Friday, March 24, 2017

బతుకమ్మ పండుగ


బతుకమ్మ పండుగ

ఈ ప్రపంచ చరిత్రలో బతుకమ్మ అంతటి గొప్ప పండగ మరోచోట లేదంటే అతిశయోక్తి కాదు.


తంగెడు, ముత్యాల, గునుగు పూవులుతెచ్చి
పళ్ళెంలొ అందంగ బతుకమ్మని పేర్చి..
కొత్త చీరలుకట్టి, మెండుగా ఆభరణాలువేసి..
అమ్మలక్కలంత.... ఆడపడుచులంత
ఒక్కచోట చేరి ముచ్చటించుతారు....
కొత్త పాత తరము ఒక్కటవ్వుతారు.
జ్ఙాపకాలనెన్నొ నెమరువేసుకుంటు...
పాట పాటుకుంటు.... ఆటలాడుకుంటు...
బతుకమ్మ పండుగను బహుబాగ జరుపుతూ....

చెరువులోన నీరు కలుషితం కాకుండ...
పూలు చేసు ఎంతో మేలు చెరువుకంటు...
బతుకమ్మలన్నియు నీటవదులుతారు...
ఊరుబాగుకోరు చెరువులోన..

ఎంగిలి పూలు మొదలు
సద్దుల బతుకమ్మ
తొమ్మది రోజులు గౌరికి పూజేసి
సౌభాగ్యమిమ్మని వేడుకొంటారు.
తొమ్మది రకముల సద్దులనే జేసి
సద్దుల బతుకమ్న జరుపుకుంటారు...

తొమ్మిది వేలకు పైగ పడుచులంతాకలిసి
రాజధానిలోన బతుకమ్మ ఆడారు...
రికార్డు చేశారు... గిన్నీసుకెక్కారు...
తెలంగాణ ఖ్యాతిని దునియాకు చాటారు...

బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ...
బతకనీయవమ్మ పాడిపంటలనెల్ల
బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ...
చల్లగా చూడమ్మ ఇంటిల్లిపాదిని
బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ...
మాయమ్మ నువ్వమ్మ... మమ్మేలు మాయమ్మ....


మీ అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో

మీ గోగులపాటి కృష్ణమోహన్ మరియు కుటుంబ సభ్యులు

Saturday, March 11, 2017

నా జీవనజ్యోతి


 గోగులపాటి కృష్ణమోహన్ 😊:
 నా జీవన జ్యోతి

తెలిసీ తెలియని వయసులో పెళ్ళి
అమాయకత్వం ఒక వైపు....
చదువాలని ఉన్నా చదవలేని దుస్థితి...
గారాబంగా పెరిగిన బాల్యాన్ని వదిలి
ప్రేమతో పెంచిన తన వారిని వదిలి...
ఆటపాటలొదిలి.... ఆత్మీయులనొదిలి
నా జీవిత భాగస్వామిగా
పుట్టిళ్ళు వదిలి మెట్టింట అడుగెట్టింది
నా జీవన జ్యోతి....

అడుగడుగునా.... సమస్యలు
చాలీ చాలని జీతాలతో...
జీవితాలను గడపడం....
ఆర్ధిక సమస్యలు ఒక వైపు....
ఆరోగ్య సమస్యలు మరొక వైపు....
ఇన్ని సమస్యల్లో....
నాకు వెన్నంటి ఉండి....
చీకటి మయమవుతున్న నా జీవితంలో
వెలుగు రేఖలు నింపింది.
నా జీవన జ్యోతి....
[3/10, 1:11 AM] గోగులపాటి కృష్ణమోహన్ 😊: ఈ రోజుతో (10-03-2017)  తను నా జీవితాన్ని
పంచుకొని ఇరువైనాలుగు వసంతాలు.... పూర్తి కానున్నాయి.

ఈ సందర్భంగా
నా సహధర్మచారిణి మున్ముందు
సుఖసంతోషాలతో....
ఆయుర్ ఆరోగ్యాలతో..
అష్టైశ్వర్యాలతో.. తులతూగాలని
అభిలషిస్తూ....
మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

ఎక్కడుంది సమానత్వం

గోగులపాటి  కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాద్.


