలిదండ్రి
నినుచూసి పొంగి పొరలగ నిజమిది కృష్ణా 

18)
చదువుకొనిన చాలుకదా
కొదవుండదు తెలివితేట కోరగ నీకున్
చదువుమురాశ్రద్దగనువు
చదువే నినుచక్కబెట్టు చదువుము కృష్ణా

19)
ఏమని తెలుపుదు హితులకు
ఈమది తలపున మెదిలిన వలపులు మీకున్
ఆమని పాడిన పాటలు 
నామధి రంజింపలేదు నమ్ముము కృష్ణా

20)
ఉదయమ్మున చదువుకొనిన 
మదియందున పదిలముగనె మెదులును గదరా
అధికముగా గెలుపొందగ
ఉదయంబున లేచినీవు చదువుము కృష్ణా

తేది : 26-01-2016
21)
గోదావరి తట శిరిడీ
అందే ఉన్నది కలియుగ మందే సాయీ
హృదయ అంతరములలో
బృందావనమే కదా మరందము కృష్ణా

22)
జీవాధారుడు తానే
పావన అనగాయుడుమన పావన సాయీ
బ్రోవగ భక్తుల నెప్పుడు
నీవే సర్వము సఖలము నిక్కము కృష్ణా

23)
శరణాగతవత్సలతను
కరుణను మామీద చూపి కరుణించయ్యా
పరమేశ్వర సుర సాయీ
పరమ దయాళ పరమాత్మ పావన కృష్ణా

24)
అసహాయ సహాయుడతడు
రసమయ కరుణా పరాత్ప రాయుడు సాయీ
అసమాన దయాసాయీ
మసకలు తొలగించి మమ్ము మోయుము కృష్ణా

25)
భక్తావనవందితాయ
భక్తానుగ్రహ మహాయ భందువు సాయీ
భక్తిశక్తిప్రధాయ
భక్తావన ప్రతిజ్ఙాయ భాందవ కృష్ణా

26)
మునిసంఘనివేషితుడవు
అనంతదిత్య సుగుణాయ కరుణా రూపా
కనుమయ్యామణికంఠా
కనికరముతొనీమనమున కావుము కృష్ణా

27)
భుజంగభరణోత్తమాయ
గజాననగ్రజ మహా సుగుణజుడు శాస్త్రా
సుజనుల సులోచనాయా
నిజముగ జగదీశ్వరాయ నీవే కృష్ణా

28)
నిత్యాయనిత్యపూజిత
సత్యాయ సుగుణ ధరాయ సుమనస రూపా
దైత్యమధనాయ భలినే
అత్యాద్భుత ముద్రధారి నీవే కృష్ణా

29)
వీరాయ వీర ధన్వినె
ధీరాయ నిరుగుణరూప ధీరోద్దారీ
తారాసుర సంహారా
మూర్తాయ సకల మహోధ మునిపూజ్యంతా

30)
సతతోత్దితాయ భవాయ
సతతము నిన్నే కొలెచెద సత్యము దేవా
సతులే సిద్దీ బుద్దీ
పతుడవు విఘ్నము తొలపగ పూష్ణే కృష్ణా

27 - 01 - 2016
31)
వసుధారిణ్యైదేవ్యై
వసుధా ఇందిర హరిణ్య విష్ణో పత్న్యై
వసుధా  కృష్ణ ప్రియసతి
రుసరుసలనుమానిమములరక్షణజూపే

32)
సూర్యగ్రహపూజించుము
సూర్యున్నేతలచునీవు సూక్ష్మం గానూ
సూర్యధ్యానమ్ తోడను
సూర్యారిష్టలుతొలగును సత్యము కృష్ణా

33)
మనసున పీడలు కలిగిన
మనమంతాకొలవవలెనుచంద్రుని నిత్యం
మనసే కదమరి ముఖ్యం
మనసున నిత్యం కొలవుము మామను కృష్ణా

34)
రోగము కలిగిన మనలకు
అంగారకుడే కద ఆర్చును కష్టం
రోగారిష్టముతొలచుట
అంగారకునిచెకలగును అంజలి కృష్ణా

