Friday, January 22, 2016

ఇదెక్కడి న్యాయం....

అయిత కవితా యజ్ఙము
SK 326 - 20

గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు.

అంశం : సామాజికం
శీర్షిక: ఇదెక్కడి న్యాయం

చిన్న దొంగలను బట్టి చితకబాదుతారు
పెద్ద దొంగలకేమో పట్టం కడతారు

వందగజాలోన్ని ఉరికిచ్చి తంతారు
వందల ఎకరాలు అప్పనంగిస్తారు

చిన్న అప్పులోలను నలదీస్తు ఉంటారు
కోట్లుఎగగొడ్తేమో కొంచమైనా అడగరు

అప్పు కావాలంటే కాలేల బడుతారు
అప్పుతీర్చమంటే కేసుపెడతంటారు

ప్రభుత్వ సార్లే పాఠాలు చెబుతారు
వారి పిల్లలేమో ప్రయివేట్కు వెలతారు

పేదోడి బియ్యము పక్కదారినపట్టె
బక్కోడికి ఒక్కరూపాయి రేషనే కరువాయె

కాంట్రాక్టుల పేరుతో కాసులపంట
కానరాదు ఎచట అభివృద్ది పంట

ఓట్ల పేరుతోనే ఖర్చు పెట్టె కోట్లు
గెలిచినాక చూడు నిధులకు తూట్లు

పైసలున్నోడికే మీడియాలో చోటు
డబ్బులేనోడికి అన్నీ అగచాట్లు

ఇదెక్కడి న్యాయమని అడిగెటోడే లేడు
అడిగినాడంటే వాడౌవుతాడు పిచ్చోడు

బయమేల సోదరా కలముండ నీకడ
కవనములతోడనే నిలదీయగలవురా

No comments:

Post a Comment