శీర్షిక : ఎక్కడుంది సమానత్వం?

ఎక్కడుంది సమానత్వం?

స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు కావస్తున్నా....

గణతంత్రమొచ్చి అరువైయేడేళ్ళు దాటినా....
చట్టాలు... న్యాయాలు ఎన్నున్నా...

రాజ్యాంగాలలో ఎన్ని సవరణలు జరుగుతున్నా ...
ఎక్కడుంది సమానత్వం?

ఒకపక్క .....
లక్షాధికారి కోటీశ్వరులవుతుంటే

మరోపక్క....
మధ్యతరగతి వాడు కడు బీదవాడుగా మారుతుంన్నాడు....

ఎక్కడుంది సమానత్వం?

కాంట్రాక్టర్లు కోట్లు కుమ్మగొడుతుంటే....
కార్మికుడు కర్షకుడు కూడు దొరక్క చస్తున్నాడు...

కోటీశ్వర్లు కార్లలో తరుగుతుంటే....
సామాన్యుడు కాళ్ళరిగేలాగా తిరుగుతున్నాడు...

ఎక్కడుంది సమానత్వం?

ఉన్నోడు తరతరాలకోసం తరగనంత ఆస్తి సంపాదిస్తుంటే...

లేనోడు తలతాకట్టు పెట్టి బతుకీడుస్తున్నాడు.....

డబ్బున్నవాడికి ఒకన్యాయం....
లేనోడికి మరో న్యాయం....

డబ్బున్నోడికి ఒక వైద్యం...
లేనోడికి మరో వైద్యం...

ఎక్కడుంది సమానత్వం?

చనిపోయాక పూడ్చిపెట్టే బొందలో తప్ప ...
చనిపోయాక కాల్చివేసిన బూడిదలో తప్ప....

ఎక్కడుంది సమానత్వం?

మీ
సహస్రకవిమిత్ర, ,
సహస్రకవిరత్న,
శతపద్యకంఠీరవ,
బతుకమ్మ జాతీయ పురస్కార గ్రహీత
గోగులపాటి  కృష్ణమోహన్
9700007653

హేవళంబి - ఉగాది

గోగులపాటి కృష్ణమోహన్

ముందస్తుగా....
హేవలంబి నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు

ప్రతియేడు
శిశిరం లో ఆకు రాలిన చెట్లన్నీ
చైత్రం లో చిగురిస్తున్నాయి... కానీ...

ఇంతవరకు
మోడు బారిన జీవితాలలో మాత్రం
పెట్టుకున్న ఆశలు ఇంకా చిగురించడం లేదు...

అరువై తెలుగు వత్సరాలు
ఒక దాని వెనుక ఒకటి
వస్తున్నాయి వెల్తున్నాయి

ప్రతి ఉగాదికి షడ్రుచుల పచ్చడి
తింటున్నాము కానీ...
మాకు మాత్రం అందులో చేదే మిగులుతుంది..

ఇక తీపి విషయానికి వస్తే...
అది నోటికి అంటకుండా...
ఒంటికి వచ్చి చేరింది...

ఇక ఉప్పు కారాలు...
కుటుంబమన్నాక షరా మామూలే...

పులుపు వగరు లు...
గెలుపులో మలుపులు లాంటివి...

ఏది ఏమైనా మరో ఉగాది కోసం
మళ్ళీ మళ్ళీ వేయి కళ్ళతో వేచి చూస్తున్నాము...


ఈ యేడైనా మా జీవితాలలో ...
కొత్త ఆశలు చిగురిస్తాయనీ...
ఆశతో... ఆకాంక్షతో...
మరో ఉగాది... తెలుగు వత్సరాది...
హేవలంబి నామ సంవత్సర....
ఉగాదికి స్వాగతం పలుకుతున్న...
శుభాకాంక్షలు తెలుపుతున్నా...


మీ
గోగులపాటి కృష్ణమోహన్
(సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న, శతపద్యకంఠీరవ మరియు బతుకమ్మ జాతీయ పురస్కార గ్రహీత)u