35)
బుద్దికి కలగిన పీడను
బుద్దిగ భక్తితొ బుదునికి పూజలు చేయుమ్
బుదుడే కదమరి మనలకు
బుద్దిని కలిగించి తొలచు బాదలు కృష్ణా

36)
పుత్రోత్సాహమె కావలె
పుత్రుల పీడోపశాంతి పోవలెయన్నన్
పుత్రుల ఇష్టుడు గురుడే 
పుత్రుల పీడను తొలచును పూజతొ కృష్ణా

37)
పీడలు ఎన్నో ఉన్నను
జాడకు పత్నీ మనలను జోరగ పీడ్చున్
పీడతొలగపూజించుము
పీడో శాంతికి శుకృడి పూజలు కృష్ణా

38)
శనిపూజలుచేయుమురా
శని కలిగించును మన శమనము పీడన్
తృనమున తొలగును పీడలు
శనికి మనము తిలము తోడ శక్తితొ కృష్ణా

39)
శమనాయునిపూజలతో
కమనీయముగా తొలగును కంటికి పీడన్
శమికింకరుడేరాహువు
నమమే నీకు యసురేష నవమేదాత్రే

40)
అనఘారాహోర్దాయా
వనస్థితో జ్ఙాన పీడితాయా కేతుం
మనముతొ కొలచిన కేతున్
ఘనముగ కలుగును జగతిన జ్ఙానము కృష్ణా

28-01-2016
41)
తెలిపితిరిచందమూలాల్
కలిపితిరి గణ పదములను కయ్యము లేకే
తెలిపె మధు విజయగార్లున్
మలిపిరి మము పధ్యరచన మంచిగ కృష్ణా

42)
గోమాతనుపూజించిన
గోమయ, గోమూత్రములతొ గోక్షీరంబున్
గోమాతే పూజ్యంతూ
గోమాతే సర్వసంధిగోవున్ కృష్ణా

43)
శ్రీగోశృంగేవిష్ణూ
శ్రీగోవుధరేపృధఁవిశ్రోణీపిత్రూ
శ్రీగోఖరాగ్రెపన్నగ
శ్రీగోరంగేషుసర్వ శ్రీకృతి కృష్ణా 

44)
గురురాఘవేంద్రదేవా
నిరవద్య గురవె భవాయ నిర్గుణ రూపా
నిరసత దోషాయ అనగాయ
ఉరసా శిరసా నమామి గురుగణనాధా

45)
శూరాయ మహా భలాయ
ధీరాయ సుగుణ శుచాయ ధీరోద్ధారా
కారాగృహ మోక్షకాయా
మారుతి రూపా మములను మార్చగ  రావా

46)
తెలుగంటే నాకు భయము
తెలుగంటే వ్యాకరణము తెలుగే కష్టమ్
తెలుగంటే ప్రేమేమరి
తెలుగును నే నేర్చుకుందు తప్పక కృష్ణా

నానార్ధాలతో ప్రయోగము
47)
ఆత్మయనిన గమనము              
ఆత్మయె మరి యాధారము ఆకసము కదా
ఆత్మయనిన నిజము మనసు
ఆత్మయె జీవాత్మ బుద్ది ఉన్నతి కృష్ణా 

48)
అమ్మే కద మాతయనిన
అమ్మే కద తల్లి యనిన అమ్మే సర్వం
అమ్మే కద భూమాతా
అమ్మే కద భరతమాత అమ్మే కృష్ణా

49)
తండ్రేకద అయ్య అనిన
తండ్రేకద నాన్నగారు తండ్రే  బాపూ
తండ్రేకద మనకు హితుడు
తండ్రే మరి మార్గదర్శి తండ్రే కృష్ణా

50)
భార్యేకద సతి భామ
భార్యే సహచరి కళత్ర భార్యే పెళ్ళాం 
భార్యే మరి ఆలి సతీ
భార్యామణి ధర్మపత్ని భార్యే కృష్ణా

51)
ప్రేమంటే వాత్సల్యము
ప్రేమే నమ్మిక అనురతి ప్రియతనమేగా
ప్రేమే మక్కువ మచ్చిక
ప్రేమంటేనే మురిపెము ప్రేమము కృష్ణా

