శీర్షిక : పేదవాడి పాట్లు
పొద్దున్నే లేచి సద్దికట్టుకొని అడ్డామీదికి వెళ్తాం....
పని కోసం మేస్త్రీల వెంట పడతాం....
పోటీలను చూసిన మేస్త్రీ మాతో బేరమాడుతాడు....
మాపటిపూటకు తిండి కావాలంటే
ఎంతకో అంతకు ఒప్పుకోవాల్సిందే...
రోజంతా పని... బరువైన పని..
ఇల్లుచేరినాక ఒల్లంతా నొప్పులు...
నొప్పులు పోనీకి ఓ పావు తిప్పలు....
ఇంకెం...
సంపాదించిన దాంట్లో సగం ఖతం
దొడ్డుబియ్యపు అన్నం....
పచ్చడి. పచ్చిపులుసు....
ఇదే మాకు పంచభక్ష్య పర్వాన్నం...
మల్లీ పడుకున్నామా - తెల్లారిందా...
బందులు విందులూ పోనూ
నెలకు ఇరువై రోజులు పని
తాగనీకి తిరగనీకి పోనూ
మిగిలింది తిననీకి సరిపోయే...
ఇక
ఊల్లో చేసిన అప్పులేం గాను
పోరగాలను ఎట్ల సదివించేది...
అయ్యమ్మకు ఏం పంపేది....
చెల్లె పెండ్లెట్ల జెయ్యాలి....
పెండ్లాం పిల్లలకు రోగమొస్తెట్ల...
అన్నీ ప్రశ్నలే... సమాదానం కరువు...
పేదవాడి జీవితం అందుకే బరువు...
ఓ దేవుడా వచ్చే జన్మంటూ ఉంటే
మానవుడిగా మాత్రం పుట్టించకు...
అదీ పేదవాడిగా అస్సలు పుట్టించకు...
No comments:
Post a Comment