52)
ప్రేమేకద అనురాగము
ప్రేమే పాశము నిరతము ప్రణయము నెమ్మీ
ప్రేమే కూరిమి గారము
ప్రేమే అభిమానగోము ప్రేమతొ కృష్ణా

53)
ప్రేమే మరి ఆప్యాయత
ప్రేమే మమకారము మన ప్రేమే ఇంపూ
ప్రేమే కద గారాబము
ప్రేమే మారాము మలిమి ప్రేమతొ కృష్ణా

54)
ప్రేమేలే అభిమానము
ప్రేమే మరి మరులు మమత ప్రేమించంగన్
ప్రేమే లే వ్యామోహము
ప్రేమే లే వలపు మమత ప్రేమే కృష్ణా

55)
అనుబందము ప్రియతత్వము
అనుగునెనరు ఆదటన్న అమరముప్రేమై
అనురక్తి నెయ్యం ప్రేమే
అనురాగము ముచ్చట సుమి అభిమతి కృష్ణా

29-01-2016
56)
ధరణి యనిన భూమేకద
ధరణీ ఖగవతి జగత్తు ధరణము గౌరీ
గిరికర్ణిక ఇల అవనీ
ధరణీ పృధవీ ధరిత్రి ధాత్రీ కృష్ణా

57)

వృక్షో రక్షో రక్షిత
వృక్షములను పెంచము రక్షించవలే
వృక్షో నాస్తీ శూన్యం
వృక్షములిక లేకున్నను విలయమె కృష్ణా

58)
తినడానికి తనకుండదు
తనపశువులకుయికమేత తెచ్చుట కష్టమ్
తనకిష్టములేకున్నను
తనపశువులనమ్మబోయె తక్కువ దరకున్

59)
రైతేరక్షోరక్షిత
రైతేకద మనకురక్ణ రైతే సర్వం
రైతే మనకాధారము
రైతును కాపాడవలెను రంజుగ కృష్ణా

60)
సంపద కలిగిన వాడికి
ఇంపుగ తొలగించుయప్పు బ్యాంకులు రీతిన్
సంపాదన లేనోడిని
సంపైనా బ్యాంకుతెచ్చు సుంకము కృష్ణా

61)
మహిళే కదమన మాతా
మహిళే కద అక్క చెల్లి అన్నీ తానే
మహిళే కద ఆంటియనిన
మహిళే మరి అమ్మ బామ్మ మహిలో కృష్ణా

62)
మహిళో రక్షో రక్షిత
మహిలో మహిళే కదమరి మనకున్ రక్షా
మహిళలు లేకుండమనకు
మహిలో మన్నికనెలేదు మరవకు కృష్ణా

63)
పోలీసులెకద రక్షణ
పోలీసులెదిక్కుమొక్కుదీనులకెపుడున్
పోలీసులెలేకున్నను
పాలిట లేదాయె రక్ష ప్రాణికి కృష్ణా

64)
ఊష్ణాంశుడు ఆదిత్యుడు
ఊష్ణకరుడు అహిమాంశుడుధరతి రవియే
ఊష్ణుడు దినకరుడు ఇనుడు
ఊష్ణరశిమి అరుణకిరణు డుష్ణుం డితడే

30-01-2016
65)
గ్రేటర్ ఎన్నిక లొచ్చే
రాటుగ  తిరుగుతు పలువురు మాటలె జెప్పే
దీటుగ ఓటరు ఓటుతొ
ఘాటుగ రుచి చూపెడదరు గెలుపును కృష్ణా

66)
గ్రేటరు ఎన్నిక లోనా
చాటుగ డబ్బులు వరదల చల్లిన గానీ
లేటుగ లేచిన ఓటరు
నీటుగ గెలిపించు తనకు నచ్చిన నేతన్

67)
పోరేమోస్పీడుపెంచె
కారూ సైకిల్ కమలము కదమున హస్తం
హోరుగ పతంగి ఎగరగ
తీరును గమనించుచుండె ఇతరులు కృష్ణా

68)
నగరమున నేడు మ్రోగెను
నగర భవిత తెలియజేయు నాందికి గంటా
నగరము నడిబొడ్డుకొరకు
నగరములో జరుగుచుండె నెన్నిక కృష్ణా

69)
ఎవ్వరు నిలిచెను భరిలో
ఎవ్వరు గెలిచెదరునేడు ఎన్నిక ఝరిలో
ఎవ్వరు ఎవరో తెలియదు
ఎవ్వరు గెలచిన నగరము మెరుగవు కృష్ణా

70)
ఓటే వేయుము ధీటుగ
ఓటే మనహక్కుదిక్కు ఓటే సర్వం
ఓటును డబ్బుకు అమ్మకు
ఓటే నీ భవిత మార్చు చోటౌ కృష్ణా

30-1-2016 (గాంధీ వర్ధంతి సంధర్భంగా)
71)
చేతిలొ కర్రనె బట్టే
శాంతియె తన ఆయుధంగ శంఖము ఊదెన్
ధోతీ వాలా గాంధీ
రాతనె మార్చంగ భరత జాతిన కృష్ణా

72)
పరదేశీపాలనలో
చెరనుండి విముక్తిచేసి చెంతే దీర్చెన్
కరమున కర్రతొ గాందీ
నరనరమున నింపెమనకు నవ్యానందం

73)
గాంధీతాతను చంపెను
భందీగానిలిచె గాఢ్సే భరతమునందున్
మందీ మార్భల ముండిన
గాంధీజీనొదలలేదు గాఢ్సే కృష్ణా

74)
ఏతీరుగనిను పిలుతుము
ఏతీరుగ నినుదలతుము ఏమని బాపూ
చేతులు జోడించి నిన్నే
నీతిగ నిలుతుము నిరతము నీలా కృష్ణా

75)
గాంధీమనజాతికిపిత
గాంధీజీమార్గదర్శి ఘనముగ మనకూ
గాందీజీ కలలుగనిన
గాంధీయిజభారతాన్ని అందిద్దామూ

31-01-2016 (బాల్యం గుర్తులు)
75)
అదిగో బాల్యపు గుర్తులు
ఇదిగో ఎంతగ మరచిన ఇచటనే ఉండున్
కదిలే కాలము తోడను
మదిలో నిత్యము తొలచును మమతలు కృష్ణా

76)
ఆటలతోటేస్నేహము
ఆటల తోటే కలహము అదియెట్లన్నన్
ఆటలలోగెలుపోటమి
కూటమిలను కలుగజేయు కూరిమి తోడన్

77)
పీరుల పండుగ వచ్చిన
ఊరిలొ పీరులు ఎగురును ఊరేగింపున్
పీరుల పండుగ రోజున
జోరుగ ఆలువ తిరుగుతు చోద్యము చూద్దుర్

78)
పండుగ లొచ్చిన సెలవులు
అండగ ఉందురు మితృలు ఆటలు యాడన్
నిండుగ బందువు లొత్తురు 
వండిన వంటలు తినెదరు వడివడిగానూ

79)
కూనూరులొ పుట్టిపెరిగి
భోన్గీరులొ చదువుకొంటి భోగము తోడా
బాల్నగరుకు బతకొస్తీ
నేనూరిని మరిచి నాను నేర్పుగ కృష్ణా

80)
పోరాటాలనుజేసీ
తీరాలను దాటుకుంటు తీరిక కోసం
వూరూరా తిరిగొస్తిని
సూరారంలోననుంటి సుఖముగ కృష్ణా 

81)
(వీరారెడ్డి గారు "తిట్టుము" అనే ఆంశం పై కవితలు రాయమని అవేరా గారికి చెప్పగా తట్టిన ఆలోచన పద్యరూపంలో)

తిట్టిన తిట్టును తిట్టక
తిట్టన వాడే ఘనుండు ఏదెటులున్నన్
తిట్టుము అని యనగానే
తిట్టెను వీరను అవేర తీపిగ కృష్ణా

82)
(అవేరా ఇచ్చిన "కవ కువ కవి" పదాలతో పద్యరచనా ప్రయత్నము)

కవనము లల్లగ కవులున్
కువనములవలెయగుపించె కవితలు యెల్లన్
కవికవనములేకదరా
కువకువలుగ వినిపించును కవులకు కృష్ణా 

83)
(సహస్ర కవయిత్రి అరుణ అలిగెనని అందరు అనుకోగా రాసిన కవిత)

అలుగుట యన్నను యెరుగదు
అలకలు యేల యనుచుండె అరుణే యెపుడున్
అలుగుట యెరుగని అరుణే
అలిగిన నాడా ఫణీంద్రుడలుకలు దీర్చున్

84)
(అవేరా గారు ఇచ్చిన పదాలు " శివ, భవ" నవ లతో పద్యరచన)

శివ శివ యని తలచిననే
భవహరుడేతెంచునుకదభక్తుల బ్రోవన్
శివుడే కద అభయహరుడు
శివుడే నవనాయకుండు శివుడే కృష్ణా

85)
(అవేరా గారిచ్చిన వినండి, కనండి, మనండి, కొనండి పదాలతో పద్యరచనా ప్రయత్నము) 

మంచిని వినండి తప్పక
కంచిని మరువక కనండి కనులారంగా
పంచమనండి ఫలమును
కొంచెము భక్తిని కొనండి కోరిక తోడన్

తేది: 01-02-2016
86)
గోడలు కూల్చుము కులముల
గోడలు కూల్చుము మతముల గొడవలు వలదూ
గోడలె మన ఎదుగుదలకు
గోడై నిలుచుందికదర గొడవకు కృష్ణా

88)
ఆలూ మగలూ ఇద్దరు
పాలూ నీళ్ళూ విధముగ బాగుండాలీ
ఆలే కద అన్నింకను
తాలికొరకెతానుపడును తాపత్రయమూ

89) 
(శ్రీ గుండు మధుసూధన్ గారి సమస్యా పూరణాలకు స్పందించి రాసిన పద్యము)

అక్షరములతోటేతను
లక్షణముగ యాడుకొనును లఘుగురువంటూ
భక్ష్యములేమధుసారుకు
తత్ష్కణమేపద్యమల్లుధన్యుడు కృష్ణా

90) (కందములో వచ్చే గణాల గురించి సూక్ష్మ వివరణ)

భగణములోయాదిగురువు
జగణములో మద్యగురువు జగమున కందం
సగణములోఅంత్యగురువు
గగగురువులు నలలఘువులు ఘణముగ కృష్ణా


91
 (గగ నలములతో ప్రకృతి అందాలను కందంలో బందించే ప్రయత్నము)

తలతల మెరెసెను మెరపులు
ఫలఫల ఉరిమెను ఉరుములు భయములు  కాగా
జలజల కురిసెను చినుకులు
కొలనులొ విరెసెను  కమలము కొలదిగ  కృష్ణా

92)
అరాశ గారిచ్చిన కాపాడు కోరాడు తాగాడు పోతాడు పదాలతో పద్యరచన ప్రయత్నం

కోమలి ఆడుము కృష్ణా
గోముగ అలరాడుమాతొ గోపిక లోలా
ప్రేమగచిరుగాడుపులతొ
ప్రేమగ తాగాడు నాడు పూతన పాలు

93) 
(కవి మితృలు అంజయ్య గౌడ్ గారు శతకవితలు పూర్తి చేసిన సందర్భంగా పద్య కానుక) 

అంజన్న వ్రాసె శతకము
మంజీర నినాదముల వలె మధురము గాగన్
రంజుగ వ్రాసెను పద్యము
అంజన్నా అందుకొనుము అంజలు లివిగో

02-02-2016
94)
ప్రేమంటెకాదు ప్రేయసి
ప్రేమే మాతాపితరులు ప్రేమయె సర్వం
ప్రేమే ప్రేయసి కాదుర
ప్రేమించేవారికొరకు ప్రేమను పంచుమ్

95)
రంగందముండియేమీ
యింగితముతొయుండవలెను యెల్లర జనులున్
సంఘము లోరంగుకన్న
యింగిత మున్నోలకేను యిలువలు కృష్ణా

96)
ఈర్షా ద్వేషాలువలదు
హర్ష్యావ్యతిరేకములును అసలే వద్దూ
ఈర్షా ద్వేషాలె కదర
హర్షము లేకుండజేసు అవనిలొ కృష్ణా

97)
సుఖమే కద సంతోషము
సుఖమే లేకుంటెమనిషి సూక్ష్మంగానూ
సుఖమే సద సంతోషము
సుఖమున్నది సేవలోన సుందర కృష్ణా

98)
తలచకు కీడును మదిలో
తలచిన కలుగును మనలకు తగువులు  యెన్నో
కలవకు కీచక మిత్రుని
వలదుర నీచపలవాట్లు వసుధలొ కృష్ణా

99)
చదువే కదరా భవితా
చదివే కదమనకురక్ష చదివిన యంతన్
చదువే మరి సర్వస్వము
చదువే మరి చదువవలెను చదువుము కృష్ణా

100)
కందములేవందాయెను
అందముగాకవనములనుఅందించితిగా
చంధో రీతిగ నడపగ
ఎందరొ కలరే గురువులు వందన మిదియే


లింగని గని తాను లేచిపోయె

101)
మనసెరిగిన మగనికొరకు
అనువనువునవెదికెమామ అల్లుని కోసం
కనిపెట్టినభామదిగని
తనలింగని గని తనులేచిపోయె

102)
తెల్లనికురులనుచూడుము
ఎల్లరకునువచ్చుచుండె ఏమని తెలుపన్
నల్లగ మారుట కెన్నియొ
కొల్లలుగావచ్చెనేడు కలరులు కృష్ణా

103)
అల్లమనినతెలుసునుకద
బెల్లమువలె పుల్లగుండు భలెబాగుండున్
పుల్లటి బెల్లమె అల్లము
సల్లగ తేనీరువలెనె సేవించవలెన్

104)
తప్పుడు పనులను చేయగ
తిప్పలు దప్పవు ఎవరికి తెప్పలు గొచ్చున్
తప్పులు జేయుట కంటెను
ఒప్పుగ బతుకుట నయముగ ఓరిమి తోడన్

*********************************
★ వందన సమర్పణ ★

నేటికి నా కంద పద్య శతక యజ్ఙము పూర్తయినది.
ఎన్నో తప్పొప్పులు తడబాటులు, పలుమార్లు గతి తప్పిన యతి ప్రాసలు. అయినా ఎప్పటికప్పుడు తప్పులనెంచితూ... సవరణలను చేసి సూచనలను అందించిన పద్య కవులు, భాషాప్రవీణులందరికీ...🙏 కంద వందనాలు.... 
ముఖ్యంగా
ఇందులకు నాకు ఎంతగానో సహకరించి ప్రోత్సహించిన మధుసార్ గారికి, విజయ ద్వయాలకు, వీరా, అవేరాలకు, అంజన్న, చంద్రన్నలకి, అరాశ గారలకు, కడబాల మరియు ఇతర మిత్రులకు, కవయిత్రులకు నా హృదయపూర్వక నమస్కృతులు యెలియజేస్తూ తప్పులున్న క్షమించగలరని ప్రార్ధన...
మీ
కవి మితృడు

గోగులపాటి కృష్ణమోహన్
9700007763

26 comments:

  1. 🌺 వాహ్వాహ్వా...!

    చాలాచాలా బాగుంది....

    పుస్తకంలో పెట్టేయండి....!

    🌺🌺🌺✅💐✅🌺🌺🌺

    క్రిష్ణమోహన్ సార్...!!

    కళాచందర్

    ReplyDelete
  2. క్రిష్ణమోహన్ గారి కందం
    "రెట్టింపు"
    కమనీయముగా ఉంది👌

    సల్లా విజయ్ కుమార్, షాద్ నగర్,

    ReplyDelete
  3. కృష్ణమోహన్గారు కందము అందముగా ఉంది
    మీ
    అంజయ్య గౌడ్

    ReplyDelete
    Replies
    1. కం...వందనము కృష్ణ మోహన్
      వందనమిదె శతకవితలు వ్రాసిన నీకున్
      వందనమిదె పదిరోజులు
      విందొనరించితివి పద్య విరులతొ కృష్ణా!!
      అభినందనలతో అంజయ్యగౌడ్

      Delete
    2. కం...వందనము కృష్ణ మోహన్
      వందనమిదె శతకవితలు వ్రాసిన నీకున్
      వందనమిదె పదిరోజులు
      విందొనరించితివి పద్య విరులతొ కృష్ణా!!
      అభినందనలతో అంజయ్యగౌడ్

      Delete
  4. .
    కవితలు చాలా చాలా బావున్నయి.
    కృష్ణమోహన్ గారు
    పద్యరచనలకు శ్రీకారం చుట్టి. ప్రయత్నించడం వారి ఉత్సాహం కనపడు చున్నది....

    మాదవీలత

    ReplyDelete

  5. ***************
    గోగులపాటివారూ! నేను తెలిపిన కిటుకు విజయవంతమైనట్టులఁ గనిపించుచున్నది. అభినందనలు.
    వీరా గారిని నుతించుచు మీరు రచించిన పద్యములు (3, 4, 5, 6) బాగున్నవి.
    *************************
    గుండు మధుదూధన్, వరంగల్,

    ReplyDelete
  6. 👏👏👏గోగులపాటి వారికి

    అవేరా

    ReplyDelete
  7. ప్రథమ ప్రయత్నముననే ధారాళమైన నడకతోఁ గందపద్య మాకందఫల మాధుర్యమునుఁ జవిచూపించిన గోగులపాటి కృష్ణమోహనులవారికి హృదయపూర్వక శుభాకాంక్షలు🌺🌺🌺🌷🌷🌺🌺🌺
    గుండు మధుసూదన్, వరంగల్.

    ReplyDelete
  8. .
    🌺

    తొలి శతకంకై వెళ్ళేదారిలో
    వొకేరోజు వొక్కవుదుటున
    తొలి దశకం పూర్తిచేసిన శుభసందర్భంగా...

    క్రిష్ణమోహన్ గారికి....

    🌺 హ్రుదయపూర్వక
    శుభాకాంక్షలు...!! 🌺

    🌺🌺🌺✅💐✅🌺🌺🌺
    మీ
    కళాచందర్

    ReplyDelete
  9. దశ కందునకు
    నమస్కారాలు

    దశ కందా.....
    కృష్ణ మోహనా....నమోనమః
    తొలి ప్రయత్నం బాగుంది
    మీ
    గుడిపల్లి

    ReplyDelete
  10. గురూజీ వేసితి మాలలు . . . ఎంత బాగా అసలు చదువు రాని వారికి కూడా అర్దం అయ్యేంత సులభం గా
    👏👏👏👏👏💐
    సార్ 8లో కృష్ణ లేకుండా రాశారు
    అరుణ, హన్మకొండ

    ReplyDelete
  11. దశకందాలమాల. అందాన అందగించినది
    తావై. మీ కవితా కుసుమ. మిసిమి.
    దశదిశలువ్యాపించవలె
    కృష్ణ మోవినానిన మధుర
    మురళీ రవళివోలె
    పట్టుదలయటన్న నీదెసుమా భళా. గోగులపాటి
    ఆసకిని. చూడ. ఘనాపాటి
    నీవెకదా మా సహపాఠి
    కావాలి మీరు అన్నిటా మేటి

    రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

    ReplyDelete
  12. శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారి కందములన్నియు చక్కగానువ్నవి
    పరిష్కృతము తర్వాత మచ్చలు వీడిన ప్రవళములై యున్నవి
    🙏🍀🌱(tiranga)🍀🌱🙏
    పార్థసారథి నాయుడు దగ్గుపాటి

    ReplyDelete
  13. I krushna గారు జ్యోతిష్యం గురించ బాగుగా రాసారు .మాకు కొంచెం తెలపండి .
    పోకూరి చంద్రశేఖర్, అనంతపూర్.

    ReplyDelete
  14. అంబటి భానుప్రకాశ్.

    కృష్ణుడు గదలెను రాయగ

    విష్ణువు వలెనే వదలక వీడడు కావన్

    తృష్ణను గలిగెను మనసున

    కృష్ణుడు జెప్పిన వినడిక కార్యము నందున్.

    ReplyDelete
  15. గోగులపాటివారు
    మీకందాలందాలై
    చదువరుల. మనసునింపు. నానందాలు
    ఎన్నతరమా మీ సాధనా
    చందాలు
    అందించు. అక్షర. గంధాలు
    వేడు. ముకుందు
    పాద మందారాలు


    దీన్ని మీ. కందుల మాల ను
    చేర్చండి ప్లీజ్
    నాకు ఎలా పెట్టాలో
    తెలియలేదు

    రాజావాసిరెడ్డి మల్లీశ్వరి

    ReplyDelete

  16. నీ వేగము నేమనియన
    నీ వేగము సల్లగుండనీయని యందున్
    నీవే కదమా మదిలో
    నీవే మాకవన హృది నిక్కము కృష్ణా!!


    🙏🙏🙏

    గుడిపల్లి వీరారెడ్డి

    ReplyDelete
  17. నేటికి నా కంద పద్య శతక యజ్ఙము పూర్తయినది.
    ఎన్నో తప్పొప్పులు తడబాటులు, పలుమార్లు గతి తప్పిన యతి ప్రాసలు. అయినా ఎప్పటికప్పుడు తప్పులనెంచితూ... సవరణలను చేసి సూచనలను అందించిన పద్య కవులు, భాషాప్రవీణులందరికీ...🙏 కంద వందనాలు....
    ముఖ్యంగా
    ఇందులకు నాకు ఎంతగానో సహకరించి ప్రోత్సహించిన మధుసార్ గారికి, విజయ ద్వయాలకు, వీరా, అవేరాలకు, అంజన్న, చంద్రన్నలకి, అరాశ గారలకు, కడబాల మరియు ఇతర మిత్రులకు, కవయిత్రులకు నా హృదయపూర్వక నమస్కృతులు యెలియజేస్తూ తప్పులున్న క్షమించగలరని ప్రార్ధన...
    మీ
    కవి మితృడు

    గోగులపాటి కృష్ణమోహన్
    9700007763

    ReplyDelete
  18. వహ్వా! భేష్! బాగున్నది! కందమును వ్రాయ నారంభించిన పది దినములలోనే కంద పద్యములు నూఱింటిని రచించి ప్రకటించిన సుకవి మిత్రులు శ్రీ గోగులపాటివారికి నమఃశత పూర్వక శుభాభినందనలు!

    ReplyDelete
  19. కవి మిత్రులు కృష్ణమోహన్ గారూ, కందం వ్రాసిన వారే కవులంటారు.అటువంటి కందాలను వందకు పైగా ఇంత తక్కువ కాలంలో అందంగా, మధుర మధు రస నిష్యందంగా మాకందించిన మీకు శుభాభినందనలు!!!

    ReplyDelete
  20. కవి మిత్రులు కృష్ణమోహన్ గారూ, కందం వ్రాసిన వారే కవులంటారు.అటువంటి కందాలను వందకు పైగా ఇంత తక్కువ కాలంలో అందంగా, మధుర మధు రస నిష్యందంగా మాకందించిన మీకు శుభాభినందనలు!!!

    ReplyDelete
  21. శత పద్యరచన చేసి ప
    ఠితృకవి హృత్కందముల తటిల్లత వోలెన్
    ద్యుతిమానుడైన సుకవిన్
    నుతియించెద కృష్ణ మోహనున్ రస హృదయున్
    సి విజయ్ కుమార్,

    ReplyDelete
  22. శత పద్యరచన చేసి ప
    ఠితృకవి హృత్కందముల తటిల్లత వోలెన్
    ద్యుతిమానుడైన సుకవిన్
    నుతియించెద కృష్ణ మోహనున్ రస హృదయున్
    సి విజయ్ కుమార్,

    ReplyDelete
  23. గోగులపాటి కృష్ణమోహన్ గారి కమనీయ కందపద్యాల రుచి ఏమని చెప్పెద!! అవలీలగా తనకలము నడిపించె “వీణా పాణి”మన అమ్మ వాణి, చరితార్థుడవోయ కృష్ణమోహనా నీవు చరితార్థుడవు.
    మీ మిత్రుడు
    కడబాల.....
    💐💐💐🙏🙏🙏👌👌👌

    ReplyDelete